Jump to content

Recommended Posts

Posted

బంగ్లాదేశ్ , పాకిస్థాన్, నేపాల్ , శ్రీలంక, భూటాన్ దేశాలలో ఎందుకు లేదు ? అంటే భారత్ ప్రజలు మిగతా ఉపఖండ దేశాల ప్రజల కంటే క్రమశిక్షణ లేని వారా ? అమెరికా ,చైనా లు కలిసి ఎకానమీ,ఫార్మా రంగాలని కాపాడుకోవడానికే ఇదంతా చేశారా ? 
డొనాల్డ్ ట్రంఫ్ లాగా మోడీ గ్లోబల్ ఆయుధ, ఫార్మా,ఆయిల్ లాబీ లకి లొంగకుండా ముందుకు వెళ్తునందుకె ఇదంతా జరుగుతున్నదా ?  ఒకసారి వాస్తవ విషయాలలోకి వెళ్ళి లోతుగా పరిశీలిస్తే అసలు నిజం బోధపడుతుంది. 
ముందు డొనాల్డ్ ట్రంఫ్ ఓటమి వెనక ఉన్న వాస్తవాలు ఏమిటో చూద్దాము. నాటో దేశాల రక్షణ అమెరికా బాధ్యత కాదు అన్నాడు అంటే నాటో దేశాల కంటే నాటో కూటమిలో ఉన్న అమెరికా ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నది యూరోప్ అంతటా మిలటరీ బేస్ లు పెట్టి అమెరికన్ సైనికులని అక్కడ మోహరించి ఉంచడం చాలా ఖర్చుతో కూడుకొని ఉంది అందుకే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుంది అని చెప్పేశాడు మళ్ళీ అధికారం లోకి వస్తే ఆ పని చేసేవాడు ఇది అమెరికన్ ఆయుధ లాబీ కి అస్సలు నచ్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట ఉద్రిక్తతలు ఉండాలి అక్కడ అమెరికా సైన్యం వెళ్ళాలి ఆయుధాలు అమ్ముడుపోవాలి కానీ ట్రంఫ్ ఉంటే ఇవన్నీ జరగవు. ఇక బ్లాక్స్ ఓన్లీ లివ్ [BlackLivesMatter]నినాదం తో ట్రంఫ్ మీద విపరీతమయిన దుష్ప్రచారం చేశారు. ప్రతి ఒక పోలీసుని ఏ దేశ ప్రధాని కావచ్చు లేదా అధ్యక్షుడు కానీ నీయంత్రించ లేరు కానీ అది ట్రంఫ్ కి అంటగట్టారు విజయవంతంగా ! అప్పటికి నల్లజాతి వాళ్ళ మీద అదే మొదటి దాడి జరిగినది అనే విధంగా ! ఆయుధ లాబీ పాచిక పారింది. ట్రంఫ్ ఓటమికి ఏవైతొ శక్తులు వెనక ఉండి ప్లాన్ చేసాయో అవే ఇప్పుడు మోడీ మీద ప్రయోగిస్తున్నాయి. 
కోవిడ్ మొదటి దశ ని విజయవంతంగా దాటడం అనేది భారత దేశ చరిత్రలో అతి పెద్ద విజయం. గత 2020 జనవరి నెలలో వెస్ట్ దేశాలు జోస్యం చెప్పింది ఏమిటంటే భారత్ లో హీన పక్షం వొ రెండు కోట్ల మంది కోవిడ్ వల్ల చనిపోతారు కానీ వాళ్ళు జోస్యం నిజం కాలేదు సరికదా మరణాల సంఖ్య రెండు లక్షల లోపే జరిగినది. పైగా హైడ్రాక్లోరో క్వీన్ ని ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయగలిగింది. నిజానికి 2020 లో ఇదే సమయానికి అమెరికా,యూరోపు తో సహా మిగతా ప్రపంచదేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి కానీ భారత్ మాత్రం పెద్దగా నష్టం లేకుండానే బయటపడగలింది చివరకి చైనా తొత్తు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు కూడా భారత్ ని చూసి మిగతా దేశాలు నేర్చుకోవాలి కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో అంటూ ఒక ప్రకటన చేశాడు గతి లేక. 
