Jump to content

Sensitive hearts dont read it


Recommended Posts

Posted

ఈ పోస్ట్ పెడుతున్నందుకు క్షమించాలి .  నిజం .. అది ఎంత చేదుగా వున్నా తెలుసుకోవాలి . కదా ? మనం కళ్ళు మూసుకొని అంత సవ్యంగా వుంది అంటే సరి పోతుందా ? నిజం తెలుసు కోవాలంటే చదవండి . అదే సమయం లో సున్నిత మనస్కులు దీని చదవొద్దు . వదిలెయ్యండి .

వ్యభిచారం !  ఒకప్పుడు ఈ పదాన్ని వాడేవారు . తరువాత రోజుల్లో వ్యభిచారి అనే పదాన్ని సెక్స్ వర్కర్ అనే పదం తో రీప్లేస్ చేసారు . 

సెక్స్ వర్కర్ అంటే ఎవరు ?  బతకడానికి మరే ఇతర మార్గం లేకుండా ఒళ్ళమ్ముకొనే వారు . కదా ? సెక్స్ వర్కర్ లు అందరూ పొట్టగడవని వారే . సెక్స్ సర్వీస్ చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించే వారే . ఇది ఇప్పటిదాకా తెలిసింది . 

ప్రపంచం మారుతోంది . మార్పులో మంచి చెడు రెండూ వున్నాయి . విలాసవంతమైన జీవనం గడపడానికి , లేదా ఉన్నత చదువులు పూర్తిచేసుకోవడానికి అంటే దానికోసం తగినంత ఫీజు కట్టడానికి అవసరం అయిన డబ్బు సంపాదించడానికి యూనివర్సిటీ విద్యార్థులు సెక్స్ ను ఒక వృత్తిగా ఎంచుకొంటే ? 

ఎవరో ఎక్కడో ఒకరో ఇద్దరో చేస్తే ..ఆ అది రేర్ అంటే అరుదుగా జరిగే విషయం .. వ్యక్తి పైత్యం అనుకోవచ్చు . అలాంటి ఒకటి రెండు ఘటనల్ని వదిలేయొచ్చు . కానీ వందల్లో , వేలల్లో జరుగుతుంటే ? అది ఒక ట్రెండ్ గా మారుతుంటే ? అప్పుడు దాన్ని పట్టించుకోవాలి . అవునా ? కాదా ? 

నమ్మలేని విషయాలు .. అయ్యో ఇది తప్పైతే బాగుండు అనుకొనే విషయాలు ఇవిగో . సున్నిత మనస్కులు  ఇప్పటికైనా పోస్ట్ చదవడం ఆపెయ్యండి . 

1 . బ్రిటన్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య. 24  లక్షలు . ఇందులో ఒక లక్ష మంది సెక్స్ సర్వీసెస్ చేసి డబ్బు గడిస్తున్నారు . 

2 . డబ్బు అవసరం అయినప్పుడు తాము దీన్ని  చేస్తామని మరో లక్ష మంది విద్యార్థులు చెబుతున్నారు . అంటే ప్రతి పదిమందిలో ఒకరు దీనికి రెడీ . 

౩. వీరిలో సింహ భాగం యూనివర్సిటీ విద్యార్థులే . అందునా ఎక్కువ మంది అమ్మాయిలే . 

4 . షుగర్ డాడీ . అంటే డబ్బున్న  ఒక మధ్య వయస్కడు ఒక అమ్మాయి ని ఎంచుకొని స్పాన్సర్ చేస్తాడు . ఆమె అతనికి ప్రియురాలిగా వ్యవహరిస్తుంది. టూర్ ల కు వెళ్లడం లాంటివి చేస్తారు . వారి మధ్య సెక్స్ జరుగుతుంది . ఇందుకు ప్రతిఫలంగా ఆ వ్యక్తి ఆ అమ్మాయి చదువు , దుస్తులు , ఇంటి అద్దె లేదా హాస్టల్ ఖర్చులు లాంటివి భరిస్తాడు . దీని కోసం షుగర్ డాడీ సైట్స్ వున్నాయి . ఇందులో షుగర్ డాడీ గా వ్యవహరించాలని అనుకొన్న వారు ప్రకటన ఇస్తారు . అమ్మాయి లు కూడా ప్రకటనలు ఇస్తారు . ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు . ఇప్పుడు బ్రిటిష్ ప్రధాని నిన్నటి షుగర్ డాడీ . దీనికి సంబంధించి పుంఖానుపుఖాల డేటా ను ఇటీవల డెలీట్ చేసారు . షుగర్ డాడీ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా ఎక్కువవుతోంది . 

4 . వెబ్ కాం సెక్స్ , పోర్న్ ఫిలిమ్స్ లో నటించడం , సెక్స్ వర్కర్ గా, వ్యవహరించడం, సెక్స్ మోడలింగ్  ఇలాంటివి మిగతా పద్ధతులు . 

