BattalaSathi Posted May 23, 2021 Report Posted May 23, 2021 32 minutes ago, r2d2 said: maree itta thayarayyarenti raa janaalu....sarle okappudu train accidents ayithe sachipoyina valla purselu/mangala soothralu/nalla poosalu kottese vallu...ippudu inko adugu munduku vesi idhi...so proud of my country men! Quote
r2d2 Posted May 23, 2021 Author Report Posted May 23, 2021 ఫోన్లో మా అమ్మ జ్ఞాపకాలున్నాయి.. ఇప్పించండి కంటతడి పెట్టిస్తున్న ఓ బాలిక విన్నపం కొడగు: కనిపించకుండా పోయిన చరవాణిలో మృతిచెందిన తల్లి ఫొటోలు ఉన్నాయని, ఆ ఫోన్‌ని ఎలాగైనా ఇప్పించాలని ఓ తొమ్మిదేళ్ల బాలిక పోలీసులను వేడుకున్న తీరు కలచివేసింది. కర్ణాటకలోని కొడగు జిల్లా కుశాల్‌నగర్‌కు చెందిన ప్రభ అనే మహిళకు కరోనా సోకడంతో మడికేరి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈనెల 16న మృతిచెందారు. అయితే ఆసుపత్రిలో ఆమె చరవాణిని ఎవరో చోరీ చేశారు. అయితే ఆ ఫోన్‌తో తన తల్లి ఫొటోలున్నాయని.. ఎలాగైనా ఆ చరవాణిని ఇప్పించాలని మృతురాలి కుమార్తె హ్రితిక్ష పోలీసులను వేడుకొంది. హ్రితిక్ష బంధువు అక్షిత అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ..‘మే 15న ప్రభకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ మరుసటి రోజే ఆమె మృతిచెందినట్లు ఆసుపత్రి వర్గాలు సమాచారమిచ్చాయి. మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆమె ఫోన్‌ను ఇవ్వాలని కోరగా.. అది కనిపించడంలేదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. తన తల్లికి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ చరవాణిలో ఉన్నాయని దాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని హ్రితిక్ష వేడుకుంటోంది’ అని ఆమె తెలిపారు. పోలీసులకు ఆ బాలిక పెట్టుకున్న అర్జీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమయిన కొడగు పోలీసులు ఫోన్ కోసం వేట ప్రారంభించారు. కొడగు ఎస్పీ క్షమా మిశ్రా మాట్లాడుతూ.. బాలిక చేసిన కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకున్నామని..మడికేరి పోలీసులతో కలిసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. ఆసుపత్రి వర్గాలను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.