Jump to content

Recommended Posts

Posted

 

Posted

Veedu Owaisi gadini rechagodutunnadu. Vaadu noti dhoola tho edo okati thitti Hindus ni BJP vaipu turn ayyela chesthadu. TRS neutral ga undataniki try chesthe andaru Muslim appeasement antaru. Same template works everywhere.

Posted

తాత, తండ్రి, తనయులను ఆశ్రయించి, వారి కపట మాటలకు లొంగిపోయి, వారి చేతుల్లో పావులుగా మారి నాలుగు దశాబ్దాల క్రితం మారుమూల ప్రాంతంలో ప్రారంభమైన క్షుద్ర రాజకీయ విషసంస్కృతి నేడు ఆ పావులనే ఎక్కువగా బలితీసుకుంటుంది. ఈ ఫ్యాక్షన్ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులు, వర్గాలు అమాయకులు అని సరిపెట్టుకుంటే నిజాలు దాచినట్లు. నేటికీ బలైపోతున్న వర్గాలు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పై ద్వేషంతో తమకు జరుగుతున్న నష్టం గురించి ఏమాత్రం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లెటూర్లలో వీరు ఫ్యాక్షన్ కుటుంబ కట్టు బానిసలుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో దాదాపు అందరికీ ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రులు అనే భావన, ఆంధ్ర ఆత్మగౌరవం ఛాయలు మచ్చుకైనా కనపడవు. సుబ్రహ్మణ్యం హత్య నిరసనలో ప్రధానంగా పాల్గొన్నది తెలుగుదేశం, కొందరు దళిత నాయకులే. పాలకపక్షం దళిత నాయకులు ఎలాగూ బయటకు రారు. ఈసారి అసలు మాటవరసకూ సానుభూతి ప్రకటనలు కూడా కరువయ్యాయి. దళితులలో మరో ముఖ్యమైన వర్గం. ఎంతో పేరుప్రఖ్యాతలు గడించిన మేధావులు, రచయితలు, మాజీ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు. వీరు వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎక్కడ తెలుగుదేశం లబ్ధి పొందుతుందో అన్న ఆలోచనతో మౌనవ్రతం పూనారు. డాక్టర్ సుధాకర్ ఉదంతం నుంచి ఇదే తీరు. రాష్ట్రంలో కులసంఘాలు, మత సంఘాలు, కులగజ్జితో సమాజ ఘాతుకులుగా మారిన వారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. మారాలి. 1. రాష్ట్రం అత్యంత గడ్డుపరిస్థితిలో ఉంది. రాష్ట్ర భవిష్యత్తు చుట్టూ ఆలోచనలూ, కార్యాచరణలూ ఉండాలి. 2. ఫ్యాక్షన్ కుటుంబం విషవృక్ష ఛాయల నుంచి దూరం తొలగండి. 3.ఆంధ్రరాష్ట్రం చుట్టూ శత్రువులు మళ్ళీ మోహరిస్తున్నారు. ఐదుకోట్ల ఆంధ్రుల నేలను, భవిష్యత్తునూ పాలెగాళ్ళ చేత నాశనం చేస్తున్నారు. 4. మోది, షా, కేసీఆర్, తెలంగాణ మీడియా, మేధావులు, విశ్లేషకులు మళ్ళీ ఈ దోపిడీ ఫ్యాక్షనిస్ట్ పాలకులనే గెలిపించాలని కుల, మత, ప్రాంతీయ విద్వేషాల రాజకీయాలు, వేలకోట్ల ధనప్రవాహం క్రుమ్మరించడానికి సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. 5.హత్యలు, దాడులు, దోపిడీ దుర్ఘటనలతో కళ్ళు తెరిచి కుల, మత రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇప్పటికైనా రాష్ట్రం పై ధ్యాస మళ్ళిస్తే అట్టడుగున ఉన్నవారికి, బడుగుజీవులకు మేలు కలుగుతుంది. 6.తెరముందు కనపడే కీలుబొమ్మ తుగ్గక్, పీకేల వెనుక ఉన్న హస్తిన నియంత, రజాకార్ దొరలనే సూత్రధారులు ఉన్నారనే నగ్నసత్యం మరచిపోకూడదు.   డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సిబిఐకి అప్పగించాలని కోరుతున్నారు. అదే జరిగితే హంతకులకు శ్రీరామరక్ష  వివేకానంద రెడ్డి హత్య కేసులాగా ఈ కేసు కూడా మలుపులు తిరిగి చతికిలపడిపోతుంది. చివరికి ఎవరో అనామకుడిని ప్రవేశపెడతారు. తమకు నచ్చిన విధంగా తీర్పు వచ్చేట్లు ఆధారాలు, సాక్షులనూ మలచుకుంటారు. ఇక డిల్లీ గడ్డం గ్యాంగ్ ఆంధ్రాపై సమ్మెటపోట్లతో నాశనం చేస్తూ, ఆదాఅంబాలకూ ఆస్తులు కట్టబెడుతూ, కూలినప్పుడు నోట్ల బస్తాల ముడుపులు పంపుతుంటే సిబిఐని తన ఫ్యాక్షన్ దత్తపుత్రుడి కాళ్ళ క్రింద పడి ఉండేలా చేస్తుంది. కాబట్టి డిల్లీలో మోది షాలు ఉన్నంతవరకూ వైసిపి బాధితులకు న్యాయం జరగదు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...