psycopk Posted September 21, 2021 Report Posted September 21, 2021 తమకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో జగన్‌ను కోరిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం 21-09-2021 Tue 06:59 తన ఎకరంన్నర భూమిని వైసీపీ నేత తిరుపేల రెడ్డి ఆక్రమించారని అక్బర్ బాషా ఆరోపణ న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సెల్పీ వీడియో సీఎం కార్యాలయం చెప్పినా భూమిని అప్పగించని తిరుపేలరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం తనకున్న ఎకరంన్నర భూమిని వైసీపీ నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని, తిరుపేలరెడ్డి చెప్పినట్టు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారని, సోమవారం సాయంత్రంలోగా తమకు న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులం నలుగురం కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇటీవల సెల్ఫీ వీడియో తీసి జగన్‌ను అభ్యర్థించిన అక్బర్ బాషా కుటుంబం అనుకున్నట్టే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషాకు కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో ఎకరంన్నర భూమి ఉంది. ఈ భూమిని వైసీపీ నేత తిరుపేలరెడ్డి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అక్బర్ బాషా ఆరోపిస్తూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. స్పందించిన కడప ఎస్పీ అన్బురాజన్ బాధిత కుటుంబాన్ని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అక్బర్ బాషా భూమిని తిరిగి అప్పగించాలని తిరుపేల రెడ్డికి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. అయినప్పటికీ ఆయన ఆ భూమిని అప్పగించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్బర్ బాషా.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వారిని వెంటనే చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన చాగలమర్రి, దువ్వూరు పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అక్బర్ బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని ఎస్పీ తెలిపారు. వివాదాస్పద ఎకరంన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా తేలుస్తూ 2018లోనే మైదుకూరు కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే రెవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. సివిల్ విషయాల్లో తలదూర్చడం సరికాదని పోలీసులకు సూచించారు. Quote
psycopk Posted September 21, 2021 Author Report Posted September 21, 2021 ఏపీ ఇప్పుడు డ్రగ్స్ కు కూడా కేంద్రంగా మారింది: చంద్రబాబు 20-09-2021 Mon 17:18 గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టివేత పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.9 వేల కోట్లు ఆఫ్ఘనిస్థాన్ నుంచి దిగుమతి విజయవాడకు చెందిన ఓ సంస్థపై అనుమానాలు తాలిబన్లతో సంబంధాలు పెట్టుకునే స్థాయికి చేరారన్న చంద్రబాబు గుజరాత్ లోని ముంద్రా పోర్టులో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడడం తెలిసిందే. ఈ హెరాయిన్ ను టాల్కం పౌడర్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి విజయవాడలోని ఓ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గుజరాత్ లో హెరాయిన్ పట్టుబడిన నేపథ్యంలో, ఏపీ ఇప్పుడు డ్రగ్స్ కు కూడా కేంద్రంగా మారినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి, వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని విమర్శించారు. తాలిబన్లు, ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకునే వరకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. హెరాయిన్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి దోషులను నిగ్గుతేల్చాలని, తద్వారా డ్రగ్స్ ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. Quote
mettastar Posted September 21, 2021 Report Posted September 21, 2021 1.5 acre gurinchi intha pedha rachalo irukunnada .. evadu aa kakkurthi na koduku .. thu vaani bathuku Quote
bluebadger Posted September 21, 2021 Report Posted September 21, 2021 5 hours ago, mettastar said: 1.5 acre gurinchi intha pedha rachalo irukunnada .. evadu aa kakkurthi na koduku .. thu vaani bathuku this is india 10 rs ivvaledani murders chala jarigaayi bihar lo - 1.5 acre ante ah maatram untadi 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.