Jump to content

How to make money on covid maranalu/cases in India


Recommended Posts

Posted

Doctors hospitals asalu mamulu danadha kadanta.

ఫీవర్ తగ్గిపోయింది . ఎర్ర కణాలు సమృద్ధిగా వున్నాయి . సిఆర్పీ,  డి దిమ్మెర్ టెస్ట్ లో ఎలాంటి సమస్య కనిపించడం లేదు . మరి రోగిని భయపెట్టి లక్షలు దోచేయడం ఎలా ?  

సింపుల్ . ఒక దొంగ , దిక్కు మాలిన సిటీ స్కాన్ చెయ్యి . దొంగ స్కోర్ ఇవ్వు . రోగిని బయపెట్టు . యథేచ్ఛగా దోచేసేయ్ . .. ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు .. నా కు మెసెంజర్ లో ఇలా చెబుతున్న వారే వందలు .. ఇక బయట లక్షల  సంఖ్య  లో వుంటారు .

ఆ ఆసుపత్రి వాడు రెండవ వేవ్ లో ఇన్ని కోట్లు సంపాదించాడు . మనం ఇంకా ఎందుకు వెనక బడి వున్నాం అంటూ పోటాపోటీ     గా.. ఇక రేపంటూ ఉండదు .. అందిన కాడికి ఈ రోజే దోచేసేయ్... అంటూ యద్దేచ్ఛగా దోపిడీ .

    దీనికి తోడు ఫార్మా కంపెనీ లు తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలని ఇది  వేసుకోండి అది వేసుకోండి అంటూ వీడియో ల ను తయారు చేసి వదులుతున్నాయి . ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అంటే కేవలం రోజూ డాక్టర్ ల పర్యవేక్షణలో అది కూడా విధి లేని పరిస్థితుల్లో { అంటే పెద్ద నష్టాన్ని నివారించడానికి చిన్న నష్టాన్ని భరించడం } తీసుకోవాల్సిన మందులు , తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వుండే మందులను కరోనా రాకుండా ఉండాలంటే ఇది వాడండి .. ఇది పోసుకోండి అంటూ వీడియో లు వదులుతున్నారు . అమాయక జనాలు దాన్ని లక్షల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు . వాటిని    వాడితే ఇక వారు తీవ్ర అనారోగ్యం పాలు   కావడం ఖాయం .  

 రెండో వేవ్ ముగిసాక .. మన చుట్టూరా రోగాలు రోస్టులతో బాధ పడే వారు కోకొల్లలుగా ఉంటారేమో . తాము తీసుకొన్న ముష్టి ముదనష్టపు మందుల కారణం గానే ఈ రోగాలు వచ్చాయని తెలుసుకోలేక ఇవన్నీ కరోనా మహిమ అని వారు జీవితాంతం భ్రమలో వుంది పోతారు .   

   మొదటి ఇంకా రెండో ప్రపంచ యుద్ధాల్లో కూడా ఇంత నష్టం జరిగి ఉండదేమో . భవిషత్తు తరాలు ఒకప్పుడు మనుషులు చాల మటుకు ఆరోగ్యంగా వుండే వారు . అటు పై కరోనా రావడం .. మెడికల్ మాఫియా ధనదాహం వల్ల అధిక సంఖ్యాకులు రోగులుగా మారి  పోయారు అని పుస్తకాల్లో లేదా లాప్ టాప్ ల పై చదువు కుంటారేమో .

  • Upvote 1
Posted

గత వారం { శుక్రవారం అనుకొంటా } ఒక మహిళా తన స్నేహితురాలి ఆరోగ్య స్థితి ఇలా ఉందని   మెసెంజర్ లో తెలియచేసింది, [  సిఆర్పి లెవెల్ ఎక్కువ - సైటుకినెన్ స్ట్రామ్ }  . ఈమెకు వచ్చే మంగళవారానికి { అంటే నిన్నటికి } పరిస్థితి చాలా క్రిటికల్ గా మారే   ప్రమాదం వుంది . ఏది ఏమైనా వెంటనే ఆసుపత్రిలో చేర్పించండి అని వాయిస్ మెసేజ్  ద్వారా రిప్లై ఇచ్చాను . నిన్న { మంగళవారం } ఆమె తన స్నేహితురాలు చనిపోయిందని మెసేజ్ పెట్టింది . అలాంటిదే మరో సంఘటన . కర్నూల్ ఆసుపత్రి లో ఉన్న  ఒక మహిళా స్థితి ఇది అని మరో మహిళ  తెలియచేసింది . ఆమె పరిస్థితి చాలా   దయనీయంగా వుంది .మానవ ప్రయత్నం మానుకూడదు కాబట్టి కొనసాగించండి అన్నా. ఆమె నిన్న చనిపోయినట్టు రాత్రి మెసేజ్ వచ్చింది .   

