kevinUsa Posted December 14, 2021 Report Posted December 14, 2021 లండన్: ‘ఒమిక్రాన్’ కారణంగా వచ్చే ఏప్రిల్ చివరినాటికి 25,000 నుంచి 75,000 వరకూ మరణాలు చోటుచేసుకోవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది! డెల్టా కారణంగా ఈ ఏడాది జనవరిలో నమోదైన కేసులతో పోలిస్తే, ఒమిక్రాన్ ఉద్ధృతి మరింత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. ‘లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్’ శాస్త్రవేత్తలు ఈ విశ్లేషణ సాగించారు. వ్యాక్సినేషన్ కారణంగా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలను సైతం ఒమిక్రాన్ తప్పించుకుంటోంది. అందుకే టీకా రెండు డోసులు తీసుకున్నవారు కూడా ఈ వేరియంట్‌కు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మూడు పరిస్థితుల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి ఎలా ఉంటుందన్నది వారు అంచనా వేశారు. 1) ప్రస్తుత పరిస్థితే ఉంటే: ఒమిక్రాన్ వ్యాప్తి ఇప్పుడున్న మాదిరే కొనసాగితే... ఏప్రిల్ చివరి నాటికి బ్రిటన్‌లో రోజూ 2 వేల మంది ఆసుపత్రుల్లో చేరతారు. అప్పటికి మొత్తంగా 1,75,000 మంది ఆసుపత్రుల్లో చేరవచ్చు. వీరిలో 24,700 మందికి మరణముప్పు ఉంటుంది. 2) తక్షణమే కట్టడి చర్యలు తీసుకుంటే: బూస్టర్ డోసు అందించడం; వైరస్ వ్యాపించకుండా, ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవడం వల్ల ఆసుపత్రుల్లో చేరాల్సినవారి సంఖ్య 53 వేలు, మరణాల సంఖ్య 7,600 మేర తగ్గుతాయి. 3) తీవ్రత పెరిగితే: ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైరస్ మరింత విజృంభించే పక్షంలో... 4,92,000 మంది ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. వీరిలో 74,800 మంది మరణించవచ్చు. చైనాలో ‘డెల్టా’ విజృంభణ బీజింగ్: చైనాలో కరోనా డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. జెజియాంగ్ రాష్ట్రంలో వారం రోజుల్లోనే 138 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 74 కేసులు వెలుగుచూసినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. లక్షణాల్లేని కేసులు కూడా ఉంటున్నట్టు తెలిపింది. ఇవన్నీ డెల్టా ఉపవర్గానికి చెందిన ‘ఏవై.4’ వైరస్ కారణంగానే నమోదవుతున్నట్టు పేర్కొంది. దీంతో జెజియాంగ్‌లో ప్రయాణాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఫిబ్రవరిలో బీజింగ్ శీతాకాల ఒలింపిక్స్ జరుగనున్న క్రమంలో కేసులు పెరుగుతుండటాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. వైరస్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు సున్నా కేసుల విధానాన్ని అనుసరిస్తోంది. కాగా చైనాలో సోమవారం తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. Ad బ్రిటన్‌లో తొలి మరణం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ప్రపంచంలో తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో ఇది అధికారికంగా నమోదైనట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం వెల్లడించారు. త్వరలోనే ఒమిక్రాన్ ఉద్ధృతి రానుందని, ఈ విషయంలో సందేహం అక్కర్లేదని అన్నారు. రెండు డోసుల టీకాతో సంపూర్ణ రక్షణ లభించదని, అర్హులైన వారంతా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండినవారందరికీ బూస్టర్ డోసు అందించే ‘ఒమిక్రాన్ ఎమర్జెన్సీ బూస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. Quote
kevinUsa Posted December 14, 2021 Author Report Posted December 14, 2021 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భౌగోళిక ముప్పుగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇది 60కి పైగా దేశాలకు వ్యాప్తి చెందినట్లు పేర్కొంది. ఇది టీకాల నుంచి పొందుతున్న రక్షణను ఏమార్చుతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నప్పటికీ.. వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందనే విషయంపై మాత్రం సమాచారం పరిమితంగానే ఉందని వెల్లడించింది. ‘అనేక కారణాలతో ఒమిక్రాన్‌తో ప్రమాదం ఎక్కువగానే ఉంది. మరో విషయం ఏంటంటే.. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రోగ నిరోధక శక్తిని ఏమార్చుతుందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర పరిణామాలతో మరో విజృంభణకు దారితీయొచ్చు’ అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అలాగే దక్షిణాఫ్రికాలో రీఇన్ఫెక్షన్ పెరుగుతున్నట్లు వెలువడిన సంకేతాలను ప్రస్తావించింది. ‘ఈ కొత్త వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో ఒక అంచనాకు వచ్చేందుకు మరింత సమాచారం కావాల్సి ఉంది. డెల్టా కంటే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. వైరస్ వేగంగా ప్రబలితే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుంది. దాంతో వైద్య సేవలపై భారం పెరుగుతుంది. అప్పడది మరిన్ని మరణాలకు దారితీయవచ్చు’ అని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్‌ను గుర్తించిన కొద్ది రోజుల్లోనే 60కి పైగా దేశాలకు వ్యాపించింది. భారత్‌లో 38 మంది ఈ వేరియంట్ బారినపడ్డారని కేంద్రం వెల్లడించింది. Quote
kevinUsa Posted December 14, 2021 Author Report Posted December 14, 2021 @dasari4kntrbbhayya Omicron kosam oka separate thread veyi Add it to pinned post Quote
nallaberry Posted December 14, 2021 Report Posted December 14, 2021 30 minutes ago, kevinUsa said: @dasari4kntrbbhayya Omicron kosam oka separate thread veyi Add it to pinned post Aatcare Quote
dasari4kntr Posted December 14, 2021 Report Posted December 14, 2021 38 minutes ago, kevinUsa said: @dasari4kntrbbhayya Omicron kosam oka separate thread veyi Add it to pinned post We can use this thread… you can chnage this title… i will add it in few mins… Quote
VictoryTDP Posted December 14, 2021 Report Posted December 14, 2021 1 minute ago, kevinUsa said: Mee Canada vaadu malli shut down chesthada? Quote
kevinUsa Posted December 14, 2021 Author Report Posted December 14, 2021 1 minute ago, VictoryTDP said: Mee Canada vaadu malli shut down chesthada? Very soon bro Ontario lo next year elections unnyai So shutdown 50-50 Quote
dasari4kntr Posted December 14, 2021 Report Posted December 14, 2021 @kevinUsa updated in directory... Corona Related *** OMICRON UPDATES *** ****CORONA VIRUS UPDATES**** Corona Tested +Ve aithe Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.