Jump to content

Recommended Posts

Posted
  • మాస్క్‌.. మహారాజులకు వద్దా?
  • మాస్క్‌ లేకుండా కొవిడ్‌ సమావేశానికి
  • మాస్క్‌ లేకపోతే జరిమానా తప్పదని హెచ్చరిక
  •  

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): మాస్క్‌ పెట్టాల్సిందే! భౌతికదూరం పాటించాల్సిందే! ఊపిరితీసే కరోనా నుంచి బయటపడాలంటే ఈ రెండింటి విషయంలో ఎటువంటి ఉపేక్షా, ఉల్లంఘనలకూ తావివ్వకూడదు. పైగా, మాస్క్‌ ధరించనివారిపై రూ. 100 జరిమానా విధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఆదేశించారు కూడా! అయితే, ఈ ఆదేశాలు ఇచ్చిన సమీక్ష సమావేశంలో జగన్‌ మాస్క్‌ లేకుండా పాల్గొనడం గమనార్హం. ‘సీఎంకు ఒక రూలు! సామాన్యులకు మరో రూలా!’ అనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మంత్రిమండలి, శాసనసభ సమావేశాలు, సీఎంఓ కార్యాలయంలో జరిగే ఉన్నతస్థాయి సమీక్షల్లో ఏనాడూ మాస్కులు ధరించలేదని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. జిల్లాల పర్యటన సందర్భంలోనూ జగన్‌ కొవిడ్‌ నిబంధనలను పాటించడం లేదు.

 

07132021104719n2.jpg

 

ముఖ్యంగా మాస్కు ధరించిన సందర్భాలు చాలా తక్కువ. ఆయనకు సమీపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు మాస్కులు ధరించి కూర్చుంటున్నారు. కానీ, మాస్కుల బోధ చేసే ముఖ్యమంత్రి మాత్రం వాటి జోలికే వెళ్లడం లేదు. సాధారణంగా కారు డ్రైవ్‌ చేసుకొంటూ ఒంటరిగా వెళ్లేటప్పుడు మాస్క్‌ అంత అవసరం ఉండదు. అయితే, అక్కడా ఈ నిబంధనను ట్రాఫిక్‌ పోలీసులు అమలు చేస్తుంటారు. మాస్కులు ధరించని అటువంటి వాహనదారుల ఫొటోలు తీసి చలానాలు వసూలు చేస్తున్నారు.

 

 

07132021104725n73.jpg

 

 ఏకాంతంగా ప్రయాణాలు చేసే తామేమో మాస్క్‌ లేదని పెనాల్టీలు కట్టాలా.. నిత్యం పదిమందిలో తిరిగే సీఎం మాత్రం ఏ నిబంధనా పాటించరా అంటూ సదరు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మాస్కు నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలకు దండనగా రెండు మూడు రోజులు మూసేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశిస్తున్నారని, ఇవే ఆదేశాలు ముఖ్యమంత్రి కార్యాలయానికీ వర్తిస్తాయా అని పలువురు  ఘాటుగా నిలదీస్తున్నారు. 

Posted
33 minutes ago, tom bhayya said:

Stop Reading yellow news it’s fake anna invisible mask vesukuntaadu ani @kdapparao cheppamannadu 

 @kdapparao endhi me 420 asalu mask petukoda? 

Posted
10 minutes ago, Swatkat said:

 @kdapparao endhi me 420 asalu mask petukoda? 

Not needed. Midnight Jesus tho sitting lo mask avasaram ledhu ani Jesus told ani Jagananna cheppadanta.

  • Haha 1
Posted

Title ey undhi gaa vaa..maharaajulaki mask avasaram ledhu ani...raaajulku.. Reeddyy raajulu akkadaa...

Evariki endhukandi mask lu...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...