 కొంత మంది మిత్రులు తాము ఇదివరకే వాడుతున్న మందుల లిస్ట్ నాకు పెడుతున్నారు . వారికున్న రోగ లక్షణాలకు అన్నేసి మందులు , అది కూడా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న   మందులు వాడడం మంచి కాదు అని తెలిసినా నేను కిమ్మనకుండా ఉండి పోతున్నాను . దీని కారణాలు రెండు . 1 . వారు నన్ను సంప్రదించే సరికే ఆ మందులు వాడుతుంటారు . మధ్యలో ఆపడం సరికాదు . 2 . మెడికల్ డిగ్రీ లేని నేను డాక్టర్ ఇచ్చిన మందులు వాడొద్దు అని చెప్పలేను . ఆలా చెప్పడం పద్దతి కాదు . 

లంగ్ ఇన్ఫెక్షన్ కు సైటోకిన్ స్ట్రామ్ వల్ల   లంగ్స్ డామేజ్       కావడానికి మధ్య గల తేడా ను ఈ రోజు ఎంత మంది సరిగా అర్థం చేసుకొంటున్నారు అని నాకు అనుమానం వస్తోంది . అనుమానం కాదు . చాల మంది రెండింటికీ    మధ్య ఉన్న తేడా ను అర్థం చేసుకోలేక పోతున్నారు . 

ఊపిరితితుల్లో వైరస్ చేరి అక్కడ నిమ్మ పెరగడం అనేది లంగ్ ఇన్ఫెక్షన్ . ఇది ఒకే సారి లంగ్స్ ను పూర్తిగా డామేజ్ చేసే అవకాశం తక్కువ . ఇక సైటోకిన్ స్ట్రామ్ అనేది వ్యక్తి ఇమ్యూన్ సిస్టం పిచ్చిగా పని చెయ్యడం వల్ల జరిగేది . వైరస్ తో యుద్ధం చెయ్యాల్సిన ఇమ్యూన్ సిస్టం తానూ కన్ఫ్యూజ్ అయ్యి వ్యక్తి అంగాల పై దాడి చేస్తుంది . దేనికి జన్యు పరమైన కారణం ఒకటి అయితే బి 12  లోపం ప్రధానం . సైటోకిన్ స్ట్రామ్ అనేది వైరస్ తీవ్రత    వల్లో లేక లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడం వల్లో జరిగేది  కాదు . వ్యక్తి ఇమ్యూన్ సిస్టం అతిగా ప్రవర్తించడం వల్ల జరిగేది . అందుకే ఇది యువకుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది . }అందుకే ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు చనిపోతుంటారు . వారు రక్త సంబంధీకులై వుంటారు . తండ్రి కొడుకు , అన్నా తమ్ములు ; భార్య భర్త చని    పోయిన సందర్భాలు లేవు ; ఒక వేళా ఆలా మరణిస్తే అది సైటోకిన్ స్ట్రామ్ వల్ల ఊపిరి తిత్తులు  తిత్తులు డామేజ్ అయ్యి కాదు . భర్త చనిపోయిన    షాక్ తో .. ఇమ్యూన్ సిస్టం డౌన్ కావడం లాంటి కారణాలు  ఉంటాయి . ఇది తెలిసి న వారు అయ్యా మీ కుటుంబాల లో ఇప్పటికే ఒకరు చనిపోయారు . ఇప్పటికైనా బి 12  తీసుకోండి అని చెప్పకుండా .. కుటంబం లో ఇద్దరో ముగ్గురో పోయాక శోకాలు పెట్టడం ఎంత వరకు న్యాయం ? }

సైటోకిన్ స్ట్రామ్ వస్తే రెండు రోజుల్లో లంగ్స్ డామేజ్ అయిపోతాయి . వ్యక్తి ఇమ్మ్యూనిటీ ఎంత బలంగా ఉంటే అంత బలమైన డామేజ్ . మొన్న నేను వ్యక్తి ఇమ్మ్యూనిటి ని బాహుబలి , బెంగాలీ హీరో తో పోల్చాను . గుర్తుందా ? బాహుబలి రక్షణ వ్యవస్థ వైరస్ పై దాడి చేస్తే అది మటాష్ . అదే  రక్షణ వ్యవస్థ ఆ వ్యక్తి శరీరం పై దాడి చేస్తే ? ఆ వ్యక్తి అంగాలు పోతాయి . నిజానికి ఇలాంటి రక్షక వ్యవస్థ ఉన్న వారికి ఆ రక్షక వ్యవస్థే ప్రమాదకారి . అందుకే నేను B12 లోపము ఉన్న వారి ని బలహీన రక్షక వ్యవస్థ లో చేర్చాను . మీ ఇంట్లో దొంగ ల నుంచి రక్షణ కోసం ఒక బలమైన వస్తాదు   ను పెట్టుకొన్నారు . చీకటిలో కళ్ళు కనబడ కుండా వాడు మీ పైనే  దాడి చేస్తే ? వాడు బలమైన వాడైతే మీకు ఎక్కువ నష్టం . వాడు అంత బలమైన వాడు కాకపోతే తక్కువ నష్టం . సైటోకిన్ స్ట్రామ్ పెద్ద వారిలో రావొచ్చు . యువకుల్లో రావొచ్చు . కానీ యువకుల్లో బలమైన రక్షక వ్యవస్థ ఉండడం వల్ల అది వారి పైనే దాడి చెయ్యడం వల్ల వారికి  నష్టం ఎక్కువ స్థాయిలో ఉంటుంది . అర్థం అయ్యింది అనుకొంటా . 

