ntr2ntr Posted November 24, 2021 Report Posted November 24, 2021 అవకాశం మేరకు మడమ తిప్పడం.. ఆది నుంచీ జగన్ సర్కారు నైజం కీలక విషయాల్లో హడావుడి.. చెల్లవని తెలిసీ తప్పుడు చట్టాలు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు.. కేంద్రం నుంచి తిరుగు టపాలో బిల్లులు గప్‌చుప్‌గా ‘రద్దు-ఉపసంహరణ’.. ఆ ఖాతాలోనే అమరావతి, మండలి ‘మా నాయకుడు మాట తప్పడు. మడమ తిప్పడు’... అని వైసీపీ నేతలు చెప్పుకొనే మాటలన్నీ ఉత్తివే! అవకాశం కొద్దీ మాట్లాడటం... అవసరమైన ప్రతిసారీ మడమ తిప్పడమే ముఖ్యమంత్రి జగన్ నైజమని ఇప్పుడు స్పష్టమవుతోందని విపక్షాలు, విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ పదేపదే మడమ తిప్పుతుండటంతో జనంలో నవ్వులపాలవుతున్నామని వైసీపీ నేతలే వాపోతున్నారు. సోమవారం మూడు రాజధానుల బిల్లును వైసీపీ సర్కారు వెనక్కి తీసుకుంది. ‘త్వరలో మళ్లీ సమగ్రంగా పెడతాం’ అని చెబుతున్నప్పటికీ... అదంతా ఉత్తిదేనని, మూడు రాజధానుల కథ ఏ కంచికీ చేరదని వారూ అనుమాస్తున్నారు. ఆ మరుసటి రోజే... మంగళవారం శాసన మండలిపైనా జగన్ పిల్లి మొగ్గ వేశారు. ‘మండలిలో త్వరలో మాకే మెజారిటీ వస్తుంది. అయినా... సరే రద్దు చేస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని నాడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పుడు... ఆయన ప్రభుత్వమే మాట మార్చేసి శాసనమండలి పునరుద్ధరణకు వీలుగా బిల్లు ఆమోదించింది. ఇదొక్కటే కాదు... ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అనేక అంశాలపై జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, లెక్కకు మించిన సలహాదారులు ఉన్నా కోర్టుల్లో సర్కారుకు తలబొప్పి కడుతూనే ఉంది. హడావుడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం... కోర్టుల్లో చుక్కెదురు కావడం షరామామూలుగా మారిపోయింది. ఇక... శాసనసభ వేదికగానే ఆమోదించిన అనేక బిల్లులు, చేసిన చట్టాలూ అతీగతీలేకుండా పోయాయి. పేరుగొప్పగా ప్రకటనలు చేయడం... ఆ తర్వాత మాట మడతేయడం ఈ సర్కారుకు ఒక అలవాటుగా మారింది. ఇప్పటిదాకా ఇలా ‘మడమ తిప్పిన’ అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవి... అమరావతిపై పదేపదే... విపక్షంలో ఉండగా అమరావతికి మద్దతు పలికారు. అదే రాజధానిగా ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించారు. 2019 డిసెంబరు 19న మూడు రాజధానుల ప్రకటన చేశారు. 2020 జనవరిలో ఆ బిల్లులు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందారు. అదే ఏడాది జూలై 31న గవర్నర్ వాటిని ఆమోదించారు కూడా! ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును ‘రద్దు’ చేశారు. మళ్లీ సమగ్రంగా బిల్లులు ప్రవేశపెడతామంటున్నారు. మండలిపై మాటమడత... ఇంగ్లీషు మీడియం, మూడు రాజధానుల బిల్లులకు అడ్డుతగులుతోందంటూ శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 జనవరి 27న శాసనసభలో తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని వెంటనే కేంద్రం ఆమోదం కోసం కూడా పంపించారు. అప్పటికే ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా పనిచేస్తోన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభా్‌షచంద్రబో్‌సలతో రాజీనామా చేయించి... వారిని రాజ్యసభకు పంపించారు. మండలిపై అప్పటి వేడి మొత్తం ఇప్పుడు చల్లారి పోయింది. మండలిలో తమకు మెజారిటీ రాగానే... రద్దు అన్నదే ముద్దు అయ్యింది. ఎస్‌ఈసీపై గజిబిజి స్థానిక ఎన్నికలు తాము అనుకున్నట్లుగా జరగడంలేదంటూ అప్పట్లో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై కత్తికట్టారు. ఆయనను ఇంటికి పంపేందుకు ఏకంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి, పదవీకాలాన్ని కుదించేలా ఆర్డినెన్స్ తెచ్చారు. రాత్రికి రాత్రి జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. చివరకు అది న్యాయపరిశీలనలో వీగిపోయింది. ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో మళ్లీ నిమ్మగడ్డే ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఈ పోరాటంలో గెలిచిన నిమ్మగడ్డ తన పదవీకాలం పూర్తయ్యేవరకు సేవలందించారు. అసైన్డ్ భూములపై అయోమయం పేదలకు సాగుభూములు, ఇంటి స్థలాలను కేటాయించాలంటే ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టప్రకారం నడుచుకోవాలి. స్థలాలను డీకేటీ పట్టాల రూపంలోనే ఇవ్వాలి. అయితే, జగన్ సర్కారు పేదలకు కన్వేయెన్స్ డీడ్ రూపంలోనే ఇంటిపట్టాలు ఇస్తామంటూ జీవోలు జారీ చేసింది. ఇది కుదరదని హైకోర్టు తేల్చేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు ఎంతకీ విచారణకు రాలేదు. మరోవైపు, అసైన్డ్ ఇంటి స్థలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారే ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అమల్లో ఉండగానే కన్వేయెన్స్ డీడ్‌లు ఎలా ఇస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే నీళ్లు నమలాల్సిందే. దీంతో సర్కారు ఆ కేసు విచారణలో ఉండగానే పాత పద్ధతిలో... అసైన్‌మెంట్ చట్టం-1977 ప్రకా రం డీకేటీ పట్టాల రూపంలోనే ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసింది. దిశలేని దిశ మహిళలపై అత్యాచారాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామంటూ... 2019 డిసెంబరు 13న అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ఆమోదించారు. 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం, దోషులను ఉరి తీయడం... ఇందులో ముఖ్యాంశాలు. సర్కారు ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, కేంద్ర చట్టాలను తోసిరాజనేలా సొంతంగా చట్టాలు చేయడమే అసలు సమస్య! దీంతో... ‘దిశ’ బిల్లును కేంద్రం ఆమోదించకుండా తిప్పి పంపించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా తిరుగు టపాలో వచ్చేసింది. దీంతో... ఈ బిల్లులను గత ఏడాది డిసెంబరులో ఉపసంహరించుకున్నారు. వాటికి స్వల్పమార్పులు చేసి... మళ్లీ కేంద్రానికి పంపించారు. 11 నెలలుగా దీనిపై కేంద్రంలో దీనిపై కదలికే లేదు. అంతుచిక్కని ‘టైటిల్’ దేశంలోనే అందరికంటే ముందు భూములకు శాశ్వత టైటిల్ ఇస్తామని, దీని ఆధారంగా సర్వేకూడా చేస్తామని 2019 జూలై 30న ఏపీ ల్యాండ్‌టైటిల్ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించారు. ఇది అనేక కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఆ బిల్లు ఉందని తేలింది. దీంతో గత ఏడాది డిసెంబరులో ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. దీనికి మార్పులు చేసి 2020 డిసెంబరు 4న మరో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఇప్పటికే 11 నెలలవుతోంది. ఆ బిల్లులోని అంశాలు కేంద్ర చట్టాలకు పోటీగా ఉన్నాయంటూ కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదు. 1 Quote
