anna_vendy Posted July 11, 2022 Report Posted July 11, 2022 12 గంటలకు పైగా కరెంటు ఉండదు . పెట్రోల్ డీజిల్ దొరకవు . గాస్ దొరకదు . ఆహార పదార్థాలు ధరలు మూడు నాలుగు రెట్లు అవుతాయి . డబ్బు పెట్టినా కొన్ని వస్తువులు దొరకవు . శ్రీలంక గురించి చెబుతున్నాను అనుకొంటున్నారా ? మొదలయింది అక్కడే కానీ .. ఈ పరిస్థితి ఇప్పుడు పాకిస్థాన్ , టర్కీ .... ఇలా ఒక్కో దేశాన్ని చుట్టేస్తోంది . అమెరికా లో గాలన్ పెట్రోల్ ధర ఆరేడు డాలర్ లకు చేరుకొంది . జర్మనీ లో గాస్ దొరకని స్థితి . ప్రపంచానికి నేడు ముప్పు కరోనా కాదు . ద్రవ్యోల్భణం .. ఆర్థిక సంక్షోభం . మొదటి ప్రపంచ యుద్ధం .. అది ముగియక ముందే స్పానిష్ ఫ్లూ .. సరిగ్గా వందేళ్ల క్రితం ఇలాగ జరిగింది . అమెరికా యూరోప్ దేశాల్లో మొదలయిన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టేసింది . ఆర్థిక మాంద్యం నుంచి కోలుకోవడానికి సుమారుగా పదేళ్లు పట్టింది . ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ న్యూ డీల్ తో ముందుగా అమెరికా ను ఆర్థిక మాంద్యం నుంచి గట్టెకించాడు . నెమ్మదిగా ప్రపంచం కోలుకొంది. ఇప్పుడు దాదాపుగా అదే స్థితి . ప్రపంచం లో అనేక దేశాల్లో ఏక వ్యక్తి పరిపాలన .. పేరుకే ప్రజాస్వామ్యం . రష్యా అధ్యక్షడు పుతిన్ నియంత కాదా ? స్టాలిన్ కు ఏమి తీసిపోయాడు ? శ్రీలంక స్థితి ని చూస్తున్నముగా . కరోనా .. లాక్ డౌన్ .. అటు పై రష్యా యుక్రెయిన్ యుద్ధం . ప్రపంచం మరో ఆర్థిక మాంద్యం ముందు నిల్చినట్టే కనిపిస్తోంది . రూస్వెల్ట్ లేదు లేడు. ఎనబై ఏళ్ళ వయసులో మతిమరుపుతో సతమతమవుతూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తంటాలు పడే జో బిడెన్ ఉన్నాడు. శ్రీలంక లో బ్రిటన్ లో పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభాలు . కుప్పకూలుతున్న ప్రభుత్వాలు . గడ్డు రోజులు వస్తున్నాయనిపిస్తోంది . మిద్దెలు మేడలు షేర్ సర్టిఫికెట్ లు కూడు పెట్టవు. చేతిలో కాస్త లిక్విడ్ కాష్ పెట్టుకోండి .పొదుపు నేర్చుకోండి . పని సంస్కృతికి అలవాటు పడండి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.