summer27 Posted February 17, 2022 Report Posted February 17, 2022 టాలీవుడ్ కు సంబంధించి బాగా ట్రోల్ అయ్యే జాబితాలో మంచు కుటుంబం ముందు వరసలో ఉంటుంది. సోషల్ మీడియాను కాస్త గమనించే వారెవరైనా ఈ విషయాన్ని గుర్తిస్తారు. ఈ అంశంపై పలు సార్లు మంచు ఫ్యామిలీ కూడా స్పందించింది. గతంలో విష్ణు స్పందిస్తూ..అడ్రస్ లేని వాళ్లు ఏదేదో పోస్టు చేస్తారంటూ తను వాటిని లెక్క చేయనన్నారు. దమ్ముంటే తాము ఎక్కడ ఉంటామో చెప్పి ట్రోల్ చేయాలన్నారు. ఇక గత ఏడాది ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు మోహన్ బాబు. తమ పరువు నష్టం కలిగించేలా ట్రోల్ చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. అప్పుడు కొన్ని యూటూబ్ చానళ్లను గుర్తించి లీగల్ చర్యలకు ఉపక్రమించారు. తాజాగా మోహన్ బాబు మరో ఘాటైన విషయాన్ని వెల్లడించారు. తమపై ట్రోల్ చేయిస్తున్నది ఇద్దరు హీరోలు అని కలెక్షన్ కింగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేకంగా టీమ్ లను పెట్టి తమను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయిస్తున్నారంటూ మోహన్ బాబు అన్నారు. ట్రోల్స్ సరదాగా ఉంటే నవ్వుకోవచ్చని, అయితే అవి తనకు బాధను కలిగించే రీతిలో ఉంటున్నాయన్నారు. తనపై ట్రోల్ చేయిస్తున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో కూడా తనకు తెలుసని, జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి గమనిస్తోందంటూ మోహన్ బాబు హెచ్చరించారు. అయితే ఆ ఇద్దరు హీరో పేర్లను మోహన్ బాబు బయటపెట్టలేదు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.