ఇక వాక్సిన్ విషయంలో అన్నీ దేశాల కంటే ముందే ఉత్పత్తి ప్రారంభం చేసి వాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది భారత్. సరిగ్గా ఇక్కడే గ్లోబల్ ఫార్మా లాబీకి కష్టం అనిపించింది. ప్రతి సంవత్సరం గ్లోబల్ ఫార్మా చేసే వ్యాపార విలువ 4 నుండి 6 ట్రిలియన్ డాలర్లు ఉంటుంది ఇక వాక్సిన్ వ్యాపారం అయితే 1.25 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా కానీ భారత్ బయో టెక్ కోవాక్సిన్, లైసెన్స్ తీసుకొని తయారు చేస్తున్న కొవీషీల్డ్ ఉత్పత్తి రేటు మిగతా దేశాలకంటే ఎక్కువ. పైగా ధర విషయంలో మిగతా దేశాలకంటే 60% తక్కువగా ఉండడం పశ్చిమ దేశాలకి మింగుడు పడడం లేదు ఇదే మోడీ పట్ల ద్వేష భావం నెలకొనడానికి కారణం అయ్యింది. చివరకి జర్మనీ ఛాన్సేల్లర్ అంజేల మోర్కెల్ అయితే భారత్ ఫార్మా రంగ హబ్ అవడం మనం చేసిన తప్పు అంటూ బహిరంగంగా ప్రకటించింది అంటే ఎంత అక్కసు ఉందో తెలిసిపోయింది. ఇక్కడ ప్రధానం గా ఆస్ట్రా జెనీక వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల మరణాలు సంభవించాయి యూరోపులో ఇదే సమయంలో అదే లైసెన్స్ తీసుకొని భారత్ లో తయారుచేసిన కొవీషీల్డ్ వల్ల అలాంటి దుష్ప్రభావాలు కలిగినట్లు ఎక్కడా ఫిర్యాదులు లేవు. 
1. గ్లోబల్ ఫార్మా రంగం ఆశించింది అసలు జరగలేదు: మాస్క్ లు, PPE కిట్లు, వెంటీలేటర్ల మార్కెట్ విలువ 
500 బిలియన్ డాలర్లు కానీ గ్లోబల్ ఫార్మా కి భారత్ అవకాశం ఇవ్వలేదు. అన్నీ మన దేశంలో నే తయారు చేసుకున్నాము. 
2. ఇక వాక్సిన్ ఎగుమతులు చేసి సంపాదించాలి అనుకున్న 1.25 ట్రిలియన్ డాలర్లు కూడా గ్లోబల్ ఫార్మా ఆశల మీద నీళ్ళు చల్లింది భారత్. రెండు వాక్సిన్లు భారత్లోనే తయారు చేసుకోవడం వల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. 
3. బిడెన్ అధికారంలోకి రాగానే ఫార్మా లాబీ భారత్ కి వాక్సిన్ తయారీ కోసం వాడే ముడి పదార్ధాల మీద నిషేధం విధించమని తీవ్ర ఒత్తిడి తెచ్చి విజయం సాధించాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే జాన్సన్ & జాన్సన్ వాక్సిన్ కోసం ముందే రా మెటీరీయల్ బుక్ చేసుకుంది అంటే మిగతా వాళ్ళకి ముఖ్యంగా భారత్ ని అడ్డుకోవడానికే చేసింది. మరీ దారుణం ఏమిటంటే  జాన్సన్ & జాన్సన్ వాక్సిన్  ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అన్నీ జరిగి వాక్సిన్ బయటికి రావడానికి ఇంకో రెండు నెలలు పడుతుంది కానీ ముందే రా మెటీరీయల్ తయారు చేసే అమెరికన్ ఫార్మా సంస్థలకి భారీ మొత్తం లో ఆర్డర్ చేసింది దాంతో భారత్ కి ఓపెన్ మార్కెట్ లో వాక్సిన్ రా మెటీరీయల్ కొనడం కష్టం అయింది ఎందుకంటే ముందు ఇచ్చిన ఆర్డర్ లు డెలివరీ అయ్యాకే మనకి ఇస్తాయి అమెరికన్ సంస్థలు అంటే హీన పక్షం మరో మూడు నెలల వరకు మనకి రా మెటీరీయల్ దొరికే అవకాశం లేదు. ఇది మన మార్కెట్ ని నిలువరించడానికి చేసిన కుట్ర. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి జాన్సన్ & జాన్సన్ వాక్సిన్ కోసం ఆర్డర్ చేసిన రా మెటీరీయల్ మనకి ఇవ్వమని కోరినా ఒప్పుకోవట్లేదు అమెరికన్ ఫార్మా సంస్థలు. 
