r2d2 Posted May 12, 2021 Report Posted May 12, 2021 కరోనా సృష్టించిన కల్లోలంలో నర్సులు చేస్తున్న సేవలు అసమానమైనవని.. మీకు రుణపడి ఉంటామని అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. వారి సేవలను ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ట్వీట్లు చేశారు. ‘భారత్ కరోనా సెకండ్‌వేవ్‌తో పోరాడుతోంది. ఈ కష్ట సమయంలో ముందువరుసలో ఉండి మాకు రక్షణగా ఉంటూ నర్సులు చేస్తున్న అసాధారణ సేవలు అసమానం. జీవితంపై ఆశను కోల్పోకుండా మాలో ధైర్యాన్ని నింపుతున్నందుకు మీకు రుణపడి ఉంటాం’ అని మహేశ్ అన్నారు. ఇక లాక్‌డౌన్ గురించి మాట్లాడుతూ.. కరోనా సెకండ్‌వేవ్ మనందరికీ సవాల్‌గా మారిందన్నారు. మనం అందరం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. మన రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ నియమాలను అందరం పాటిద్దామన్నారు. విధిగా ఇంట్లో ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలని అందరినీ కోరుతున్నానన్నారు. మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సర్కారివారి పాట’లో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్ సందడి చేయనుంది. తమన్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రం విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.