Jump to content

Recommended Posts

Posted

🕉️హిందూ ధర్మం🚩 
29/08/21 నేటి రాశిఫలాల వివరాలు 
 
🐐 మేషం
ఈరోజు
అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలన సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తోటివారి సహాయం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం 
ఈరోజు
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సాయిబాబా దర్శనం ఉత్తమం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు
శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం 
ఈరోజు 
అదృష్ట ఫలాలు అందుతాయి. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు 
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు 
ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత ఆవసరం. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చంద్రశేఖరాష్టకం పఠించాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు 
అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
 ఈరోజు 
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు
ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం,విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹 

🐊 మకరం
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తున్నది. సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు
కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నికీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...