hyperbole Posted September 4, 2022 Report Posted September 4, 2022 కేసు వివరాలను ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీతారాం శనివారం సరూర్‌నగర్ ఠాణాలో విలేకర్లకు వివరించారు... సరూర్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలో భాజపా నేత లంకా లక్ష్మీనారాయణకు, గడ్డిఅన్నారం డివిజన్ భాజపా కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డికి మధ్య రాజకీయంగా విభేదాలున్నాయి. మరోవైపు తమ బంధువర్గంలోని ఒక వివాహితతో లక్ష్మీనారాయణ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భాజపా కార్యకర్త శ్రవణ్ సైతం ఆయనపై కోపంగా ఉన్నాడు. శ్రవణ్, ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి కలిసి లక్ష్మీనారాయణను కిడ్నాప్ చేసేందుకు గురువారం కుట్ర పన్నారు. లక్ష్మీనారాయణకు, అతని సోదరుడు లంకా మురళి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి దగ్గరకు వచ్చిన మురళి కుట్రలో భాగస్వామి అయ్యాడు. పథకం అమలుకు మహేశ్వర్‌రెడ్డి భాజపా సానుభూతిపరుడు, సచివాలయంలో పొరుగుసేవల ఉద్యోగిగా పనిచేస్తున్న పునీత్ తివారీని సంప్రదించాడు. ఈనెల ఒకటిన పునీత్ వనస్థలిపురంలో ఉండే విద్యార్థి పాతబోయిన మంజునాథ్(24), ప్రైవేటు ఉద్యోగి పాలపర్తి రవి(38), విద్యార్థులు కందల పవన్‌కుమార్‌రెడ్డి(24), రవల హేమంత్(23), కార్ వాషింగ్ సెంటర్ నిర్వాహకుడు రేవళ్లి చంద్రకాంత్(24), ఉద్యోగి బలివాడ ప్రణీత్(25), కుంభగిరి కార్తీక్(25), చికెన్ సెంటర్ నిర్వాహకుడు రవి వర్మ(24), మహేశ్, మారుతి, సాయి కిరణ్‌తో కలిసి పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో 2 కార్లలో లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. ఆయన నిద్రిస్తుండడంతో, గణేశ్ మండపం వద్ద ఉన్న ఆయన రెండో కుమారుడు సుబ్రహ్మణ్యంను అపహరించారు. నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గరకు తీసుకెళ్లారు. full story: https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122168504 Quote
id_ego_superego Posted September 4, 2022 Report Posted September 4, 2022 Nara bali ani NTV lo esaru deentlo political angle kooda vunda? Quote
Android_Halwa Posted September 4, 2022 Report Posted September 4, 2022 Nothing as such…This is about 2200 sq yards property dispute. Bediriyanika kidnap chesi teesukapoinaru..Accused is son of ex-gaddiannaram municipal chairman, Baddam balreddy thammudu koduku eedu…monne first time corporator avataram ethindu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.