sunnam Posted June 6, 2021 Report Posted June 6, 2021 కాపులు తెల్లన కాపులు నల్లన కాధూళి నల్లన.. ఎందువలన.? కాధూళి నల్లన.. ఎందువలన? ~~క గుణితము 😀 Quote
sunnam Posted June 6, 2021 Author Report Posted June 6, 2021 "బేగంపేట" బస్ స్టాప్. చాలా రద్దీగా వుంది. కడప జిల్లా నుంచి వచ్చిన జగదీష్, బస్ రాగానే తోసుకుని డోర్ దగ్గరకు వెళ్ళాడు. తన ముందు ముగ్గురున్నారు. మొదటాయన కామారెడ్డి ఒకటి అని, టికెట్ తీసుకున్నాడు. రెండవ వాడు సంగారెడ్డి అని, టికట్ తీసుకుని బస్ ఎక్కాడు. ఓహో పేరు చెబితే గాని టికెట్ ఇవ్వరనుకొని *జగదీష్ రెడ్డి* ఒకటి అన్నాడు. ! ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా.. ~😀 అది HPS విద్యార్ధి పేరు:- వాయదాల జగదీష్ రెడ్డి...😀 Quote
sunnam Posted June 6, 2021 Author Report Posted June 6, 2021 ఇంట్లో ఖర్చులు మాలావుగా ఉన్నాయి. బయటేమో లాక్ డౌన్....! **** బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. "టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!" అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు. బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక రెస్ట్ రూం వాడదామని చివరిగా దిగాను. అక్కడ ఇంకా ఓ నాలుగు బస్సులు పార్క్ చేసున్నాయి. కాస్త దూరంగా పురుషులు, స్త్రీలు అని వేర్వేరుగా టాయిలెట్ బోర్డులు కనిపించాయి. UREN:FREE; TOILAT:3RUPIS అని రాసుంది. అక్కడి మనిషికి చిటికెనవేలు చూపిస్తూ వెళ్ళి పని చూసుకుని తిరిగొచ్చి సిగరెట్ అంటించి ఓ దమ్ము లాగి చుట్టూ చూశాను. తిరుపతికి వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు స్టార్ట్ అయి వెళ్లిపోయింది. పిల్లలు బిస్కట్లూ, కూల్ డ్రింకుల కోసం ఏడుస్తున్నారు; పెద్దలు టీలూ, కాఫీలూ, టిఫిన్లూ, భోజనాలను రేప్పొద్దుటికి భూమి ఉండదు అన్నంత ఆబగా తినేస్తున్నారు. అక్కడి బిచ్చగాళ్లు ఎవరూ తిండి తీసుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే అడుక్కుంటున్నారు. శుక్లపక్ష చతుర్దశి కావడంతో ఆ కంగాళీ కూడా వెన్నెల్లో అందంగానే కనిపిస్తోంది. అదిచూస్తూ రేపు బెంగుళూరులో దొరికే ఆనందాన్ని ఓ సారి తల్చుకున్నాను. హైదరాబాద్ లో బయల్దేరినప్పటి అనుమానం, ఆందోళనలు ఇప్పుడు లేవు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా..! సిగరెట్ పూర్తయ్యాక హోటల్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఒక టీ టోకెన్ తీసుకున్నాను. టీ గ్లాసును చేతికందుకుని మెల్లగా తాగుతుంటే మా బస్సు డ్రైవరు తన సీట్లోకి వెళ్ళి కూర్చుని హారన్ మోగించాడు. నా తోటి ఫ్రయాణికులందరూ కొత్త ఖైదీ సినిమాలో కార్తి బిర్యానీ తిన్నట్టు ఆబగా తినేసి బస్సెక్కేసారు. నేను కూడా మెల్లగా బస్ దగ్గరికి వెళ్లి ఎక్కేసాను. హఠాత్తుగా బస్సు వెనక నుండి కేకలు మొదలయ్యాయి. " నా డబ్బులు, నా డబ్బులు కనిపించడం లేదు..!" అంటూ అరుపులూ,గోలా మొదలైంది. ముందువాళ్లు వెనక్కీ, వెనకవాళ్లు ముందుకీ చూసాము. పదమూడో నంబరు సీటు మనిషి గోల పెడుతున్నాడు. అతని పక్కసీటతను "ఎంత పోయిందండీ..!" అంటే "రెండు లక్షలు సార్..! రెండు లక్షలు. నా కొడుకు ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజుకోసం తీసుకెళుతున్నా..! డ్రైవర్.. బస్సాపు..! అందరినీ చెక్ చేయాలి..!" అంటూ ఏడుపు మొదలెట్టాడా చెట్టంత మనిషి. నాది డ్రైవర్ వెనకసీటే..! వెంటనే డ్రైవర్ని బస్సు కదలకూడదని చెప్పాను. తను సరే అంటూ సీట్లోంచి లేచాడు. బస్సంతా అసెంబ్లీలా గోలగోలగా తయారైంది. విషయం కనుక్కుంటే, ఆ డబ్బులు పోగొట్టుకున్నాయన బెంగుళూరులో కొడుకు బీఆర్క్ సెకండియర్ ఫీజు కట్టడానికి వెళుతున్నాడు. రెండు లక్షలు వైటు; రెండు బ్లాకు. మొదటి రెండు లక్షలకు చెక్కు తీసాడు. మిగిలిన రెండు లక్షలకి ఇక్కడ బొక్కడిపోయింది. పెళ్లాం పుస్తెల్ని ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి తెచ్చాడట. అతని ఆక్రోశం పట్ఠే పరిస్థితి లేదు. అందరి బ్యాగుల్నీ కూలంకషంగా చెక్ చేయాలని నిర్ణయానికొచ్చి పొలీసులకు ఫోన్ చేసాం. పోలీసులొచ్చి చెకింగ్ మొదలెట్టారు. నేను తెల్లవారేసరికల్లా బెంగుళూరులో ఉండాలి. నేను తెల్లావారుఝామున నాలుగ్గంటలకల్లా ఉంటాననుకున్నా. లేకపోతే ఈ ట్రిప్పు అనవసరం. సుబ్బరంగా వెనక్కి వెళ్లడం ఉత్తమం. తీరా చూస్తే ఇక్కడే రాత్రి పదకొండయ్యింది. పదిహేడో నంబరు సీటు మనిషి కంగారు పడుతున్నాడు. అతనేదో చెప్పబోతుంటే ఆ గోలలో ఎవరూ వినే పరిస్థితి లేదు. బ్యాగులూ, జేబులూ వెదుకుతూ అతని చేతిసంచీ తీసుకుని చూసేసరికి అందులో డబ్బులున్నాయి. రెండువేల రూపాయల కట్ట పాపంలా పరుచుకుని ఉంది. అతడు నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోపలే "ఫఠ్"మంటూ మూతి మీద కొట్టాడు పోలీసు. ఆ ముసలివాడి పళ్లు నాలుగు కదిలిపోయాయి. కాలర్ పట్టుకుని బస్సుమధ్యకు ఈడ్చుకొచ్చారు. అలస్యమైందన్న కోపమో, దొంగ దొరికాడన్న ఆనందమో, వాళ్లు నిజాయితీపరులని చూయించే అవకాశమో ఒక్కొక్కరూ అతని చితకబాదసాగారు. అంతమంది కొడుతున్న అన్ని దెబ్బలకు పాపం చచ్చిపోయేటట్టున్నాడు. డబ్బులు దొరికిన మనిషి కన్నా మిగతావాళ్లే ఎక్కువ రెచ్చిపోతున్నారు. ఒక పోలీస్ "కేస్ పెడతారా..?" అని అడిగితే, "వద్దండీ..! నా సొమ్ము దొరికింది చాలు..!" అంటూ ఆ పోలీసులకు కొంత నగదు సంతోషంగా ఇచ్చాడు తన డబ్బులు దొరికినతను. కింద అచేతనంగా పడిఉన్న మనిషిని బస్సునుండి కిందికి తోసేసి పోలీసులు వెళ్ళిపోయారు. నాకు ఆలస్యం అవడం వల్ల బెంగుళూరు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అందుకని ఆ బస్సు ప్రయాణం చిరాకనిపించింది. డ్రైవరుకు విషయం చెప్పి నేనూ దిగేసాను. ఆ తర్వాత రెండు నిమిషాలకు బస్సు కర్నూలు వైపు వెళ్ళి పోయింది. నేను పాన్ డబ్బా దగ్గరికి వెళ్లి ఇంకో సిగరెట్ కొనుక్కుని ముట్టించి ఆ వ్యక్తి పడిఉన్న వైపు చూసాను. బోర్లా పడిఉన్నాడతను. చొక్కా చిరిగిపోయింది. వళ్లంతా దోక్కుపోయింది. పాపం వళ్లంతా రక్తపు మరకలు. దాదాపు అచేతనంగా పడి ఉన్నాడు. నాకు జాలేసింది. ఇరవై రూపాయలు ఇచ్చి ఓ చల్లటి నీళ్ల సీసా అదే పాన్ డబ్బాలో కొని అతని దగ్గరికి వెళ్లి, వెల్లకిలా తిప్పి కొన్ని నీళ్లు మొహం మీద చల్లి మరి కొన్ని తాగించాను. ఆ మాత్రం సాయానికే అతని దుఃఖం కట్టలు తెగింది. " న్యాను దొంగను కానన్నా. మా బిడ్డా, దాని పెనివిటీ అనంతపురంల బూవి తీసుకుండారు. కొంచెం లెక్క తగ్గిందని ఫోంజేస్తే హైదరాబాదుల మా రెడ్డిని అడిగి తీసుకపోతాండ..!" అంటూ బావురుమన్నాడు. "నీమాటనెవరు నమ్ముతారన్నా..? ఎవడు మంచోడో, ఎవడు దొంగనాకొడుకో..? ఎవురికి దెల్సూ..?? ఈ సొమ్ము తీస్కో. ఇంటికిబో..!" అంటూ అతనికి నా జేబులోంచి ఒక రెండువేల రూపాయల నోటు ఇచ్చాను. అతను రెండుచేతులూ జోడించి దండం పెట్టాడు. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లడానికి రోడ్డుదాటి ఈల వేసుకుంటూ అటువైపు వెళ్లసాగాను. **** ఫర్వాలేదు. వచ్చేవారం బెంగుళూరెళ్లి పేకాడుకోవడానికి ప్యాంటుజేబులో ఇంకా లక్షాతొంభైఎనిమిదివేలున్నాయి. #గొట్టిముక్కలకమలాకర్ Quote
nag_mama Posted June 6, 2021 Report Posted June 6, 2021 2 hours ago, sunnam said: కాపులు తెల్లన కాపులు నల్లన కాధూళి నల్లన.. ఎందువలన.? కాధూళి నల్లన.. ఎందువలన? ~~క గుణితము 😀 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.