ntr2ntr Posted November 24, 2021 Report Posted November 24, 2021 సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు తూతూ మంత్రంగా ఏరియల్ సర్వే బాధితులను పరామర్శించకుండానే తాడేపల్లికి తిరుగు పయనం సమీక్షా సమావేశంతో సీఎం సరి వరదలతో భయం గుప్పిట్లో జిల్లాలు నేటికీ ముంపులోనే 15 మండలాలు ఇళ్లు, సరుకులు వరదార్పణం నిలువనీడా కోల్పోయి బిక్కుబిక్కు ఆకలిదప్పులతో లక్షల మంది బాధితులను గాలికొదిలి హైదరాబాద్‌లో పెళ్లికి సీఎం జగన్ బాబు పనితీరుతో పలువురి బేరీజు వరద బీభత్సంతో రాష్ట్రంలో మూడు పెద్ద జిల్లాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఈ విలయానికి ఇప్పటికే 24 మంది మరణించారు. గల్లంతయినవారి ఆచూకీ తెలియడం లేదు. లక్షల మంది సర్వం కోల్పోయి ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. వర్ష ప్రభావం ఇంకా ఉంది. ఎప్పుడు ఏ చెరువుకు గండిపడుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. గుక్కెడు నీరు, అన్నం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లి తాడేపల్లికి తిరిగొచ్చారు. ఇది ఆయన వ్యక్తిగతం కావొచ్చు. కానీ సీఎంగా వరద ముంపులో.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ఆయన ఏం భరోసా ఇచ్చినట్లు? తూతూ మంత్రంగా సీఎం ఏరియల్ సర్వే రాష్ట్రంలో సగంపైగా జిల్లాలు వరదలు, వర్షాలతో అల్లాడుతుంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖ, విజయనగరం జిల్లాలు చిగురుటాకులా వణికిపోతే నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వాయుగుండంతో భయం గుప్పిట్లో ఉన్న జిల్లాలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఇస్తున్న భరోసా ఏమిటని వారు బేరీజు వేస్తున్నారు. నే డు ఇలా.. రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఈ నెల 18వ తేదీ నుంచే చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు. కర్నూలు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మర్నాడు వాయుగుండం సీఎం సొంత జిల్లా కడపతోపాటు నెల్లూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై పెనుప్రతాపం చూపించింది. వర్షం భీభత్సం సృష్టించింది. ఇప్పటికీ అక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. వాగులు, వంకలు, నదులు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. కడప జిల్లా చెయ్యేరులో వరద బీభత్సంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతయిన వారిలో 17 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కట్ట దెబ్బతింది. అది మరింత విధ్వంసం సృష్టించింది. చెయ్యేరు, రాజంపేట, నందలూరు, పులపత్తూరు తదితర ప్రాంతాల్లో వరదకు ఇళ్లు కొట్టుకుపోయాయి. ప్రజలు నిత్యావసరాలతో సర్వం కోల్పోయారు. పంటలు పూర్తిగా వరదార్పణమయ్యాయి. ఇక భారీవర్షాలకు తిరుమల, తిరుపతి అతలాకుతలమయ్యాయి. గత 400 ఏళ్లలో చూడని వర్షాలు కురిశాయని నిపుణులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడి ఘాట్‌రోడ్లు దెబ్బతిన్నాయి. తిరుమలకు వెళ్లే కాలిబాట, మెట్లమార్గం ధ్వంసమయ్యాయి. నెల్లూరు జిల్లాలో పెన్నానది మహోగ్రంగా ప్రవహిస్తోంది. నెల్లూరు, కొవూరు, విడవలూరు మండలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. 38 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో రోడ్డు రవాణా స్తంభించింది. రైలు వంతెనలు వేలాడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలకు కమ్యూనికేషన్స్ లేవు. నెల్లూరు, రాజంపేట, చెయ్యేరు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇంటి పైకప్పులు కూడా కనిపించనంతగా నీటమునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే అంచనావేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజల ఆస్తులను కాపాడాలి. ప్రజలకు ఆహారం, తాగునీరు, నిత్యావసరాలను సమకూర్చాలి. కానీ అధికార యంత్రాంగానికి ముందుచూపు లోపించడంతో ముందస్తు చర్యలు తీసుకోలేదని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ప్రజలు వర్ష, వరద బీభత్యానికి బలయ్యారు. నిజానికి ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురుస్తుంది.. వరద ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో 24 గంటల ముందుగానే తెలుసుకునే అత్యాధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ డేటా ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంది. వరద పీడిత ప్రాంతాల్లో సహజంగానే జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటుంది. ఇలాంటప్పుడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను తరలించి సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. అవసరమైతే సీఎం, ఆయన కార్యాలయం అధికారులు, ఇతర సీనియర్ అధికారులు జిల్లాలకు తరలివెళ్లి.. ప్రత్యక్షంగా ప్రజల ముందుంటారు. సహాయ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు. తక్షణ సాయంగా ఆహారం, సరుకులు, తాగునీరు, మందులు, దుప్పట్లు మొదలైనవి అందిస్తారు. మరి ఇప్పుడు అలా జరిగిందా? అది సర్కారుకే తెలియాలి. ఈ జాగ్రత్తలే తీసుకుని ఉంటే 24 మంది మరణించేవారా? 17 మంది గల్లంతయ్యేవారా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరదలపై సీఎం ఒకసారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆతర్వాత శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశారు. కడపలో కాసేపు అధికారులతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లోని బాధితులను కలిసి భరోసా ఇచ్చే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. నేరుగా హెలిక్టాపర్‌లో తిరుపతి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులతో మాట్లాడారు. అక్కడకు సమీపంలోనే వరదపీడిత ప్రాంతాలున్నాయి. తిరుమలకు వెళ్లే మెట్లమార్గం ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించలేదు. నేరుగా హెలికాప్టర్లో తాడేపల్లికి వచ్చేశారు. మర్నాటికి పరిస్థితి మళ్లీ తీవ్రమైంది. మళ్లీ సీఎం వెళ్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఆదివారం ఆయన హైదరాబాద్ వెళ్లి ఓ పెళ్లికి హాజరయ్యారు. ‘విపత్తు కాలంలో బాధితులను కలవడం అంటేనే వారికి భరోసా ఇచ్చినట్లు! చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇస్తాం.. గాయపడితే చికిత్స చేయిస్తామని హామీ ఇస్తే సరిపోతుందా? బాధితులను కలిసి వారి కష్టాలను తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇవ్వకుండా.. ఆకాశమార్గంలో పర్యటించి.. తమ పని పూర్తయిందనుకుంటే ఎలా? గతంలో ఇదే సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు.. ‘ఏరియల్ సర్వేపేరిట గాల్లో తిరిగితే ప్రజల బాధలు ఏం తెలుస్తాయి? ప్రజల వద్దకు వెళ్లాలి’ అని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు ఆయనేం చేశారు? వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, ఏరియల్ సర్వే చేస్తే వరద బాధితులకు ఊరట లభిస్తుందా? వారి ఆకలిదప్పులు తీరతాయా’ అని ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. నాడు ఇలా.. 2014 అక్టోబరు 7 నుంచి 14 వరకు హుద్‌హుద్ తుఫాను విశాఖ జిల్లాపై తీవ్రప్రభావం చూపించింది. అయితే తుఫాను తీరం దాటకముందే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. అక్కడే మకాం వేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సహాయ చర్యలను పర్యవేక్షించారు. తుఫానుకు అతులాకుతులమైన నగరంలో సీఎం స్వయంగా మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం ప్రజలకు ఎంతో భరోసా ఇచ్చింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.