Jump to content

Recommended Posts

Posted
Cm Kcr: కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది: కేసీఆర్‌

 కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్‌లో మొత్తం వరిధాన్యం కొంటున్నారు కానీ, మన రాష్ట్రంలో కొనుగోలు చేయనంటోందన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మరోసారి స్పష్టం చేశారు. ఏ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసి 50 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తామంటే కేంద్రం నిరాకరిస్తోందన్నారు.

‘‘ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేంద్ర ఆహారశాఖ మంత్రిని అడిగాం. జీఓఎంలో చర్చించి చెబుతామన్నారు. కానీ చెప్పలేదు. దాన్ని వదిలేసీ ఇక్కడి భాజపా నాయకులు యాసంగిలో వరి వేయాలని చెబుతున్నారు. ఇదేం నీతి. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా వ్యహరిస్తోందని భావించి రాష్ట్రంలో పంట మార్పిడి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు పిలుపునిచ్చారు. 6,600 పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. యాసంగిలో వరి వేయాలని చెప్పిన స్టాండ్‌ మీద భాజపా ఉందో? లేదో? చెప్పకుండా కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామా చేయాలని చూస్తున్నారు. అసలే కోపం మీద ఉన్న రైతులు భాజపా నేతలను నిలదీస్తున్నారు. మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు భాజపా నేతలు ఎందుకు వెళ్తున్నారు. రైతులపై దాడి చేయడం క్షమించరాని విషయం. యాసంగిలో వరి వేయాలని బండి సంజయ్‌ చెప్పారా? లేదా? వర్షా కాలంలో వచ్చే ధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? కేంద్రం సమాధానం చెప్పాలి.

Posted

two faces ani veedu antunada... 

TDP CBN ayipoyindhii last two time cries lo... 

eesari central meeda paddadaaa

evadu nammatledhuga ayina

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...