dasari4kntr Posted September 4, 2022 Report Posted September 4, 2022 రాతి యుగంలో మనుషులు ఎలా మాట్లాడుకునేవారు? పేర్లు, వేర్వేరు తెగలు, భాషలు ఉండేవా? మార్క్ పేగెల్ బీబీసీ కోసం 5 గంటలు క్రితం ఫొటో సోర్స్, GETTY IMAGES రాతి యుగం సుమారు 30 లక్షల ఏళ్ల కిందటి నుంచి 40,000 ఏళ్ల క్రితం వరకు కొనసాగి ఉండవచ్చు. ఆ యుగంలోని మన పూర్వీకులు ఉపయోగించిన తొలి పరికరాలను రాతితో తయారు చేసుకుని వినియోగించడం వల్ల ఆ కాలానికి రాతి యుగమనే పేరొచ్చింది. రాతి యుగం మొదలైన చాలా కాలం తర్వాత, అంటే సుమారు 2,00,000 సంవత్సరాల క్రితం మన లాంటి మనుషులు, హోమో సేపియన్‌లు కనిపించడం మొదలుపెట్టారు. నరజాతిగా పరిణామం చెందుతున్న దశలో రకరకాల వానర జాతులు పెద్ద పెద్ద రాళ్ళ నుంచి పదునైన రాళ్లను కొట్టి సరళమైన పరికరాలను చేసుకోవడం మొదలుపెట్టిన కాలంలో రాతి యుగం మొదలైందని చెప్పొచ్చు. ఈ వానరాలు కాస్త వంగి నడిచేవి. కానీ, వీటి చేతులు మాత్రం పరికరాలు రూపొందించేందుకు వీలుగా ఉండేవి. ఈ తొలి దశలో ఉన్న వానరాలకు చింపాంజీల మాదిరిగా కాకుండా చిన్న మెదడు ఉండేది. వీళ్ళు మాట్లాడేవారు కాదు. రాతి యుగం తర్వాతి దశలో నిటారుగా నడిచే వానరాలు పుట్టుకొచ్చాయి. వీటిని హోమోహబిలీస్, హోమోఎరక్టస్ అనే పేర్లతో పిలిచేవారు. మనలాంటి మనుషుల రాకకు ముందు ఈ జాతులు ఆఫ్రికాలో సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల సంవత్సరాల క్రితం ఉండేవి. వీటికి అంతకు ముందు వంగి నడిచే వానరాల మెదడు కంటే కూడా కాస్త పెద్ద మెదడు ఉండేది. కానీ, మానవుల మెదడు కంటే కాస్త చిన్నవే ఉండేవి. మనుషులకున్నన్ని తెలివితేటలు వీటికి ఉండేవి కావు. ఇవి కూడా మాట్లాడేవి కాదు. కానీ, కొన్ని రకాల శబ్దాలు చేసేవి. సుమారు 400,000 ఏళ్ల క్రితం పెద్ద మెదడు ఉన్న మూడు రకాల జాతులు మనుగడలో ఉండేవి. వీరే నియాండర్తల్స్, డెనీసోవన్స్ , తొలి దశ హోమోసేపియన్లు. సిసిలీ సాగర తీరంలో బయటపడ్డ శిథిలనౌకల కంచు ముక్కులు చెప్తున్న ప్రాచీన చరిత్ర ఏమిటి? సాగర గర్భాల్లో ఐదు అద్భుత నగరాలు ఫొటో సోర్స్, GETTY IMAGES నియాండర్తల్స్, డెనీసోవన్స్ ఆఫ్రికాకు అవతల యూరేషియాలో ఉండేవారు. డెనీసోవన్స్ గురించి పెద్దగా సమాచారం లేదు. కానీ, సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం నియాండర్తల్స్ రాతి పరికరాలతో పాటు చెక్కతో చేసిన బాణాలు, లేడి లాంటి జంతువుల ఎముకలతో చేసిన చిన్న చిన్న పరికరాలను వాడేవారు. వీళ్ళకుండే పెద్ద మెదడు వల్ల రాతితో పాటు ఇతర పదార్ధాలతో కూడా పరికరాలను తయారు చేసి ఉంటారని కొంత మంది భావిస్తారు. నియాండర్తల్స్ మాట్లాడగలిగేవారు. కానీ, ఇది కేవలం ఊహ మాత్రమే. ఆఖరు నియాండర్తల్స్ సుమారు 40,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయారు. ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది? డైనోసార్లు సెక్స్ ఎలా చేసుకునేవి... ఆడ జంతువులను శృంగారానికి ఎలా ఆహ్వానించేవి? ఫొటో సోర్స్, SPL వీడియో క్యాప్షన్, Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.