Jump to content

Papam ..no words to define this tragedy


Recommended Posts

Posted
నిండుచూలాలన్నా.. గుండెలు కరగలేదు

కొవిడ్‌ అనుమానంతో చికిత్స చేయని కార్పొరేట్‌ ఆసుపత్రులు
అయిదు దవాఖానాలు తిరిగి..అంబులెన్సులోనే గర్భిణి మృతి

నిండుచూలాలన్నా.. గుండెలు కరగలేదు

 

నెలలు నిండుతున్నకొద్దీ పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఈ తల్లి. బుజ్జాయి ఊసులు తలచుకొని ఆమె హృది పులకించిపోయేది. కొద్ది రోజుల క్రితమే పసికందు కోసం చెప్పులు కొని వాటిని చూపుతూ ఇలా ఆనందంతో తబ్బిబ్బయింది. ఈ సంతోషం చూసి కొవిడ్‌కు కన్నుకుట్టిందో లేదో తెలీదు కాని ఆసుపత్రులు కరోనా అని అనుమానించి నిండుచూలాలిపై కనికరం చూపలేదు. అయిదు ఆసుపత్రులు తిరిగి ఐదు గంటలుగా అంబులెన్సులో కొట్టుమిట్టాడినా కార్పొరేటు గుండెలు కరగలేదు. ఫలితంగా రెండు ప్రాణాలూ అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, సుల్తాన్‌బజార్‌, మల్లాపూర్‌:  హైదరాబాద్‌లోని మల్లాపూర్‌కు చెందిన పావని(22)కి గతేడాది ఆగస్టులో ఏపీలోని ఏలూరుకు చెందిన తిరుమల్‌రావుతో వివాహం జరిగింది. భర్త వ్యవసాయం చేస్తారు. పురిటి కోసం పుట్టింటికి వచ్చింది. ఇటీవలే ఎనిమిది నెలలు నిండడంతో తల్లిదండ్రులు జోగారావు, నీలవేణిలు పావనిని స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించారు. అందులో భాగంగానే గురువారం తన సోదరితో కలిసి దవాఖానాకు వెళ్లగా అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువుందని సెలైన్‌ ఎక్కించి పంపించేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఆయాసం మొదలైంది. వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్‌ అయి ఉండొచ్చన్న అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు. ఎప్పుడూ ఇక్కడికే వస్తున్నామని.. వైద్యం చేయాలని తల్లి వేడుకున్నా ఫలితం లేకపోయింది. దిక్కుతోచని స్థితిలో అంబులెన్సులో మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. తర్వాత లక్డీకాపూల్‌లోని ఓ దవాఖానాకు చేరుకున్నారు. తమవద్ద వెంటిలేటర్‌ లేదని వారు చేర్చుకోలేదు. ఎల్‌బీనగర్‌లోని మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. వారు మరో హాస్పిటల్‌కు పంపించారు. అక్కడికి తీసుకెళ్లాక మొదటి ఫ్లోర్‌లో చేర్చుకుని ఇక బతకడం కష్టం.. గాంధీకి గానీ, కోఠి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో బిడ్డయినా బతుకుతుందని పంపించేశారు.  కోఠి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కన్నుమూసింది. ఉదయం 11.30 గంటలకు అక్కడికి చేరగా.. అంబులెన్సులోనే పరీక్షించిన వైద్యురాలు తల్లీబిడ్డా ఇద్దరూ మృతిచెందినట్లు నిర్ధారించారు. పొద్దున్నుంచి ఇద్దరినీ కాపాడుకునేందుకు తల్లి నీలవేణి పడిన తపన, చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అంబులెన్సుకే రూ.30 వేలు అయ్యాయి.  

నిండుచూలాలన్నా.. గుండెలు కరగలేదు

కడుపులో బిడ్డను వేరు చేయలేదని దహనానికి తిరస్కారం
అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మల్లాపూర్‌ శ్మశానవాటికకు తీసుకెళ్లగా అక్కడ తల్లినీ బిడ్డను వేరు చేస్తేగానీ దహనం చేయడం కుదరదని నిర్వాహకులు చెప్పారు. దీంతో ఐదు ఆసుపత్రుల్ని సంప్రదించగా.. వారూ శస్త్రచికిత్స చేయడం కుదరదని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో మృతదేహాన్ని ఇంటికే తీసుకెళ్లారు. వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓవైపు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఇది మరింత వేదన మిగిల్చింది.

  • Haha 1
  • Sad 3
Posted

If you are not rich , corporates hospitals don't care

Posted
1 hour ago, jambalhaatraja said:

get out of that desam at the earliest. 

+1

  • Sad 1
Posted

Thalli biddanu veru cheydam yendo elagu khananam chestharu kada ra. Covid aithe yenduku admit cheskoru oka side yemo outside state vallaki beds confirm authunai mimalni emo cherchukoledu yendo

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...