MRI Posted July 9, 2022 Report Posted July 9, 2022 scene ki speed avasaram.. musalodu joints weak ani clear ga telustundi.. daniki elevation try chesaaru.. lol Quote
Telugumoviereviews Posted August 26, 2022 Report Posted August 26, 2022 నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ది ఘోస్ట్'. 'పిఎస్‌వి గరుడ వేగ' తర్వాత ప్రవీణ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకి ఇంకా ఆరు వారాలు ఉండగానే తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. 'ది ఘోస్ట్' ట్రైలర్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ట్రైలర్. తన సోదరిని, ఆమె కూతురుని చంపాలని చూస్తున్న అండర్ వరల్డ్ ని నాగ్ ఎలా ఎదిరించాడు? చివరికి వాళ్ళని రక్షించగలిగాడా? వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ను రూపొందించారు. For more information visit Teluguone.com official website Click here to get more details about Nagarjuna's The Ghost Movie Quote
Telugumoviereviews Posted September 24, 2022 Report Posted September 24, 2022 అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ది ఘోస్ట్'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకలో తండ్రీకొడుకులు ఒకే వేదికైన కనిపించనుండటం విశేషం. 'ది ఘోస్ట్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న సాయంత్రం కర్నూల్ లోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున తనయులు యువ హీరోలు నాగ చైతన్య, అఖిల్ హాజరు కాబోతున్నారు. ఇటీవల ఇద్దరిద్దరుగా వేదికను పంచుకున్నారు గాని తండ్రీకొడుకులు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులైంది. ఈ ముగ్గురినీ ఒకే వేదికపై చూసుకోవడం అక్కినేని అభిమానులకు కన్నులపండుగ అని చెప్పొచ్చు. For more information visit Teluguone.com official website Click here to get more details about Nagarjuna's The Ghost movie updates Quote
Telugumoviereviews Posted September 26, 2022 Report Posted September 26, 2022 ముప్పై మూడు సంవత్సరాల క్రితం 'శివ'గా చైన్ పట్టుకొని, ప్రత్యర్థులను చితగ్గొట్టిన నాగార్జునకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అదే తేదీన 'ది ఘోస్ట్'గా కత్తి పట్టుకొని దుష్టులను తెగనరకడానికి వస్తున్నారు నాగార్జున. యస్.. 1989 అక్టోబర్ 5న 'శివ' వస్తే, 2022 అక్టోబర్ 5న 'ది ఘోస్ట్' వస్తోంది! ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మించారు. ఆదివారం రాత్రి కర్నూలులో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో నాగ్ మాట్లాడుతూ, "33 ఏళ్ల క్రితం అక్టోబర్ 4న 'శివ' అనే ఫ్యామిలీ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పుడు చైన్ పట్టుకొని వచ్చాను. ఇప్పుడు అదే అక్టోబర్ 5న కత్తి పట్టుకొని వస్తున్నా. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో నాగచైతన్యతో కలిసి వచ్చిన 'బంగార్రాజు' మూవీ థియేటర్లలో హిట్టవడమే కాకుండా, ఓటీటీ, టీవీలో రికార్డులు సృష్టించిందన్నారు నాగ్. దానికి లభించిన ఆదరణ మరే మూవీకీ ఈ ఏడాది రాలేదన్నారు. త్వరలో అఖిల్‌తో కలిసి నటించబోతున్నానని వెల్లడించారు. "నాకెంతో ఆత్మీయులైన చిరంజీవి గారి సినిమా కూడా విజయదశమికి విడుదలవుతోంది. మా రెండు సినిమాలకీ విజయం దక్కాలని కోరుకుంటున్నా" అని ఆయన చెప్పారు. For more information visit Teluguone.com official website Click here to get more details about Nagarjuna's The Ghost movie updates Quote
JANASENA Posted September 26, 2022 Report Posted September 26, 2022 Director Praveen S akkada, Popularity zero levels ki touch aina Rajasekhar ni teesukochi hit kottadu ee movie kooda baganeundi trailer but looks like a routine story. Action is good. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.