southyx Posted August 24, 2022 Report Posted August 24, 2022 అచ్చ తెలుగు రూపం.. హుందాతనానికి ప్రతిరూపం.. మాటల్లో స్పష్టత.. చేతల్లో కచ్చితత్వం.. ప్రజాహిత కాంక్ష.. సత్వర న్యాయ ఆకాంక్ష.. వాస్తవికవాది.. మధ్యవర్తిత్వ అభిలాషి.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురించి తలచుకున్న వెంటనే గుర్తుకొచ్చే కొన్ని లక్షణాలివి. 48వ సీజేఐగా గత ఏడాది ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టిన ఆయన.. 16 నెలల పదవీకాలంలో జనహితమే ధ్యేయంగా పలు కీలక తీర్పులు, ఉత్తర్వులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు న్యాయం వేగంగా అందేలా న్యాయమూర్తుల నియామకాలను జోరుగా చేపట్టారు. సీజేఐగా ఆయన పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన చేసిన విశేష కృషిపై ప్రత్యేక కథనం.. భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో తెలుగు తేజంగా చరిత్ర పుటల్లో స్థానం దక్కించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ.. తనపై ప్రజల అంచనాలను అందుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. న్యాయ వ్యవస్థను వేధిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలూ సూచించారు. తన పరిధిలోని అంశాలను వేగంగా పరిష్కరించి చూపి.. భావి సీజేఐలకు మార్గదర్శిగా మారారు! సంస్కరణలకు నడుం బిగించి.. ‘‘అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులు ఏటా సగటున 81 కేసులను పరిష్కరిస్తుంటే.. భారత్‌లో న్యాయమూర్తులు ఏటా సగటున 2,600 కేసుల్లో తీర్పు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన జడ్జీలు ఇక్కడి పనితీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఒత్తిడి వాతావరణంలో ఎలా పనిచేస్తున్నారని అడుగుతున్నారు. మా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం కాబట్టే ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచుతున్నారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపు గురించి ఎన్నిచోట్ల ఎంతమంది మాట్లాడినా.. పురోగతి శూన్యం’’ 2016 ఏప్రిల్ 24న విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అప్పటి సీజేఐ జస్టిస్ టి.ఎస్.ఠాకుర్ చేసిన వ్యాఖ్యలివి. న్యాయమూర్తులపై పనిభారం ఎంతగా ఉందో వివరిస్తూ నాటి సమావేశంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు, సహచర న్యాయమూర్తుల ముందే ఆయన కన్నీరుపెట్టుకోవడం సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆ సమావేశంలో పాల్గొన్న జస్టిస్ రమణ.. జస్టిస్ ఠాకుర్ ఆవేదనను కళ్లారా చూశారు. కక్షిదారులకు సకాలంలో న్యాయం అందకపోవడానికి, న్యాయమూర్తులపై పనిభారం విపరీతంగా పెరిగిపోతుండటానికి.. ఖాళీలు, మౌలికవసతుల కొరతే ప్రధాన కారణమని ఆయనకు ముందునుంచీ తెలుసు. అందుకే తాను సీజేఐ పీఠమెక్కాక ఆ రెండు అంశాలపై బాగా దృష్టిసారించారు. వ్యవస్థను సంస్కరించేందుకు నడుం బిగించారు. జోరుగా నియామకాలు జస్టిస్ రమణ సీజేఐ పీఠమెక్కాక ఇప్పటివరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మందికిపైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఖాళీల భర్తీ విషయంలో జస్టిస్ రమణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆయన నేతృత్వంలో కొలీజియం.. ఖాళీల భర్తీలో సామాజిక, లింగ సమతౌల్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులకు అవకాశం కల్పించింది. వారిలో ఒకరు 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు బాటలు వేసింది. జనంతో మమేకం ఇంతకుముందు పనిచేసిన సీజేఐలతో పోలిస్తే జస్టిస్ రమణ సుప్రీంకోర్టు తలుపులను ప్రజలకు మరింత బార్లా తెరిచారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ప్రజల మనసులను తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. తనకు వచ్చే ఉత్తరాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసేందుకు కృషిచేశారు. హక్కులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే.. వారే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారన్న నమ్మకంతో ప్రజాచైతన్యానికి ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షప్రసారం చేయడం, కోర్టుల్లో రోజువారీ విచారణలను పాత్రికేయులకు అందుబాటులో ఉంచడం కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటుచేయడం, కొత్తగా నిర్మించిన ఛాంబర్లను న్యాయవాదులకు కేటాయించడం, సుప్రీంకోర్టు ఆడిటోరియాన్ని బార్ అసోసియేషన్ సభ్యులు వాడుకునేందుకు అవకాశం కల్పించడం.. ఎన్నాళ్లనుంచో పెండింగులో ఉన్న ఈ పనులన్నీ జస్టిస్ రమణ చొరవ వల్లే ఫలించాయి. ఈ చర్యల ద్వారా వ్యవస్థను అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేశారాయన. సాంకేతికతను అందిపుచ్చుకొని.. కరోనా ప్రభావం కారణంగా కోర్టులు భౌతికంగా నడవలేని పరిస్థితులు చాన్నాళ్లు నెలకొన్నప్పటికీ జస్టిస్ రమణ నీరుగారిపోలేదు. సాంకేతికతను అందిపుచ్చుకొని వ్యవస్థను ముందుకు నడిపించారు. గత 16 నెలల్లో కేవలం 55 రోజులే కోర్టులు భౌతికంగా నడిచే పరిస్థితులు నెలకొనడం.. గత ఏడాది కాలంలో కేసుల కొండ పెరిగిపోవడానికి కారణమైందని ఆయన ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. కేసుల పరిష్కారంపై ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం సహజమేనని, దురదృష్టవశాత్తు పరిస్థితులు సహకరించకపోవడంతో వారి ఆశలను పూర్తిస్థాయిలో సాకారం చేయడం సాధ్యం కాలేదని చెప్పారు. జస్టిస్ రమణ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మధ్య తరగతివారి కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే సత్వర న్యాయం అందించడం ద్వారా వారిని ఆదుకోవాలని తపించారు. అందుకోసం మధ్య వర్తిత్వాన్ని ఎంచుకోవాలని పదేపదే చెబుతూ.. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికల వైపు కూడా ప్రజలను మళ్లించే ప్రయత్నం చేశారు. జస్టిస్ రమణ చొరవతో వెలువడిన కొన్ని కీలక ఉత్తర్వులివీ.. * దేశాన్ని కుదిపేసిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలన్న సంకల్పం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపించింది. * రాజద్రోహ సెక్షన్‌ను ప్రభుత్వాలు సామాన్యులపై ఇష్టారీతిన ప్రయోగించకుండా గత మే నెలలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘సెక్షన్ 124ఎ’ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించేంతవరకూ దానికింద ఎఫ్‌ఆఐర్‌లు నమోదు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని అందులో ఆదేశించారు. దానికింద పెట్టిన కేసుల కారణంగా జైళ్లలో మగ్గుతున్నవారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. సెక్షన్ 124ఎ కింద పెండింగ్‌లో ఉన్న విచారణలు, అప్పీళ్లు, నమోదుచేసిన అభియోగాలన్నింటినీ నిలిపివేయడం ద్వారా ప్రజల స్వేచ్ఛకు పట్టం కట్టారు. * కోర్టులు బెయిలు మంజూరు చేసినా.. ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో తాత్సారాన్ని నివారించడానికి ‘ఫాస్టర్’ పేరుతో సురక్షితమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి దీర్ఘకాల సమస్యకు తెరదించారు. * కఠినమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టయిన ఓ కేరళ పాత్రికేయుడికి దిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్ రమణ ఆదేశించారు. విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. * ఝార్ఖండ్‌లో ధన్‌బాధ్ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని సీబీఐ దర్యాప్తునకు సీజేఐ జస్టిస్ రమణ ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడినవారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. తద్వారా న్యాయవ్యవస్థలోని వ్యక్తుల్లో ధైర్యం నింపారు. * శివసేన చీలిక కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించి.. న్యాయం చేయడంలో పొరపాట్లను పరిహరించేందుకు ప్రయత్నించారు. * కరోనా సమయంలో జస్టిస్ రమణ ఓ కేసును సుమోటోగా తీసుకొని ఆక్సిజన్ సరఫరా, టీకా ధరల విషయంలో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని 18 ఏళ్ల వయసు దాటినవారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ను ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో కోర్టు జోక్యాన్ని