r2d2 Posted October 21, 2021 Report Posted October 21, 2021 ఎక్కడికెళ్లినా భర్త చితాభస్మంతోనే.. అప్పుడప్పుడు రుచి చూడాల్సిందే! యూకేకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. చనిపోయిన తన భర్త చితాభస్మాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. అంతటితో ఆగకుండా.. అప్పుడప్పుడు దాన్ని తింటుండటం గమనార్హం. తోటివారు షాక్! యూకేకు చెందిన కాసీకి, సీన్‌కు 2009లో పెళ్లయింది. అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటను విధి వెక్కిరించింది. కొన్నాళ్ల క్రితం అస్తమా బారినపడి సీన్ కన్నుమూశాడు. భర్త అంత్యక్రియలు నిర్వహించిన కాసీ.. అప్పటినుంచి అతని చితాభస్మాన్ని తనతోపాటు ప్రతిచోటా తీసుకెళ్లడం ప్రారంభించారు. షాపింగ్‌కు, సినిమాకు, హోటళ్లకు ఇలా.. ఎక్కడికెళ్లినా వెంట ఉండాల్సిందే. అయితే.. ఇదంతా సాధారణమేనని భావించే తోటివారు.. ఆమె ఆ చితాభస్మాన్ని కొద్దికొద్దిగా తింటుండటం చూసి షాక్‌కు గురవుతున్నారు! ఈ విషయాన్ని ఆమె సైతం అంగీకరించారు. ‘తింటున్న కొద్దీ ఉత్సాహం’ ‘నా భర్త నుంచి దూరం కావలడనుకోవడంలేదు. కాబట్టే ఇలా చేస్తున్నాను. రెండు నెలలవుతున్నా దీన్ని మానుకోలేకపోతున్నా’ అని పేర్కొంటున్నారు. మొదట్లో చితాభస్మం వాసన కుళ్లిన గుడ్ల మాదిరి వచ్చేదని, ఇప్పుడు అలవాటు అయిందని చెబుతుండటం గమనార్హం. ‘చితాభస్మం డబ్బా తెరిచినప్పుడల్లా ఆనందం కలుగుతుందని, దాన్ని తింటున్న కొద్దీ మరింత ఉత్సాహం కలుగుతుందని ఆమె వివరిస్తున్నారు. ఆమె ఈ అలవాటును స్థానికంగా ‘ప్రజల వింత వ్యసనాల’పై రూపొందించిన ఒక కార్యక్రమంలోనూ ప్రదర్శించారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.