Jump to content

Kodali nani appointed as lawyer for YS bharathi liqor scam


Recommended Posts

Posted

వైన్ షాపులు ఇవ్వండ‌ని అడుక్కునే ఖ‌ర్మ చంద్ర‌బాబుది: కొడాలి నాని 

09-09-2022 Fri 18:27
  • ఓ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా? అన్న నాని
  • వైఎస్ భార‌తికి వైన్ షాపులు అడుక్కునే ఖ‌ర్మ లేద‌ని వెల్ల‌డి
  • అయినా ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత‌? అని వ్యాఖ్య‌
kodali nani hits back on tdp allegations over ys bharathi share in delhi liquor scam

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబానికి, ప్ర‌త్యేకించి ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ భార‌తికి సంబంధం ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని శుక్ర‌వారం స్పందించారు. ఈ ఆరోప‌ణల‌ను ఖండిస్తూనే... టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌ల‌పైనా నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా? అని కొడాలి నాని ప్ర‌శ్నించారు. అయినా ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత‌? అని కూడా నాని వ్యాఖ్యానించారు. వైఎస్ భార‌తి ఢిల్లీ వెళ్లి వైన్ షాపుల‌కు లైసెన్స్‌లు అడుక్కునే ఖ‌ర్మ ఉందా? అని ప్ర‌శ్నించిన నాని... వైన్ షాపులు ఇవ్వండ‌ని అడుక్కునే ఖ‌ర్మ చంద్ర‌బాబుది అని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్ర‌బాబు గెల‌వర‌న్న నాని.. మంగ‌ళ‌గిరిలో లోకేశ్ గెల‌వ‌ర‌ని జోస్యం చెప్పారు.

Posted

Road lu veyataniki.. pata bils ckear cheyataniki dikku diwana ledu.. ee mundalaki 3 capitals lol

ప‌రిపాల‌న రాజ‌ధానిని వైజాగ్ తీసుకెళ్ల‌డం త‌థ్యం: కొడాలి నాని 

09-09-2022 Fri 17:38
  • టీడీపీని 23 సీట్ల‌కు ప‌రిమితం చేసినా చంద్ర‌బాబుకు బుద్ధి రాలేద‌న్న నాని
  • రూ.10 వేల కోట్లు పెడితే విశాఖ‌లో సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డి
  • వైజాగ్‌లో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయ‌న్న మాజీ మంత్రి
  • అమ‌రావ‌తిని మ‌హా న‌గ‌రాల‌తో పోల్చి ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ఆశ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోప‌ణ‌
ap ex minister kodali nani comments on 3 capitals issue

 ప‌రిపాల‌న రాజ‌ధానిని వైజాగ్ తీసుకెళ్ల‌డం త‌థ్య‌మంటూ తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన మాజీ మంత్రి కొడాలి నాని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప‌రిపాల‌న రాజ‌ధాని విశాఖ‌తో పాటు న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలు, శాస‌న రాజ‌ధానిగా అమ‌రావ‌తి వుంటాయని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని ల‌క్ష్యంగా చేసుకుని కొడాలి నాని ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయ‌ని ఆయ‌న చెప్పారు. వైజాగ్‌లో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 

విశాఖ‌లో కేవలం రూ.10 వేల కోట్లు పెడితే సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌న్నారు. అమ‌రావ‌తిని మ‌హా న‌గ‌రాల‌తో పోల్చి చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఆశ‌లు క‌ల్పిస్తున్నార‌ని ఆరోపించారు. 29 నియోజ‌కవ‌ర్గాలు ఉన్న రాజ‌ధాని ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నించిన నాని... 29 గ్రామాలున్న అమ‌రావ‌తి ఎక్క‌డ అని వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని 23 సీట్ల‌కే ప‌రిమితం చేసినా చంద్ర‌బాబుకు బుద్ధి రాలేద‌న్నారు.

Posted

Oka pakka 3 capitals ani.. malli deyyala rajadhani endi ra jaffas.. Mentolodiki tagga vallu anta

అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు... దెయ్యాల రాజ‌ధాని: ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌ 

09-09-2022 Fri 15:04
  • 3 రాజ‌ధానుల‌పై కొత్త బిల్లు తీసుకొస్తామ‌న్న అమ‌ర్‌నాథ్
  • వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు వింటే కులీకుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని సెటైర్‌
ap minister gudivada amarnath viral comments on amaravati

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ శుక్ర‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు అన్న ఆయ‌న... అమ‌రావ‌తిని దెయ్యాల రాజ‌ధానిగా అభివ‌ర్ణించారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో వ‌స్తామ‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజ‌ధాని రైతులు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాపాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఆ తీర్పును స్వాగ‌తిస్తూ ప‌లువురు వ్యాఖ్య‌లు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భంగా శుక్ర‌వారం అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల్లోనే మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా అమ‌ర్‌నాథ్ చెప్పారు. ఇదివ‌ర‌కు ప్ర‌తిపాదించిన బిల్లుపై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో కొత్త బిల్లును తీసుకువ‌స్తున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిపైనా అమ‌ర్‌నాథ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గాడిద‌కు కొమ్ములు వ‌చ్చినా, ముస‌లోడికి పిచ్చి వ‌చ్చినా భ‌రించ‌డం క‌ష్ట‌మ‌న్న అమ‌ర్‌నాథ్‌... ఇప్పుడు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చూస్తున్నా అదే త‌ర‌హా ప‌రిస్థితి గుర్తుకు వ‌స్తోంద‌న్నారు. హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు మాట‌లు వింటే కులీ కుతుబ్‌షా ఉరేసుకుంటార‌ని ఆయ‌న సెటైర్‌ వేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...