Jump to content

Mahesh rocks.....palamoor rocks....again


Recommended Posts

Posted

హైదరాబాద్, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు తాను అస్తమిస్తూ మరో ఏడుగురికి పునర్జన్మను ఇచ్చాడు. మోహన్ ఫౌండేషన్, గ్రామ సర్పంచ్ చొరవతో అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకువచ్చారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ మండలం, నర్సప్పగూడ గ్రామానికి చెందిన మహేష్ (18) ఈ నెల 3న తన తండ్రితో కలసి పొలానికి నడిచి వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడి వైద్యులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో మహేష్‌ను నగరంలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, ప్రమాదంలో మెదడు బాగా దెబ్బతినడంతో కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పారు. ఈనెల 6న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. మోహన్ ఫౌండేషన్ సీఈఓ రఘురాం, గ్రామ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ చొరవతో కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కిడ్నీలు, లివర్, గుండె కవటాలు, కళ్లు సేకరించి ఏడుగురికి అమర్చారు.

you rock you rock you rock

Posted

Mahesh RIP ....  you rock you rock you rock

×
×
  • Create New...