4. ఇక ఇంత హఠాత్తుగా 2 nd వేవ్ విజృంభించడానికి కారణాలు సుస్పష్టం. ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్ రెండు సార్లు మార్పు చెందినట్లు పరీక్షలలో తేలింది అంటే ఇది ప్రత్యేకంగా పని కట్టుకొని వ్యాప్తి చేసినట్లు కనపడుతున్నది దీనికి కారణం వేస్ట్ బెంగాల్ లో ఉన్న చికెన్ నెక్ ప్రాంతం ప్రధానం గా చెప్తున్నారు. ఈ చికెన్ నెక్ ప్రాంతం నుండే డుబుల్ మ్యూటేషన్ చేసిన వైరస్ ని వదిలినట్లు అనుమానిస్తున్నారు ఎందుకంటే బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అనుమానం రాదు కానీ ఒకేసారి డబుల్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది ? ఇది ఖచ్చితంగా బయో వార్ మన మీద. లేకపోతే కేవలం భారత దేశంలోనే ఇది విజృంభిస్తున్నది ? పాకిస్థాన్,బంగ్లాదేశ్,నేపాల్,భూటాన్, శ్రీలంక దేశాలలో ఎందుకు లేదు ?
5. పోయిన సంవత్సరం కూడా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడే చైనా సరిహద్దుల్లో తిష్ట వేసింది అలాగే ఇప్పుడు 2 nd వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మళ్ళీ సవాల్ విసురుతున్నది. 
6. గ్లోబల్ ఆయుధ లాబీ : ఆయుధాలు తయారుచేసి అమ్మాలంటే అది అమెరికా తో పాటు యూరోపు మాత్రమే చేయాలి మిగతా దేశాలు చేయకూడదు ఇదీ అమెరికన్ ఆయుధ లాబీ సిద్ధాంతం అందుకే టర్కీ ఎప్పుడయితే రష్యా నుండి S400 కొనడానికి ఒప్పందం చేసుకుందో వెంటనే ఆంక్షలు విధించింది అమెరికా ఆఫకోర్స్ రష్యా నుండి S400 మొదటి రెజిమెంట్ భారత్ కి రాగానే మన మీద కూడా కాట్సా విధిస్తాడు జో బిడెన్. 
7. తేజస్ యుద్ధ విమానం కోసం మలేసియా ఆసక్తితో ఉంది ఒకవేళ కనుక మలేసియా కనుక ఆర్డర్ ఇస్తే అది అమెరికన్ ఆయుధ లాబీ కి ఇష్టం ఉండదు కొంటె అమెరికా నుండి కొనాలి లేదా యూరోపు నుండి కొనాలి కానీ భారత్ లాంటి దేశం నుండి కొంటె అది భవిష్యత్తులో తమకి పోటీ ఉంటుంది అన్నది స్పష్టం కనుక అమెరికన్ ఆయుధ లాబీకి  భారత్ లో మోడీ ఉండడం ఇష్టం లేదు. 
8. ఫీలలిప్పైన్స్ ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్ కోసం భారత్ తో ఒప్పందం చేసుకున్నది కానీ మళ్ళీ అదే అమెరికన్ ఆయుధ లాబీకి ఇష్టం లేదు ఎందుకంటే యుద్ధ విమానాల తరువాత అతి పెద్ద వ్యాపార మార్కెట్ మిసైల్స్ దే ! మోడీ ఉంటే మరిన్ని దేశాలకి ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ముందు తమ వ్యాపారానికి కష్టం అవుతుంది పైగా భారత్ ఆయుధాలు అంటే తేజస్ కావచ్చు లేదా మిసైల్ వ్యవస్థ కావచ్చు చాలా చవకగా దొరుకుతాయి ఇది అమెరికన్ ఆయుధ లాబీ కి నష్టాన్ని కలుగచేస్తుంది. భారత్ తో ధరల విషయంలో పోటీ పడలేదు అమెరికన్ ఆయుధ లాబీ. 
