r2d2 Posted November 14, 2021 Report Posted November 14, 2021 నెరవేరని ప్రత్యేక హోదా హామీ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో గళమెత్తిన సీఎం జగన్ ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అనే హామీతోనే రాష్ట్ర విభజన జరిగిందని, ఏళ్లు గడిచినా కీలకమైన ఆ హామీని కేంద్రం ఇప్పటికీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ‘విభజన చట్టంలో పొందుపరచిన ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కట్టాలి. అయితే 2013-14 అంచనాల ప్రకారమే నిర్మాణానికి నిధులిస్తామని, మిగిలిన వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని చెప్పడమంటే.. అప్పుడిచ్చిన హామీని ఉల్లంఘించడమే. తాగునీటికి సంబంధించిన కాంపొనెంట్ నిధుల్ని కూడా విడుదల చేయకుండా తప్పుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు కనిపిస్తోంది’ అని విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన తిరుపతిలో ఆదివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014 ఆమోదం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా.. ఇప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది.’ అని వివరించారు. ‘దేశ సమగ్ర పురోగతికి కేంద్రం, రాష్ట్రాలతో పాటు.. అంతర్రాష్ట్ర సంబంధాల పరిపుష్టి కూడా ఎంతో ముఖ్యం. రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలను నిర్ణీత వ్యవధిలో సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా మీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. ఈ సందర్భంగా జగన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీటిపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. Quote
BeerBob123 Posted November 14, 2021 Report Posted November 14, 2021 Super kendram medalu vanchina @BoseDkCmJagan 2 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.