Jump to content

Recommended Posts

Posted

Bendapudi Govt School: కాకినాడ జిల్లాలోని బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పేరు మార్మోగిపోతోంది. ఈ పాఠశాల విద్యార్థులు అమెరికన్ స్లాంగ్ ఇంగ్లిష్‌లో అదరగొడుతుండటమే అందుక్కారణం. ఈ విద్యార్థులు ఇంగ్లిష్ అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? టీచర్ ప్రసాద్ వారికి ఎలా నేర్పించారు?

 
samayam-telugu.jpg బెండపూడి విద్యార్థులు
కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాల పేరు కొన్ని రోజులుగా మార్మోగిపోతోంది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటమే అందుక్కారణం. అది కూడా అమెరికా అసెంట్‌లో. మారుమూల గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భాషా నైపుణ్యం వల్ల ఇప్పుడు బెండపూడి పేరు వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దీని వెనుక ఆ పాఠశాల ఉపాధ్యాయుడు జీవీఎస్ ప్రసాద్ కృషి ఉంది. వ్యవసాయం తప్ప అక్షరం ముక్క తెలియని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికా స్లాంగ్‌లో ఇంగ్లిష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు? టీచర్ ప్రసాద్ వారికి ఎలా నేర్పించారు? వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారు బడుల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తోంది. లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం అనే 100 రోజుల వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ.. ఈ మూడు భాషలపై పట్టు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

ప్రభుత్వ కార్యక్రమానికి బెండపూడి హైస్కూల్‌లోని ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు జీవీఎస్‌ ప్రసాద్‌ తన వినూత్న ఆలోచనను జోడించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో ఆన్‌లైన్‌లో డిబేట్లు ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. అమెరికా విద్యార్థులు ఎలా మాట్లాడుతున్నారో గమనించి బెండపూడి పిల్లలు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. ఇది వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. ఏమాత్రం తొణకకుండా ఆంగ్లం అనర్గళంగా మాట్లాడేస్తున్నారు.

చిన్ననాటి కోరిక.. విద్యార్థుల రూపంలో తీర్చుకున్నారు!
ప్రసాద్ మాస్టారుకి అమెరికన్ స్లాంగ్‌లో ఇంగ్లిష్ మాట్లాడాలని చిన్ననాటి నుంచి కోరిక ఉండేదట. కానీ, తన గొంతుకు ఆ స్లాంగ్ సరిపోదని ఆయన గ్రహించారు. దీంతో విద్యార్థులతో ఆ స్లాంగ్‌లో మాట్లాడించడం ద్వారా తన కోరిక తీర్చుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అమెరికన్ ఫొనెటిక్ సౌండ్స్‌లో శిక్షణ ఇస్తూ.. తన ఎన్‌ఆర్ఐ ఫ్రెండ్ సహకారంతో అమెరికాలో విద్యార్థులతో ప్రతి ఆదివారం ఆన్‌లైన్ డిబేట్ ఏర్పాటు చేశారు ప్రసాద్ మాస్టార్.

బెండపూడి పాఠశాలలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్థులు అమెరికన్‌ స్లాంగ్‌లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. అది చూసి పిల్లల తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. టీచర్ ప్రసాద్ పైనా ప్రశంసలు కురిపించారు.

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంటే ఒక రకమైన చులకన భావం ఉంటుంది. గ్రామంలో పాఠశాల అయితే.. ఆ భావన మరింత ఎక్కువ. పుస్తకాల్లో ఉన్నవి చదవడం తప్పితే, ఇంగ్లిష్‌లో సరిగా అర్థం చేసుకోలేరని, మాట్లాడలేరని అనుకుంటారు. కానీ, బెండపూడి పాఠశాల విద్యార్థులు అది నిజం కాదని నిరూపించారు. ఈ విద్యార్థులను చూసి ఇప్పుడు కార్పొరేట్‌ పాఠశాలలు సైతం విస్తుపోతున్నాయి. బెండపూడి విద్యార్థుల ప్రతిభకు, ప్రసాద్ మాస్టార్ కృషికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ.
  • Upvote 1
Posted

Investing in improving teaching standards will always payback…good teachers are an asset to the society..

  • Upvote 1
Posted

This makes me so happy. Kudos to the teacher and kids for having the spirit to learn.

Posted

emdundi earlier they used to say bentapudi in pure telugu..now with slang they are teling bentyapoodi in english style

its like sirio telling congratulations as coooongggrassshyulaaashhhhans ... nee yavva .. 

investing ads last lo vastadi "investingissubjecttoriskpleasereaddocumentsbeforeinvesting" without a gap..atla undi yavvaram

Posted

e prasad master IT field lo unte bagundu

edina kotha job ki apply chesthe pr@xy ki pettukune vadini

  • Haha 1
Posted
12 minutes ago, Acharya said:

Lakshmi manchu training anta brahmi laugh - Imgflip

Atle undhi..

Screenshot_20220310-094818.thumb.jpg.758

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...