9. అమెరికన్ నావీ ఇప్పటికే రెండు నావల్ వెర్షన్ తేజస్ ఫైటర్ జెట్స్ ని కొన్నది తమ నేవీ పైలట్ ల శిక్షణ కోసం. ఎందుకంటే శిక్షణ కోసం చాలా కొద్ది లైట్ కాంబాట్ జెట్స్ అవసరం అవుతాయి కాబట్టి అమెరికన్ సంస్థలు ఆ పని చేయలేవు ఎందుకంటే దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి కానీ ఆర్ధికంగా చాలా ఖరీదు అవుతుంది. భవిష్యత్తులో తమ దగ్గర ఉన్న కారియర్ ల రక్షణ కోసం హీన పక్షం 150 తేలికపాటి యుద్ధ విమానాలు అవసరం ఉంటుంది అప్పుడు ఆల్రెడీ తేజస్ ని వాడుతున్నారు కాబట్టి ఆ 150 జెట్స్ కోసం భారత్ కె ఆర్డర్ ఇచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం కాబట్టి ఇది కూడా అమెరికన్ లాబీకి ఇష్టం లేదు. 
10. గ్లోబల్ ఆయిల్ లాబీ : పెట్రో డాలర్ల వ్యాపారo. వచ్చే సంవత్సరం భారత్ లో కనీసం 75,000 నుండి 1,00,000 వరకు ఎలెక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్లు స్థాపించబోతున్నది భారత్ ఇదే జరిగితే ఎలెక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరు అందుకుంటాయి ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లు లేవు కాబట్టి అమ్మకాలు పెద్దగా లేవు అదే మోడీ కనుక ఉండకపోతే మరో పదేళ్ళు వరకు ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం జరగదు ఎందుకంటే తమకి అనుకూలమయిన ప్రధాని ఉంటాడు కాబట్టి. ఇది పెట్రో డాలర్ లాబీ అంచనా. ఛార్జింగ్ స్టేషన్ల వల్ల హీన పక్షం 25 % ఆయిల్ దిగుమతి పడిపోతుంది ఇది ఆయిల్ లాబీ బాధ. 
11. దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్ బెంగాల్ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చింది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు వీళ్ళకి ప్రధానం అందుకే వీటి కోసం ఏం చేయడానికయినా వెనుకాడరు.   
ఇదంతా వొట్టిదే అనే వాళ్ళకి ఒక సూటి ప్రశ్న : ఇరాక్ లో రసాయన ఆయుధాలు ఉన్నాయి అంటూ అమెరికా నాటో దళాలు దాడి చేసి లక్షల మందిని చంపేసాయి కానీ అక్కడ రసాయన ఆయుధాలు ఏవీ కూడా దొరకలేదు. అందరూ అనుకున్నట్లు అమెరికా ఆయిల్ కోసమే ఇదంతా చేసింది అన్నది పచ్చి అబద్ధం. కేవలం తమ ఆయుధాలని పరీక్షించుకోవడానికే ఇదంతా చేసింది. అలాగే 2011 లో లిబియా మీద దాడి కూడా ఆయుధాలని పరీక్షించడం కోసమే కాకపోతే అప్పుడు ఫార్మా లాబీ ఒత్తిడి కూడా ఉంది ఎందుకంటే లిబియాలో మహమ్మద్ గడ్డాఫీ ప్రజలు అందరికీ అది ఎలాంటి వ్యాధి అయినా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా చికిత్స అందిస్తూ వచ్చాడు దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి పని లేకుండా పోయింది ఇది ఫార్మా లాబీకి నష్టం. ఇక ఆయుధ లాబీ కి అయితే మొదటి సారిగా రష్యా చైనా ల రాడార్ల వల్ల తమ యుద్ధ విమానాలకి హాని ఉంది అని తేల్చుకున్నాకే నాటో దేశం అయిన ఫ్రాన్స్ చేత మొదటి దాడి చేయించింది అది కూడా రాఫెల్ జేట్లు ముందు లిబియా రాడార్ వ్యవస్థని నిర్వీర్యం చేసుకుంటూ దాడులు చేస్తూ పోతే వెనుక అమెరికన్ F16, F15, F22 లు మిగతా పని పూర్తి చేశాయి అంటే ఇక్కడ అమెరికన్ ఫైటర్ జెట్స్ కంటే రాఫెల్ జెట్స్ ఎయిర్ డిఫెన్స్ ని చక్కగా ఛేదించగలిగాయి. తరువాతి కాలంలో రాఫెల్ తన PESA రాడార్ ని తీసేసి AESA రాడార్ల ని వాడడం మొదలుపెట్టాక అది ఇంకా డేడ్లీ ఫైటర్ అయి కూర్చుంది. దాంతో అమెరికా తన F35 ల కోసం ఎయిర్ డిఫెన్స్ మీద కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది రాఫెల్ నుండి వచ్చే పోటీని ఎదుర్కోవడానికి. 