gothamprince Posted November 24, 2021 Report Posted November 24, 2021 1 hour ago, ntr2ntr said: అవకాశం మేరకు మడమ తిప్పడం.. ఆది నుంచీ జగన్ సర్కారు నైజం కీలక విషయాల్లో హడావుడి.. చెల్లవని తెలిసీ తప్పుడు చట్టాలు కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు.. కేంద్రం నుంచి తిరుగు టపాలో బిల్లులు గప్‌చుప్‌గా ‘రద్దు-ఉపసంహరణ’.. ఆ ఖాతాలోనే అమరావతి, మండలి ‘మా నాయకుడు మాట తప్పడు. మడమ తిప్పడు’... అని వైసీపీ నేతలు చెప్పుకొనే మాటలన్నీ ఉత్తివే! అవకాశం కొద్దీ మాట్లాడటం... అవసరమైన ప్రతిసారీ మడమ తిప్పడమే ముఖ్యమంత్రి జగన్ నైజమని ఇప్పుడు స్పష్టమవుతోందని విపక్షాలు, విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ పదేపదే మడమ తిప్పుతుండటంతో జనంలో నవ్వులపాలవుతున్నామని వైసీపీ నేతలే వాపోతున్నారు. సోమవారం మూడు రాజధానుల బిల్లును వైసీపీ సర్కారు వెనక్కి తీసుకుంది. ‘త్వరలో మళ్లీ సమగ్రంగా పెడతాం’ అని చెబుతున్నప్పటికీ... అదంతా ఉత్తిదేనని, మూడు రాజధానుల కథ ఏ కంచికీ చేరదని వారూ అనుమాస్తున్నారు. ఆ మరుసటి రోజే... మంగళవారం శాసన మండలిపైనా జగన్ పిల్లి మొగ్గ వేశారు. ‘మండలిలో త్వరలో మాకే మెజారిటీ వస్తుంది. అయినా... సరే రద్దు చేస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని నాడు ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పుడు... ఆయన ప్రభుత్వమే మాట మార్చేసి శాసనమండలి పునరుద్ధరణకు వీలుగా బిల్లు ఆమోదించింది. ఇదొక్కటే కాదు... ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అనేక అంశాలపై జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, లెక్కకు మించిన సలహాదారులు ఉన్నా కోర్టుల్లో సర్కారుకు తలబొప్పి కడుతూనే ఉంది. హడావుడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం... కోర్టుల్లో చుక్కెదురు కావడం షరామామూలుగా మారిపోయింది. ఇక... శాసనసభ వేదికగానే ఆమోదించిన అనేక బిల్లులు, చేసిన చట్టాలూ అతీగతీలేకుండా పోయాయి. పేరుగొప్పగా ప్రకటనలు చేయడం... ఆ తర్వాత మాట మడతేయడం ఈ సర్కారుకు ఒక అలవాటుగా మారింది. ఇప్పటిదాకా ఇలా ‘మడమ తిప్పిన’ అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇవి... అమరావతిపై పదేపదే... విపక్షంలో ఉండగా అమరావతికి మద్దతు పలికారు. అదే రాజధానిగా ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించారు. 2019 డిసెంబరు 19న మూడు రాజధానుల ప్రకటన చేశారు. 2020 జనవరిలో ఆ బిల్లులు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందారు. అదే ఏడాది జూలై 31న గవర్నర్ వాటిని ఆమోదించారు కూడా! ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును ‘రద్దు’ చేశారు. మళ్లీ సమగ్రంగా బిల్లులు ప్రవేశపెడతామంటున్నారు. మండలిపై మాటమడత... ఇంగ్లీషు మీడియం, మూడు రాజధానుల బిల్లులకు అడ్డుతగులుతోందంటూ శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. 2020 జనవరి 27న శాసనసభలో తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని వెంటనే కేంద్రం ఆమోదం కోసం కూడా పంపించారు. అప్పటికే ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా పనిచేస్తోన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభా్‌షచంద్రబో్‌సలతో రాజీనామా చేయించి... వారిని రాజ్యసభకు పంపించారు. మండలిపై అప్పటి వేడి మొత్తం ఇప్పుడు చల్లారి పోయింది. మండలిలో తమకు మెజారిటీ రాగానే... రద్దు అన్నదే ముద్దు అయ్యింది. ఎస్‌ఈసీపై గజిబిజి స్థానిక ఎన్నికలు తాము అనుకున్నట్లుగా జరగడంలేదంటూ అప్పట్లో ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై కత్తికట్టారు. ఆయనను ఇంటికి పంపేందుకు ఏకంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి, పదవీకాలాన్ని కుదించేలా ఆర్డినెన్స్ తెచ్చారు. రాత్రికి రాత్రి జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. చివరకు అది న్యాయపరిశీలనలో వీగిపోయింది. ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో మళ్లీ నిమ్మగడ్డే ఎన్నికల కమిషనర్ అయ్యారు. ఈ పోరాటంలో గెలిచిన నిమ్మగడ్డ తన పదవీకాలం పూర్తయ్యేవరకు సేవలందించారు. అసైన్డ్ భూములపై అయోమయం పేదలకు సాగుభూములు, ఇంటి స్థలాలను కేటాయించాలంటే ఆంధ్రప్రదేశ్ అసైన్‌మెంట్ చట్టప్రకారం నడుచుకోవాలి. స్థలాలను డీకేటీ పట్టాల రూపంలోనే ఇవ్వాలి. అయితే, జగన్ సర్కారు పేదలకు కన్వేయెన్స్ డీడ్ రూపంలోనే ఇంటిపట్టాలు ఇస్తామంటూ జీవోలు జారీ చేసింది. ఇది కుదరదని హైకోర్టు తేల్చేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు ఎంతకీ విచారణకు రాలేదు. మరోవైపు, అసైన్డ్ ఇంటి స్థలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదంటూ ఏపీ సర్కారే ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అమల్లో ఉండగానే కన్వేయెన్స్ డీడ్‌లు ఎలా ఇస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే నీళ్లు నమలాల్సిందే. దీంతో సర్కారు ఆ కేసు విచారణలో ఉండగానే పాత పద్ధతిలో... అసైన్‌మెంట్ చట్టం-1977 ప్రకా రం డీకేటీ పట్టాల రూపంలోనే ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసింది. దిశలేని దిశ మహిళలపై అత్యాచారాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామంటూ... 2019 డిసెంబరు 13న అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ఆమోదించారు. 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేయడం, దోషులను ఉరి తీయడం... ఇందులో ముఖ్యాంశాలు. సర్కారు ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, కేంద్ర చట్టాలను తోసిరాజనేలా సొంతంగా చట్టాలు చేయడమే అసలు సమస్య! దీంతో... ‘దిశ’ బిల్లును కేంద్రం ఆమోదించకుండా తిప్పి పంపించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా తిరుగు టపాలో వచ్చేసింది. దీంతో... ఈ బిల్లులను గత ఏడాది డిసెంబరులో ఉపసంహరించుకున్నారు. వాటికి స్వల్పమార్పులు చేసి... మళ్లీ కేంద్రానికి పంపించారు. 11 నెలలుగా దీనిపై కేంద్రంలో దీనిపై కదలికే లేదు. అంతుచిక్కని ‘టైటిల్’ దేశంలోనే అందరికంటే ముందు భూములకు శాశ్వత టైటిల్ ఇస్తామని, దీని ఆధారంగా సర్వేకూడా చేస్తామని 2019 జూలై 30న ఏపీ ల్యాండ్‌టైటిల్ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించారు. ఇది అనేక కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఆ బిల్లు ఉందని తేలింది. దీంతో గత ఏడాది డిసెంబరులో ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు. దీనికి మార్పులు చేసి 2020 డిసెంబరు 4న మరో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఇప్పటికే 11 నెలలవుతోంది. ఆ బిల్లులోని అంశాలు కేంద్ర చట్టాలకు పోటీగా ఉన్నాయంటూ కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేదు. niku comedy ga undi ba chanchalguda lo madamalani irragottaru noppi tho madama tipputadu ante adi teliyaka nuvvu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.