psycopk Posted March 22, 2022 Report Posted March 22, 2022 రఘురామపై పరువు నష్టం దావా!.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22-03-2022 Tue 18:20 ఏపీలో దొరికే మద్యం హానికరమన్న రఘురామ చెన్నైలోని ఓ ల్యాబ్లో పరీక్షలు చేయించిన వైనం తాజాగా ప్రభుత్వానికి అందిన నివేదిక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై పరువు నష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వంపై రఘురామరాజు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దొరుకుతున్న మద్యంలో హానీకర రసాయనాలున్నాయని ఆరోపించిన రఘురామరాజు ఆ మద్యం శాంపిళ్లను చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్లో పరీక్షలు జరిపించారు. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదిక తాజాగా ప్రభుత్వానికి అందింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో దొరుకుతున్న మద్యంలో ఎలాంటి హానికర రసాయనాలున్నాయని తేల లేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న రఘురామరాజుపై పరువు నష్టం దావా వేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.