I hate caste...... Posted October 2, 2010 Report Posted October 2, 2010 న్యూయార్క్: అశ్లీలత ప్రవాసవనిపై ప్రసరించింది. ప్రవాస భారతీయ విద్యార్థి ఒకరుసహపాఠీ శృంగార కలాపాన్ని చిత్రీకరించి అంతర్జాలం (ఇంటర్నెట్)లో తపాలా చేయడం కలకలం సృష్టించింది. ఈ మతిలేని చేష్టతో సిగ్గు చితికిపోయిన ఆ విదేశీ కురవ్రాడు ఆత్మహత్యకు యత్నించాడు. దీనితో పోలీసులు ఎన్నారై విద్యార్థితో పాటు అతనికి సహకరించిన మరో వెధవని పట్టుకుని జైలులో వేశారు. అయితే ఆ తర్వాత వీరు దర్జాగా బెయిలుపై బయటికొచ్చేశారు.న్యూజెర్సీలోని రట్‌గెర్స్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న పద్దెనిమిదేళ్ళ దరున్ రవి, తన వసతిలోనే వుంటున్న సహపాఠీ టైలర్ క్లెమంతి శృంగార కలాపాన్ని రహస్యంగా చిత్రీకరించి అంతర్జాలంలో తపాలా చేశాడు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లు ఈ తతంగమంతా ట్విట్టర్‌లో టపా రాశాడు. ఒకానొక నాడు క్లెమంతి తనకు కాస్త ఒంటరితనం కావాలని కోరాడని, దీనితో తాను రహస్య దర్శిని మీట నొక్కి గదిలో జరిగిన శ్లీలాన్ని చిత్రీకరించానని ఎగ్గులేకండా ఆ టపాలో పేర్కొన్నారు. ఆ చిత్రాలు చూడరమ్మంటూ అంతర్జాల చిరునామా విశ్వవ్యాప్తం చేశాడు. ఈ ఉన్మాద చర్యతో స్నేహితుల వద్ద తలెత్తుకోలేని క్లెమంతి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆనక పోలీసులు శృంగార వేధింపుల అభియోగాలు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మరో స్నేహితుడు పేరు సైతం వెల్లడించడంతో అతన్నీ అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే నిందితులపై మోపబడిన అభియోగాలు నిర్థారణ అయితే గరిష్టంగా ఐదేళ్ళ వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉన్నదని పోలీసులు చెప్పారు.
Recommended Posts