Jump to content

Recommended Posts

Posted

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌రోనా.. ఫామ్‌హౌస్‌లో చికిత్స‌..

క‌రోనా వైర‌స్ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వ‌ర‌కు అంతా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకింది.. ఈ విష‌యాన్ని జ‌న‌సేన పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది.. ఈ నెల 3వ తేదీన తిరుప‌తిలో జ‌రిగిన పాద‌యాత్ర‌, బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కాస్త న‌ల‌త‌గా ఉండ‌డంతో.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే, ఫ‌లితాలు నెగిటివ్‌గా వ‌చ్చాయి.. కానీ, అప్ప‌టి నుంచి ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. జ్వ‌రం, ఒళ్లునొప్పులు ఆయ‌న‌ను ఇబ్బంది పెట్ట‌డంతో.. రెండో రోజుల క్రితం మ‌రోసారి కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించ‌గా.. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని జ‌న‌సేన పార్టీ పేర్కొంది. 

ఖ‌మ్మంకు చెందిన వైర‌ల్ వ్యాధుల నివార‌ణ నిపుణులు, కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ తంగెళ్ల సుమ‌న్.. హైద‌రాబాద్‌కు వ‌చ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చికిత్స ప్రారంభించార‌ని.. అవ‌స‌ర‌మైన ఇత‌ర ప‌రీక్ష‌ల‌న్నీ చేయించార‌ని.. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేర‌డంతో.. యాంటివైర‌ల్ మందుల‌తో చికిత్స చేస్తున్నార‌ని.. అవ‌స‌రం అయిన‌ప్పుడు ఆక్సిజ‌న్ కూడా పెడుతున్నార‌ని జ‌న‌సేన త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇక‌, చిరంజీవి, సురేఖ‌, రాంచ‌ర‌ణ్‌, ఉపాస‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నార‌ని.. అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేస్తున్నార‌ని.. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వ‌చ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప‌రీక్షించింది.. జ్వ‌రం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు త‌గ్గ‌డానికి మందులు వాడుతున్నారు.. త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని.. త్వ‌ర‌లో సంపూర్ణ ఆరోగ్యంతో ప్ర‌జ‌లు, అభిమానుల ముందుకు వ‌స్తాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపిన‌ట్టు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది జ‌న‌సేన పార్టీ. 

Posted

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ మేరకు జనసేన టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

నేటి ఉదయం నుంచి అంతా అనుకున్నదే జరిగింది.. పవన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. తన రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్' యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్.. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పవన్‌కి కరోనా పాజిటివా లేక నెగెటివా అనేది తెలియక అయోమయంలో పడ్డారు ఆయన ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది జనసేన టీమ్.

పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ''జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో చికిత్స అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ చెప్పారు'' జనసేన పార్టీ తన లేఖలో పేర్కొంది. దీంతో పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.

Posted

He is covid positive since some days , good timing to make it public

Posted
3 minutes ago, Ryzen_renoir said:

He is covid positive since some days , good timing to make it public

:3D_Smiles: how do u know 

Posted

Lite sir maa cinema ki 100 crores collection kavali, theaters 100% occupancy lo unchandi.. oka 100 members poina parledu

Posted
1 minute ago, Pitta said:

:3D_Smiles: how do u know 

Twitter conversation , most of his security team got it and he was also isolating from several days 

Posted
Just now, Ryzen_renoir said:

Twitter conversation , most of his security team got it and he was also isolating from several days 

Yes. Tirupathi elections ki one day mundu kaavalane official ga icharu. BJP plan to gain more votes.

Posted
8 minutes ago, Kool_SRG said:

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ మేరకు జనసేన టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.

నేటి ఉదయం నుంచి అంతా అనుకున్నదే జరిగింది.. పవన్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. తన రీ- ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్' యూనిట్ సభ్యులతో పాటు తన భద్రత సిబ్బందిలోని కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో కొద్ది రోజుల క్రితం సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్.. నిన్న రాత్రి స్వల్ప అస్వస్థకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి పవన్‌కి కరోనా పాజిటివా లేక నెగెటివా అనేది తెలియక అయోమయంలో పడ్డారు ఆయన ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది జనసేన టీమ్.

పవన్ కళ్యాణ్‌కి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయినట్లు తెలుపుతూ ఓ నోట్ రిలీజ్ చేశారు. ''జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈనెల 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొని పవన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం కరోనా టెస్ట్‌ చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చింది. అయినా వైద్యుల సూచన మేరకు ఇన్ని రోజులు వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా కొద్ది పాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుండటంతో మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాజిటివ్‌ అని వచ్చింది. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ల సుమన్‌ ఆధ్వర్యంలో పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కాస్త నిమ్ము చేరడంతో యాంటీ వైరల్‌ మందులతో చికిత్స అందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవితో పాటు సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, నిర్మాత నాగవంశీలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. అపోలో నుంచి కూడా ఒక వైద్య బృందం పవన్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ చెప్పారు'' జనసేన పార్టీ తన లేఖలో పేర్కొంది. దీంతో పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.

nice move before election day

tdp rallies ki covid will spread like anything

veedi movies ki spread

jaggad motham batch ni dinchadu 

AP cases will raise

Posted
5 minutes ago, Ryzen_renoir said:

Twitter conversation , most of his security team got it and he was also isolating from several days 

tenor.gif gp 

Posted
1 minute ago, futureofandhra said:

nice move before election day

tdp rallies ki covid will spread like anything

veedi movies ki spread

jaggad motham batch ni dinchadu 

AP cases will raise

Bayata pranthala nunchi evadu manushalani dinchado leaders list choosthey baga ardham avuthundhi .

Paapam Kadapa vallani prathi chota amma na bhoothulu thiduthunaru kaani akkada Kadapa leaders evaru unnaru ? 

Posted
49 minutes ago, Ryzen_renoir said:

He is covid positive since some days , good timing to make it public

47 minutes ago, Pitta said:

:3D_Smiles: how do u know 

2 days mundu news vachindi ga he is isolating himself ani.

db lo thread kooda padindi 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...