psycopk Posted June 2, 2022 Report Posted June 2, 2022 మోదీతో ముగిసిన జగన్ భేటీ... 45 నిమిషాల పాటు సాగిన సమావేశం 02-06-2022 Thu 17:43 రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ పెండింగ్ అంశాలను ప్రస్తావించిన జగన్ మోదీతో భేటీ అనంతరం నిర్మలతో భేటీకి వెళ్లిన జగన్ రాత్రి 9 గంటల తర్వాత అమిత్ షాతో భేటీకి ఛాన్స్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్... సాయంత్రం 4.30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీని ముగించుకున్న జగన్ అటు నుంచి అటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కోసం వెళ్లారు. నిర్మలతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా, జగన్‌ల భేటీ రాత్రి 9 గంటల తర్వాత జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. Quote
psycopk Posted June 2, 2022 Author Report Posted June 2, 2022 ప్రజలు బలం ఇచ్చినా ఉపయోగం లేదు... జగన్ కేంద్రానికి బానిసలా మారాడు: సీపీఐ నారాయణ 02-06-2022 Thu 21:32 ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలా ఉందన్న నారాయణ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలంతో పనిపడిందని వ్యాఖ్య ప్రజలు ఇచ్చిన బలాన్ని సద్వినియోగపర్చుకోవాలని హితవు ఏపీ రాజకీయ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. జగన్ సర్కారు పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇంట్లో ఈగలమోత బయట పల్లకీల మోతలా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రజలు ఇచ్చిన బలం ఉపయోగం లేకుండా పోయిందని, కేంద్రానికి జగన్ బానిసలా మారాడని నారాయణ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబంలా నిలిచారని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలంతో పనిపడిందని, ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రం నుంచి సాధించుకోవాలని నారాయణ ఏపీ సర్కారుకు హితవు పలికారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.