 5 . యూనివర్సిటీ లు ఇలాంటి వాటిని ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నాయి . ఇదే అన్నిటికన్నా ఆందోళనకరం . ఒక యూనివర్సిటీ లో చదవాలంటే హాస్టల్ ఖర్చులతో కలుపుకొని నెలలు ఎనిమిది వందల పౌండ్స్ ఖర్చు అవుతుంది . అంటే సుమారుగా నెలకు ఎనభై వేలు . ఇంత డబ్బు కావాలంటే ఇదే సరైన మార్గం అని ఎక్కువ మంది ఇదే దారిన వెళుతున్నారు . యూనివర్సిటీ ప్రొఫసర్ లు ఇదేమీ తప్పు కాదు అన్నట్టు విద్యార్థులతో చెబుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు . జూనియర్ విద్యారులను ఇలాంటి విషయాల్లో ట్రైన్ చేయడానికి కొన్ని విద్యార్ధి సంఘాలు కార్యక్రమాలను చేపడుతున్నాయి . 

6 . గతం లో విద్యార్థులు హోటల్స్ లాంటి వాటిలో సర్వర్ లు గా పని చేసి డబ్బు సంపాదించేవారు . పండెమిక్ వల్ల హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దెబ్బ తింది. దీనితో సెక్స్ సర్వీస్ బాగా పుంజుకొంది . రూమ్ లో కూర్చొని వెబ్ కాం లో సెక్స్ చాటింగ్ , న్యూడ్ మోడలింగ్ , ఫోటోలు షేర్ చేసుకోవడం ఆ విధంగా డబ్బు సంపాదించడం తేలిక అనే అభిప్రాయం ప్రబలుతోంది . ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతున్నారు . 

7 . ఫైవ్ స్టార్ హోటల్స్ , ఫైవ్ స్టార్ క్రూజ్ లాంటి వాటిలో గడిపే అవకాశం , పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు ఆకర్షితులు అవుతున్నారు . ఆసియా ఖండానికి చెందిన అమ్మాయిలు కూడా ఆకర్షితులు అవుతున్నారు . కానీ ప్రస్తుతానికి వీరి సంఖ్య తక్కువ . 

 8 . ఒక అడుగు ముందుకు వేసి లీసెస్టర్ యూనివర్సిటీ బాహాటంగానే స్టూడెంట్ సెక్స్ టూల్ కిట్ ను తీసుకొచ్చింది . సెక్స్ వర్క్ లో పాల్గొనే విద్యార్థులకు సూచనలు సలహాలు ఇస్తోంది . అంతే కాకుండా ఇలాంటి విద్యార్థులకు దేశం లోపల సపోర్ట్ సర్వీసెస్ ఇష్టమంటోంది . సారీ అండీ .. నిజం నిష్ఠూరంగా ఉంటుంది . అంటే తార్పుడు గాడిలాగా యూనివర్సిటీ వ్యవహరిస్తోంది . "ఇదేమీ తప్పు కాదు . ఎంతో మంది విద్యార్థులు ఇదే దారిలో వున్నారు . వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు . వారి సమస్యలను తీర్చడమే ఈ టూల్ కిట్ లక్ష్యం"  అని చెప్పుకొంటోంది . న్యూ castle  విశ్వ విద్యాలయం కూడా స్టుడెంట్ సెక్స్ వర్కర్స్ కు సంబంధించి ఒక విధానాన్ని ప్రచురించింది . నమ్మండి .. నమ్మకపోండి .. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా గత సంవత్సరం దీని సంబంధించి కరపత్రాలను పంచింది . సెక్స్ వర్క్ ను సమర్తించేలా ఇది వుంది . గోల్డ్స్మిత్ , ఎడిన్బర్గ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ స్టూడెంట్ సెక్స్ వర్క్ అనేది మిగతా వృతుల్లాగే ఒక వృత్తి . దీన్ని  తప్పుపడితే సహించం అని ప్రకటించాయి . సుసెక్స్ ఇంకా bringhton యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమాల్లో సెక్స్ వర్కర్ స్టుడెంట్స్ కోసం ప్రత్యేక స్టాల్ల్స్ ఏర్పాటు చేసాయి . 

ఇంకా చాలా వుంది . చాలు . ఈ పోస్ట్ పెట్టినందుకు నా పై నాకే అసహ్యం వేస్తోంది . సారీ .

-online ref

Posted
35 minutes ago, sri_india said:

onlyfans  and ashleyrnadison(very popular among rich) 

Good news is desi fafa .com inka start kaledu. 

Posted
3 minutes ago, anna_returns_1 said:

Good news is desi fafa .com inka start kaledu. 