ఇప్పుడు జో బిడెన్ మంత్రి వర్గంలోని అధికారులు అందరూ దాదాపుగా లెఫ్ట్ వింగ్ ని సమర్ధించేవాళ్లే కాబట్టి కనపడకుండా చైనాకే మద్దతు ఇస్తారు , తీసుకుంటారు. మోడీ ప్రధాన మంత్రిగా ఉంటే అటు ఫార్మా లాబీ తో పాటు ఆయుధ లాబీ కూడా నష్టపోతుంది. నల్ల జాతీయుడు ఒక అమెరికన్ పోలీసు చేతిలో హత్యమవ్వడం దానిని ఎన్నికల ప్రచార ప్రధాన అస్త్రంగా వాడుకొని లెఫ్ట్ వింగ్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే లాబీ చైనా , కాంగ్రెస్ మద్దతుతో కోవిడ్ ని భూతంగా చూపించి దానికి మోడీ నే బాధ్యుడుగా చిత్రీకరిస్తున్నది. మోడీ ఉన్నంత కాలం DRDO చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి అది తమకి నష్టదాయకం. మోడీని ఏదో విధంగా దించాలి. 
ఈ కుట్రలని ఛేదించుకొని మోడీ మనగలరా ? లేక ట్రంఫ్ లాగా బలి అవుతారా అన్నది మనమీదే ఆధారపడి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. 
జైహింద్ !
1. https://www.indiatoday.in/india/story/india-gripped-by-covid-china-quietly-hardens-positions-in-depth-areas-of-ladakh-1796760-2021-04-30
2.https://www.drivespark.com/four-wheelers/2021/electric-vehicle-charging-stations-across-india-state-wise-numbers-fame-ii-scheme-details-033913.html
3. https://www.freepressjournal.in/india/this-is-how-illegal-bangladeshi-immigrants-are-settling-down-in-sundarbans
4. https://timesofindia.indiatimes.com/blogs/toi-edit-page/what-if-china-wrings-indias-chickens-neck-the-siliguri-corridor-here-are-some-countermeasures/
5. https://www.wionews.com/world/how-pfizer-tried-to-bully-argentina-and-brazil-in-exchange-for-vaccines-366037

Posted

Idhedho whatsapp university uncles forward message la undhe 

Posted

Vuncle H1 miss ayina Phd candidate anukunta...thesis practice chestunadu..good job vuncle.

Posted
6 hours ago, Hydrockers said:

దాదాపు 15 కోట్ల మంది బంగ్లాదేశీయులు , రోహింగ్యా లు వెస్ట్ బెంగాల్ లో అస్సాం లో ఉన్నారు. మమత బేగం తో పాటు కాంగ్రెస్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చింది

 

ee okka line tho rendu chetulu jebu lo pettukoni eto vellipotunna

inchu minchu similar comment db lo bhakthtards kuda annaru... ninna ekkado thread lo chadiva...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...