r2d2 Posted June 19, 2021 Report Posted June 19, 2021 తెలంగాణలో లాక్డౌన్ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా మంత్రివర్గం నిర్ధారించింది. ఈమేరకు జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్డౌన్ను రేపటి నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల విద్యాసంస్థలు పూర్తి స్థాయి సన్నద్ధతతో జులై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలు విధిగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక డ్రైవ్లు పెట్టి పౌరులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీంతో చాలా వరకూ కేసులు తగ్గాయి. కేబినెట్ నిర్ణయం మేరకు రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడుస్తాయి. Quote
r2d2 Posted June 19, 2021 Author Report Posted June 19, 2021 2 minutes ago, Hydrockers said: So atinchukune time 24×7 స్వీయ నియంత్రణ Quote
Hydrockers Posted June 19, 2021 Report Posted June 19, 2021 5 minutes ago, r2d2 said: స్వీయ నియంత్రణ Mask pettukunte radha aa kaka corona ? Quote
Ryzen_renoir Posted June 19, 2021 Report Posted June 19, 2021 37 minutes ago, Hydrockers said: So atinchukune time 24×7 HuzurNagar by-election kosamaa ? Quote
r2d2 Posted June 19, 2021 Author Report Posted June 19, 2021 35 minutes ago, Hydrockers said: Mask pettukunte radha aa kaka corona ? Vaccine vesukunnaa vastundi… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.