మనకు సైటోకిన్ స్ట్రామ్ వచ్చే అవకాశం ఉంటే దాన్ని కూడా పట్టించే ఇంటి డాక్టర్ పల్స్ ఆక్సీమీటర్.  "వైరస్ ఊపిరి తీతుల్లో   దూరిపోతోంది . అక్కడ దాన్ని నాశనం చేస్తుంది" టైపు క్షుద్ర సాహిత్యం   చూస్తే ఏడుపు వస్తోంది . లంగ్ ఇన్ఫెక్షన్ కు సైటోకిన్ స్ట్రామ్ కు మధ్య తేడా తెలియక పొతే ఎలా ?

Posted

టీకా వేసుకొన్న వారిలో అధిక శాతానికి కరోనా సోకింది . కారణం టీకా కాదు. టీకా కేంద్రాల్లో గుంపులుగుంపులుగా ప్రజలు ఉండడం ! అసలే ఇప్పటి కరోనా వేగంగా విస్తరిస్తోంది . దీనితో వాక్సినేషన్ కేంద్రాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారినట్టు వున్నాయి . 

టీకా వేసుకొన్న రెండు మూడు రోజులకు జ్వరం లాంటివి వస్తే ఇది టీకా వల్లే అనుకోని వారు పెద్దగా మందులు తీసుకోలేదు . దీనితో ముందుగా అది కుటుంబం మొత్తానికి వారినుంచి ఇతరులకు సోకింది . 

రెండో వేవ్ ఇంత ఉదృతంగా ఉండడానికి కారణం టీకా కేంద్రాలు . వందల కేసులు చూసి ఈ మాట చెబుతున్నా! 

కనీసం టీకా కేంద్రాల్లో నిబంధనలు పాటింపచేయని అధికారులు పెళ్లి మండపం లోకి వెళ్లి ఏదో పుండిగి లాగ పెళ్ళికొడుకుని కొట్టడం. అదేదో ఘన కార్యం అయినట్టు జనాలు ఆ వీడియో ను వైరల్ చెయ్యడం . పెళ్లి పెద్దలు చేసిన తప్పుకు పెళ్లి కొడుకుని కొడితే ఎలా ? అతనికి అది లైఫ్ టైం ఈవెంట్. ఎంత అధికారం చేతిలో వున్నా ఇంత మదమా ? ఇలాంటి వారు రాజకీయనాయకుల్ని ఇలాగె చేయగలరా ?

  • Upvote 1
Posted
9 hours ago, anna_eyyi said:

టీకా వేసుకొన్న వారిలో అధిక శాతానికి కరోనా సోకింది . కారణం టీకా కాదు. టీకా కేంద్రాల్లో గుంపులుగుంపులుగా ప్రజలు ఉండడం ! అసలే ఇప్పటి కరోనా వేగంగా విస్తరిస్తోంది . దీనితో వాక్సినేషన్ కేంద్రాలు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారినట్టు వున్నాయి . 

టీకా వేసుకొన్న రెండు మూడు రోజులకు జ్వరం లాంటివి వస్తే ఇది టీకా వల్లే అనుకోని వారు పెద్దగా మందులు తీసుకోలేదు . దీనితో ముందుగా అది కుటుంబం మొత్తానికి వారినుంచి ఇతరులకు సోకింది . 

రెండో వేవ్ ఇంత ఉదృతంగా ఉండడానికి కారణం టీకా కేంద్రాలు . వందల కేసులు చూసి ఈ మాట చెబుతున్నా! 

కనీసం టీకా కేంద్రాల్లో నిబంధనలు పాటింపచేయని అధికారులు పెళ్లి మండపం లోకి వెళ్లి ఏదో పుండిగి లాగ పెళ్ళికొడుకుని కొట్టడం. అదేదో ఘన కార్యం అయినట్టు జనాలు ఆ వీడియో ను వైరల్ చెయ్యడం . పెళ్లి పెద్దలు చేసిన తప్పుకు పెళ్లి కొడుకుని కొడితే ఎలా ? అతనికి అది లైఫ్ టైం ఈవెంట్. ఎంత అధికారం చేతిలో వున్నా ఇంత మదమా ? ఇలాంటి వారు రాజకీయనాయకుల్ని ఇలాగె చేయగలరా ?

all policemen are Tuesday batch 

Posted

death certificate's icchey MRO'S ki Broker/ chemchagiri chesey.......musti vedavavalu unnaru

this is covid after effect news...

brahmam gari kalagyanam kanna perfect prediction naadi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...