మెచ్చుకుంటూ కేరళకు చెందిన లిడ్వినా జోసెఫ్ అనే 5వ తరగతి బాలిక సీజేఐకి లేఖ రాయడం.. ఆయన హయాంలో సామాన్యులపై సుప్రీంకోర్టు పనితీరు చూపిన ప్రభావానికి అద్దంపట్టింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వైష్ణవి అనే 8వ తరగతి అమ్మాయి తమ ఊరికి బస్సు కోసం సీజేఐ జస్టిస్ రమణకు లేఖ రాయడం కూడా ఆయన పనితీరు సామాన్యుల్లోకి వెళ్లిందని చెప్పేందుకు నిదర్శనం. విస్తృతంగా మౌలిక వసతులు జస్టిస్ రమణ న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు బాగా ప్రాధాన్యమిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో రూ.310 కోట్లతో కొత్త కోర్టు భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. తెలంగాణలో 32 జిల్లా కోర్టులను ప్రారంభించారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో రూ.100 కోట్లతో నిర్మించిన కొత్త కోర్టు సముదాయాన్ని ప్రారంభించారు. ఝార్ఖండ్‌లో రెండు జిల్లాల్లో సబ్‌డివిజన్ కోర్టులను ప్రారంభించారు. ఇవన్నీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయన చేసిన కృషికి కొన్ని ఉదాహరణలే. తెలుగు రాష్ట్రాలకు సహకారం జస్టిస్ రమణ తెలుగు రాష్ట్రాలకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ఏర్పాటుచేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు మించి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ సంఖ్య అక్కడే నిలిచిపోయినట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజూ ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడైంది. సామాన్యుల్లో ధైర్యం నింపాలని.. న్యాయవ్యవస్థను భారతీయీకరించాలన్న వాదనను జస్టిస్ రమణ ప్రతి వేదికపై వినిపిస్తూ వచ్చారు. ప్రజలు, న్యాయవ్యవస్థ మధ్య బంధాన్ని బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశం. భారతీయ న్యాయవ్యవస్థలో నియమ నిబంధనలను సంస్కరించి, మౌలికవసతులను మెరుగుపరిచి, భాషాపరమైన అడ్డంకులతో సహా అన్ని రకాల అవాంతరాలను తొలగించి, సామాన్యుడు ధైర్యంగా కోర్టును ఆశ్రయించే వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆయన కలలు కన్నారు. జట్టు మనిషి జస్టిస్ రమణ ఏకవ్యక్తిస్వామ్యంలా కాకుండా.. సహచర న్యాయమూర్తులతో కలిసి బృందంగా పనిచేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటుచేసిన ఓ సన్మాన కార్యక్రమంలో కొందరు వక్తలు ఆయన్ను సచిన్ తెందుల్కర్‌తో పోల్చినప్పుడు.. ఆ పొగడ్తను జస్టిస్ రమణ సున్నితంగా తిరస్కరించారు. తాను బృందానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ.. అందులో ఒక సభ్యుడినేనని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో సాధించిన ఘనత కొలీజియం సభ్యులందరికీ దక్కుతుందని సవినయంగా చెప్పుకొచ్చారు. ప్రజాహితమే అభిమతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటనపై అందిన లేఖను జస్టిస్ ఎన్.వి.రమణ పరిగణనలోకి తీసుకొని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. తద్వారా సామాన్యుల ప్రాణాలకు సుప్రీంకోర్టు ఇస్తున్న ప్రాధాన్యం గురించి చాటిచెప్పారు. 1 Quote
Picheshwar Posted August 24, 2022 Report Posted August 24, 2022 4 hours ago, bhaigan said: He is BJP stooge He silently indirectly favored BJP a lot evadu kado cheppu Quote
Lovecrusader Posted August 25, 2022 Report Posted August 25, 2022 ramana is one of best judge ....telugu bidda article 370,UAPA,economic based reservations,CAA meeda negative judgements ivaledhu , thats how he should be , delay and make it legal..... adhe commie judges unte epatiki konni govt decisions ni kottesavallu @ARYA lawdalo saurav das lite tisko ......commie gadu aboo @Raven_Rayes gadiki corruption gurthochindi .... Quote
