vaakel_saab Posted December 30, 2021 Report Posted December 30, 2021 https://telugu.greatandhra.com/articles/mbs/haunting-drusyam-123374.html read this.. vaakel saab buget 3 crs... stars ni petti 70C chesinru.. సినిమా పరిశ్రమ తరలి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి దొరుకుందంటూ సినీ పెద్దలకు స్టూడియో కట్టుకోవడానికి ఉచితంగానో, తక్కువ రేటుకో స్థలం యిచ్చేది ప్రభుత్వమే – అభ్యంతరం లేదు! దాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని అడిగితే సరేననేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! కొన్నాళ్లకు స్టూడియో కట్టడం కుదరలేదు, సినిమా హాలు కడతాం, షాపింగు కాంప్లెక్స్ పెడతాం, మార్పిడికి అనుమతి యివ్వండి అంటే యిచ్చేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! సినిమాలో రోజూ పని దొరికేది చాలా కొద్దిమందికే, నాలుగు రాళ్లు వెనకేసుకుని యిళ్లు కట్టుకునేది కొందరికే సాధ్యం. అందువలన సినీ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు యిళ్లు కట్టుకోవడానికి స్థలాలు యివ్వాలని అడిగితే యిచ్చేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! మీరు ప్రత్యేకంగా సబ్సిడీ యిస్తేనే మీ రాష్ట్రంలో షూటింగు జరుపుతాం అంటే సరే, సబ్సిడీ యిస్తాం అనేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ అని పెట్టి సినిమాలకు ఆర్థికసాయం అందించండి అంటే సరేనని యిచ్చేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! మంచి సినిమాలను ప్రోత్సహించడానికి ఏటేటా లక్షలాది రూపాయల అవార్డులు యిచ్చేదీ ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! సినిమా షూటింగు సమయాల్లో, సినిమా రిలీజు సమయంలో, విజయోత్సవసభల సందర్భంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేది ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! టూరిస్టు స్పాట్‌లలో సందర్శకులను ఆపేసి, సినిమా షూటింగు చేసుకోవడానికి అనుమతి యిచ్చేది ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! తెరపై వందలాది సైనికులను చూపించాలంటే మిలటరీ వాళ్లనో, పోలీసులనో వాడుకోవడానికి అనుమతి యిచ్చేది ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! థియేటర్ల క్వాలిటీ ఎలా ఏడ్చినా సినిమా టిక్కెట్లు పెంచేది ప్రభుత్వమే - అభ్యంతరం లేదు! సినిమా టిక్కెట్లు తగ్గించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది – అభ్యంతరం వుంది! మా ప్రోడక్టు, అమ్మడానికి మేం రెడీ, కొనడానికి ప్రేక్షకుడు రెడీ, మధ్యలో ప్రభుత్వం ఎవరు ధర నిర్ణయించడానికి? ప్రభుత్వమే కాదు, ఎవరూ మా పనితీరుని విమర్శించడానికి లేదు. Quote
hunkyfunky2 Posted December 30, 2021 Report Posted December 30, 2021 This part is well said and written.. మన దగ్గర ఎవరైనా కొత్త దర్శకుడు కొత్త తరహా కథతో సినిమా తీసి హిట్ చేశాడనుకోండి. రియల్లీ యంగ్ లుకింగ్ కొత్త హీరో రంగంపై వచ్చేస్తాడు. వెంటనే సీనియర్ హీరోలు ఎలర్ట్ అవుతారు. దర్శకుడికి కబురు పెట్టి నా తర్వాతి సినిమా నీతోనే, కథ సిద్ధం చేసుకో అంటారు. అబ్బ, ఎంత గొప్ప ఛాన్సో అనుకుంటూ అతను అతన్ని మెప్పించే కథ గురించి కిందామీదా పడుతూ కథలు చెప్తూ వుంటాడు. అబ్బే, యింకా బాగా చెక్కాలి అంటూ తాత్సారం చేస్తూ, అతను యీ లోపున మరో హీరోని తయారు చేయకుండా చూస్తారు. ఈ లోగా హీరో హిందీయో, తమిళమో, మలయాళమో రీమేక్‌కు సైన్ చేస్తాడు. ఈ దర్శకుడి సంగతా? విజయవంతమైన సినిమా తీసి ఏళ్లూ, పూళ్లూ అయినా అతను యిలాగే తుప్పు పట్టిపోతాడు. అతనికి క్రమంగా తనపై తనకు విశ్వాసం నశిస్తుంది. చివరకు తన క్రియేటివిటీ నశించి, ప్రేక్షకులకు నచ్చే సినిమా కాకుండా, హీరో మెచ్చే సినిమా తీస్తాడు. ఫ్లాపవుతుంది. హీరో మళ్లీ అతన్ని గడప తొక్కనివ్వడు. పోనీ ఆ రీమేక్ నేనే తీస్తానండీ అంటే దాన్ని యథాతథంగా తీయనివ్వరు. నా యిమేజికి తగ్గట్టు మార్పులు చేయాలంటారు. ‘‘పింక్’’ సినిమా రేంజ్ ఎంత చిన్నది చెప్పండి. ఏ వెంకటేశో, రాజేంద్ర ప్రసాదో అమితాబ్ పాత్ర వేసి వుంటే సరిపోయేది. పవన్ కన్ను పడింది. ‘‘వకీల్ సాబ్’’లో హీరోయినూ వగైరా వచ్చి చేరారు. సినిమా భారీ బజెట్ అయింది. తెరపై చూడ్డానికి కోర్టు డ్రామా తప్ప ఏమీ లేదు. కానీ భారీ సినిమా పేరుతో హెచ్చు రేట్లకు అమ్మారు. ఆ రేటుకి ఆ సినిమా కిట్టుబాటా? ‘‘అయ్యప్పనుమ్ కోషియుమ్’’ సినిమా చూస్తే దానికి పెద్దగా ఖర్చేమీ కాలేదని అర్థమౌతుంది. కథలో ఖర్చుకి స్కోపు కూడా ఏమీ లేదు. కానీ ‘‘భీమ్లా నాయక్’’ అంటూ భీకరమైన హై బజెట్ సినిమా తీసేస్తున్నారు. ‘‘లూసిఫర్’’ సినిమా రీమేక్ చిరంజీవితో అనగానే దాన్నీ ఎక్కడికో తీసుకుపోయి, టిక్కెట్టు 2 వేలంటారు. ఇవేమైనా సెట్స్ భారీగా వున్న చారిత్రాత్మకాలా? జానపదాలా? సైఫియా? యానిమేషనా? హేమాహేమీల మల్టీస్టారర్సా? అవి హైబజెట్ అయ్యాయంటే హీరోల పారితోషికాల వలననే తప్ప సినిమాకు అవసరమై కాదు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.