psycopk Posted July 10, 2021 Report Posted July 10, 2021 న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్ 10-07-2021 Sat 18:50 గతేడాది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు సుమోటోగా తీసుకున్న హైకోర్టు సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడని గుర్తించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తు బాధ్యతలు సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. దాంతో అతడిని జిల్లా జైలుకు తరలించారు. గతేడాది న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వగా, న్యాయమూర్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు జడ్జిలపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తుకు సహకారం అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. Quote
nallaberry Posted July 10, 2021 Report Posted July 10, 2021 @kidney edi ippudu anu ...food courts ..chefs ani Incase ninnu lopala vesina ...nuv jaffa kaadhu neutral ani ....db posts proof ga choopinchi ninnu bayataki teeskosta le ...dont worry Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.