bhaigan Posted August 25, 2022 Report Posted August 25, 2022 5 hours ago, southyx said: Sodhi entra babu. Konchem aina reading comprehension lenattundhi neeku. Nenem claim chesanu. All I said was he is not a BJP stooge like you wanted to potray and neeku clear example kooda icchanu. Moham eda pettukovalo theliyaka cover chesukuntunnav. Persona ga velthunnav. Kastam ila ithe. He is BJP stooge. I appreciate him being non controversial I am also giving example He transferred madras high court chief justice to meghalaya who was giving controversial judgements on elections commissions of India https://timesofindia.indiatimes.com/city/chennai/10-months-into-his-tenure-cj-of-madras-hc-shifted-to-meghalaya/articleshow/87614423.cms acoording to you he is kadigina muthyam pandaga chesuko telugu valu telugu valu ani podugukovadam tappa peekindi em ledu Quote
southyx Posted August 25, 2022 Report Posted August 25, 2022 4 hours ago, bhaigan said: He is BJP stooge. I appreciate him being non controversial I am also giving example He transferred madras high court chief justice to meghalaya who was giving controversial judgements on elections commissions of India https://timesofindia.indiatimes.com/city/chennai/10-months-into-his-tenure-cj-of-madras-hc-shifted-to-meghalaya/articleshow/87614423.cms acoording to you he is kadigina muthyam pandaga chesuko telugu valu telugu valu ani podugukovadam tappa peekindi em ledu Same sollu trasnfer post okati pattukoni adhe thippi thippi vesthunnav. Dhaaniki kooda neeku reply iccha paina. Selective blindness unattundhi neeku. Evan AP Judge Maheswari ni kooda transfer chesaru to north-eastern state ani cheppanu. Now he is in the SC. 1 Quote
southyx Posted August 25, 2022 Report Posted August 25, 2022 @bhaigan Edho Chennai judge trasnfer chooyinchi BJP stooge antunnav. Cheif Justice Maheswarini AP nundi Sikkim ki transfer chesaru. Mari YRSCP stooge ani endhuku anadam ledhu nuvvu? Appatlo YCP fans maa anna power andhuke Sikkim ki transfer chesaru ani social media lo recchipoyaru. 1 Quote
southyx Posted August 26, 2022 Report Posted August 26, 2022 సీజేఐగా విజయానికి దిల్లీ హైకోర్టు పునాది ఆ 8 నెలలు అత్యుత్తమ కాలం న్యాయమూర్తులకు ఇక్కడ ఇచ్చినంత మర్యాద ఎక్కడా ఇవ్వలేదు బార్ అసోసియేషన్ వీడ్కోలు సభలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేడు పదవీ విరమణ: నూతన సీజేఐగా జస్టిస్ లలిత్ ఈనాడు, దిల్లీ: తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇదివరకు దిల్లీ హైకోర్టులో పనిచేసిన 8 నెలల కాలం ఎంతో ఉపయోగపడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఆ సమయం తనకు శిక్షణ కాలంగా ఉపయోగపడిందన్నారు. శుక్రవారం పదవీ విరమణ చేయబోతున్న తన గౌరవార్థం దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్యోపన్యాసం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలాన్ని నా జీవితంలో అత్యుత్తమమైనదిగా భావిస్తాను. 13 ఏళ్లు ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు ఉత్కంఠ, ఒత్తిడి, ఇతర పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఇక్కడ యువ న్యాయవాదులు ఎంతో కసరత్తు చేసి వచ్చేవారు. వాయిదాలు కోరకుండా వాదనలు వినిపించేవారు. వారి పక్కనే క్లయింట్లు నిల్చొని తమ న్యాయవాదులు సరిగా వాదిస్తున్నారా? లేదా? అని చూసేవారు. న్యాయమూర్తులకు ఇక్కడ ఇచ్చినంత మర్యాద ఎక్కడా ఇవ్వలేదు. ఇక్కడి న్యాయవాదులు ఎంతో క్రమశిక్షణతో ప్రవర్తిస్తారన్న విషయాన్ని నేను ప్రతిచోటా చెబుతాను’’ అన్నారు. విశిష్టమైనది దిల్లీ హైకోర్టు ‘‘దేశ రాజధానిలో ఉండటంవల్ల విభిన్న కేసులు దిల్లీ హైకోర్టుకు వస్తుంటాయి. ఈ హైకోర్టుకు విశిష్ట లక్షణాలున్నాయి. వేరే కోర్టులతో దీన్ని పోల్చి చూడలేం. మిగతాచోట్ల న్యాయమూర్తులు సాధారణంగా సాయంత్రం 4 గంటలకు వెళ్లిపోయేవారు. కానీ ఇక్కడ మాత్రం రాత్రి 7-8 గంటల వరకు