LOl , there are too many bro already ..... did you hear about omegla and other similar sites .... plenty of indians girls , all you need is a phone and internet connection .... very sad to see 

Posted
On 11/26/2021 at 12:42 AM, sri_india said:

LOl , there are too many bro already ..... did you hear about omegla and other similar sites .... plenty of indians girls , all you need is a phone and internet connection .... very sad to see 

Oh my yesayya nizama 🙄

Posted

 1 ప్రపంచం లో అతి ప్రాచీన వృత్తి సెక్స్ వర్క్ . యూనివర్సిటీ ఫీజు కట్టడానికి సెక్స్ వర్క్ చేస్తామంటున్న కొంతమంది విద్యార్థులు . సెక్స్ వర్క్ ద్వారా ఉపాధి పొందినప్పుడు ఇక ఉన్నత విద్య ఎందుకు ? షుగర్ డాడీ ద్వారా ఇప్పుడు పొందిన సంపాదనకన్నా రేపు మీ చదువు ద్వారా పొందే ఉపాధి ఎక్కువ సంపాదన నిస్తుందా ? 

2 . ఇరవై అయిదేళ్లకే షుగర్ డాడీ ద్వారా ఫస్ట్ క్లాస్ ఎయిర్ ట్రావెల్.  సెవెన్ స్టార్ హోటల్స్ . క్రూజ్ . స్కాచ్ ఇలాంటి లగ్జరీస్ అనుభవిస్తే రేపు ముప్పై అయిదు దాటాక ఏమి చేసి , ఎలా సంపాదించి ఈ లైఫ్ స్టైల్ మైంటైన్ చేస్తారు ? 

3 . మోనాగామి అంటే  ఏకవివాహం . కొన్ని వేల సంవత్సరాల నాగరికతా పరిణామక్రమం లో ఆవిర్భవించింది . డబ్బున్న ముసలాడు షుగర్ డాడీ పేరుతొ పడుచు అమ్మాయిల తో లింక్ ఏర్పరచుకొంటే వయసులో వున్నా కుర్రాళ్లకు ప్రేమకు , పెళ్ళికి అమ్మాయిలు దొరకని స్థితి . డబ్బుంటే కానీ కనీసం పెళ్లి కాదు .. అమ్మాయి దొరకదు .. డబ్బుంటే ఏదైనా సాధ్యమే అని స్థితి సమాజం లో ఏర్పడితే డబ్బు సంపాదనకు యువకులు డ్రగ్స్ , గ్యాంబ్లింగ్ , కిడ్నప్ లాంటి క్రైమ్ వైపు మళ్ళారా? 

4 . గే ల వాంఛ తీర్చడానికి సెక్స్ వర్కర్ గా మారిన యువకులు అటు పై ఒక స్త్రీని పెళ్ళాడి సెంసారా సుఖం పొందగలరా ? ఇవ్వగలరా ? 

5 . ఇరవై లో వున్నప్పుడు సెక్స్ వర్కర్ గా మారి బహుళ సంఖ్యలో పురుషులతో లైంగిక సంబంధం ఏర్పరచుకొన్న స్త్రీ అటుపై ముప్పై లో భర్త తో స్థిరపడే అవకాశం ఎంత ? ఆ కాపురాలు నిలబెడుతాయా ? ఎమోషనల్ బాండింగ్ వస్తుందా ? 

5 . సెక్స్ వర్క్ వల్ల అవాంఛిత గర్భం , abortion, మద్యం , ధూమపానం , డ్రగ్స్ .. ఇలాంటి స్ర్తీకి పుట్టే పిల్లల ఆరోగ్య స్థితి ఏంటి ? 

ఇరవై లో వున్నప్పుడు పదేళ్ళపాటు అడ్డదారిలో సుఖాలు సరే అటుపై నలభై ఏళ్ళ పాటు జీవితం నరకం ! అనారోగ్యం ! ఒంటరి తనం ! ఎమోషనల్ క్రైసిస్ ! ఇదేనా జీవితం ! 

చదవేస్తే ఉన్నమతి పోవడం అంటే ఇది కాక మరేదీ?

చదువంటే ? 

జీవితాన్నిచేది ? ఎలా బతకాలో చెప్పేది ! జీవితాంతం సంతోషంగా బతకడానికి దారి చూపేది . 

యూనివర్సిటీ విద్య కు ఇది మరింత వర్తిస్తుంది . తమకు జీతాలు రావాలంటే స్టూడెంట్స్ సెక్స్ వర్క్ చేసినా తప్పులేదు అనుకునేవాడు ప్రొఫెసర్ కాదు బ్రోకర్. అలాంటి యూనివర్సిటీ విద్యాలయం కాదు. రెడ్ లైట్ ఏరియా. 

బ్రిటిష్ యూనివర్సిటీ ల కు మీ    పిల్లలను పంపొద్దు . కుక్క కాటుకు చెప్పు దెబ్బ . బిజినెస్ దెబ్బతింటే వారే దిగొస్తారు . సెక్స్ టూల్ కిట్ లాంటి వెర్రి మొర్రి విధానాలను మార్చుకొంటారు .

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...