Jump to content

Poor farmers rest in peace


Recommended Posts

Posted

*చిత్తూరు జిల్లా (గంగాధర నెల్లూరు)*

_*భూమి కోసం రైతు పోరాటం.. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆగిన గుండె*_

*ప్రభుత్వం ఇచ్చిన తన భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని.. ఇప్పుడు అందులోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అధికారులకు చెప్పడానికి వచ్చిన ఆ రైతు అక్కడే ప్రాణాలు విడిచాడు.*

*- న్యాయం కోసం పోరాడుతూ ప్రభుత్వ కార్యాలయంలోనే ప్రాణాలు వదిలాడు.*

★ భూమి కోసం ఓ రైతు ప్రాణాలొదిలిన ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది. 

★ పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజాఇండ్లు గ్రామానికి చెందిన రత్నం (55) అనే రైతుకు సర్వే నెంబర్‌ 918/4లోని భూమికి 1974లో లీజు పట్టా ఇచ్చారు. 

★ రైతుకు భూమి చెందకూడదనే ఉద్దేశంతో తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

★ ఈ విషయంపై రత్నం.. 2009లో చిత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆ భూమి అతనిదేనని న్యాయస్థానం పర్మినెంట్‌ ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది.

★ ఆ తర్వాత తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

★ ఇటీవల రత్నానికి చెందిన భూమిలో కొందరు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. 

★ ఈ విషయంలోనూ రత్నం కోర్టుకు వెళ్లారు. 

★ నాలుగు రోజుల క్రితం మిగిలిన భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. 

★ వీఆర్వో వెళ్లి పనులు చేయకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

★ ఈ విషయంపై అదేరోజు రత్నం తహసీల్దార్‌ రమణిని కలిసి సమస్య వివరించారు. 

★ అక్కడే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధితో రత్నానికి గొడవ జరిగింది. 

★ దీంతో మనస్తాపం చెందిన రైతు అనారోగ్యం పాలయ్యాడు. 

★ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుట పడిన తర్వాత శుక్రవారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టాడు.

★ ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలాడు. 

★ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

★ విషయం తెలుసుకున్న మృతుడి కుమారులు, కుమార్తె తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. 

★ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ నాయకుల అండతో తమ తండ్రిని హత్య చేసి ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు.

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...