పనిచేసే సంస్కృతి ఉంది. న్యాయ పరిపాలన అన్నది చాలా సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వారికి ఇదో పెద్ద సవాల్. రిజిస్ట్రీ పరిపాలన, కేసుల లిస్టింగ్, రోస్టర్ తయారీ, కేసుల కేటాయింపు విషయాలను ఇక్కడే నేర్చుకున్నాను. నాకు దిల్లీ హైకోర్టు శిక్షణ కేంద్రంగా ఉపయోగపడింది. ఆ సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు దిల్లీ బార్ అసోసియేషన్‌లోని ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. మీరే నా నిజమైన శ్రేయోభిలాషులు. ఇంతమంది మద్దతు సంపాదించుకున్నందుకు ఎంతో సంతోషించడంతోపాటు గర్వపడుతున్నా. కలిమి జలాక్షరాలు... చెలిమి శిలాక్షరాలు కలిమి జలాక్షరాలు... చెలిమి శిలాక్షరాలు అని తెలుగులో ఒక సామెత ఉంది. సంపద.. నీటిపై అక్షరాలు రాయడం లాంటిదైతే స్నేహం.. రాతిపై చెక్కే శాసనంలా శాశ్వతమైనదని దానర్థం. ఈ బార్‌తో ఉన్న మైత్రి నా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రధాన న్యాయమూర్తిగా నా శక్తివంచన లేకుండా పనిచేశాను. మౌలిక వసతుల కల్పన, న్యాయమూర్తుల నియామకంపైనే ప్రధానంగా దృష్టి సారించాను. హైకోర్టులకు 224 మందిని జడ్జీలుగా నియమించేలా చూశాం. ఒకటి రెండు పేర్లు తప్ప కొలీజియం ద్వారా మేం సిఫార్సు చేసిన అన్నింటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మిగిలిపోయిన ఆ పేర్లనూ ఆమోదిస్తుందని ఆశిస్తున్నాను. ఒకటి రెండేళ్లు దిల్లీలోనే ఉంటా కనీసం మరో ఒకటి రెండేళ్లు దిల్లీలోనే ఉంటాను. మీకు సమయం ఉన్నప్పుడు వచ్చి విభిన్న అంశాలపై చర్చించవచ్చు. నా అనుభవాలు మీ అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ హిమాకొహ్లి పాల్గొన్నారు. నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ యు.యు.లలిత్ శనివారం రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణం చేయనున్నారు. 1 Quote
southyx Posted August 26, 2022 Report Posted August 26, 2022 SC: సుప్రీంలో కీలక ముందడుగు.. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ వేళ.. న్యాయవాదుల భావోద్వేగం దిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే క్రమంలో కీలక ముందడుగు పడింది. కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ ధర్మాసనం విచారణ ప్రత్యక్ష ప్రసారానికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఈ రోజు ఆయన పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో.. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు. ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చేఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు సుప్రీం కోర్టు తిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునః పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది. ఈ ఉచిత హామీల అమలు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ఇదంతా ప్రత్యక్ష ప్రసారమైంది. కాగా, ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రస్తుతం ఈ కేసు నాలుగు వారాలకు వాయిదాపడింది. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని మునుపటి విచారణలో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. Quote
southyx Posted August 26, 2022 Report Posted August 26, 2022 In the above video Dushyant Dave literal ga edusthunnadu. Idhe seneior lawyer chala cases lo odipoyadu NV Ramana CJI tenure lo, or NV Ramana judgment icchina cases lo. https://www.ndtv.com/india-news/senior-lawyer-dushyant-dave-breaks-into-tears-as-he-bids-adieu-to-chief-justice-of-india-nv-ramana-3288306 https://indianexpress.com/article/india/senior-advocate-dushyant-dave-breaks-down-tears-cji-ramana-retirement-8113038/ Quote
southyx Posted August 26, 2022 Report Posted August 26, 2022 This is for our @bhaigan Dushyant Dave general Govt Vs people issues lo anti-Govt cases theesukuntuntaadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.