paaparao Posted February 14, 2022 Report Posted February 14, 2022 వెనకాల ఉంది పీకేనే.. కన్ఫార్మ్ చేసిన కేసీఆర్! ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ గెలిచిన టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఎదిగింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తనకు ప్రత్యర్థి లేకుండా చేసుకున్నారన్నా అభిప్రాయాలు వినిపించాయి. కానీ గత రెండేళ్లుగా పరిస్థితిలో మార్పు వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ఎదుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ.. కేసీఆర్కు సవాలు విసురుతోంది. దీంతో కాంగ్రెస్.. ఆ పార్టీపై యుద్ధం ప్రకటించారు. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మోడీని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే వెనకాల ఉండి నడిపిస్తున్నారని చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడదే స్పష్టమైంది. కేసీఆర్ వెనకాల పీకేనే ఉందనే విషయంపై క్లారిటీ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. స్వయంగా కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారని చెబుతున్నారు. తాజాగా విలేకర్ల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. తాజాగా దేశంలో రాజకీయ పరిస్థితులపై పీకే బృందం సర్వే నిర్వహిస్తోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కూడా వాళ్లు సర్వే చేస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా సర్వేలు చేయిస్తోందని అసలు విషయాన్ని బయటపెట్టారు. పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తామని అన్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత గ్రహించారు. అందుకే పీకే సూచనల మేరకే కేసీఆర్ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తరహాలో కూడా ఇక్కడ బీజేపీని టార్గెట్ చేసి తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు బట్టి అదే నిజమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. Quote
skumarpati Posted February 14, 2022 Report Posted February 14, 2022 these day every party opp to BJP seeking PK and his allies help too normal Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.