r2d2 Posted January 7, 2022 Report Posted January 7, 2022 ఎట్టకేలకుఉద్యోగులకుపీఆర్సీ ప్రకటించిన ఏపీ సర్కార్ అమరావతి: ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జూన్ 30లోపు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30లోపు ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచి నిర్ణయమేనని అమరావతి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్సీ ప్రకటించారు. ఉద్యోగుల సొంతింటి కల నెరవేరనుంది: బొప్పరాజు రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్య పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగుల సొంతింటికల నెరవేర్చేలా సీఎం నిర్ణయం తీసకున్నారు. స్మార్ట్ సిటీలో ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి 20శాతం రాయితీ ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఒకటో తేదీకే జీతాలు ఇస్తామన్నారు. సీపీఎస్ అంశంపై టైమ్ బౌండ్ ప్రకటించారు. ఫిట్ మెంట్ సమస్య మినహాయిస్తే.. మిగిలిన అన్ని సమస్యలపై సీఎం .. టైమ్ బౌండ్ ప్రకటించడం మంచి నిర్ణయమే’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. Quote
Popular Post r2d2 Posted January 7, 2022 Author Popular Post Report Posted January 7, 2022 1 minute ago, Sucker said: Musugu Pulka 3 Quote
r2d2 Posted January 7, 2022 Author Report Posted January 7, 2022 5 minutes ago, chandrabhai7 said: Bane ichadu ga only time will tell.. for now he postponed the problem.. Quote
chandrabhai7 Posted January 7, 2022 Report Posted January 7, 2022 5 minutes ago, r2d2 said: only time will tell.. for now he postponed the problem.. 23 % ichadu ga Quote
JANASENA Posted January 7, 2022 Report Posted January 7, 2022 CBN gaadu 65 years chesthademo taravata malli jagan 70 taravata PK gaadu 75 malli jagan no retirement antademo !!!!!!! Quote
naranjaX Posted January 7, 2022 Report Posted January 7, 2022 3 hours ago, Sucker said: Musugu Pulka 3 hours ago, r2d2 said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.