Jump to content

#SSMB28

Recommended Posts

  • 2 weeks later...
Posted

ssmb-28-latest-update.webp

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈ నెల 12న ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభమైన వారం రోజులకే బ్రేక్ వచ్చింది. దీంతో యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో రావడంలేదన్న అసంతృప్తితో షూటింగ్ వాయిదా వేశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ 'ssmb 28' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ సోషల్ మీడియా వేదికగా షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో 'ssmb 28' మొదటి షెడ్యూల్ పూర్తయిందని చెప్పింది. అద్భుతంగా స్టంట్ కోరియోగ్రఫీ అందించారంటూ అంబు-అరువు మాస్టర్లకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే దసరా తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఇందులో మహేష్, పూజ హెగ్డే పాల్గొంటారని పేర్కొంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about SSMB28 movie updates

  • 4 weeks later...
Posted

mahesh-ssmb28.webp

మ‌హేశ్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటే.. ఆ కిక్కే వేరు! వారి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మొద‌టి సినిమా 'అత‌డు'ని అభిమానించ‌ని వాళ్లెవ‌రైనా ఉంటారా?  పార్థు (మ‌హేశ్‌)తో, పూరి (త్రిష‌)తో ప్రేమ‌లో ప‌డ‌ని వాళ్లెవ‌రు!! త‌ర్వాత వ‌చ్చిన 'ఖ‌లేజా' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఆడ‌క‌పోవ‌చ్చు గాక‌.. ఆ పిక్చ‌రైజేష‌న్‌, ఆ డైలాగ్స్‌, మ‌హేశ్ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ మాడ్యులేష‌న్‌ను విమ‌ర్శ‌కులు, అస‌లైన సినీ ప్రియులు మెచ్చారు. 

ఇప్పుడు వారి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా త‌యార‌వుతోంది. 'SSMB 28' పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ సెప్టెంబ‌ర్‌లో జ‌రిగింది.
ద‌స‌రా త‌ర్వాత అక్టోబ‌ర్ 10 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ చెయ్యాల‌ని నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవుతుంద‌ని కూడా విన‌వ‌చ్చింది. ఇంత‌లో మ‌హేశ్ మాతృమూర్తి ఇందిరాదేవి మృతి చెంద‌డంతో.. షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. అమ్మ మృతి విషాదం నుంచి కోలుకోవ‌డానికి ఫ్యామిలీని తీసుకొని ఫారిన్ టూర్‌కు వెళ్లాడు మ‌హేశ్‌. దీంతో న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 ఏప్రిల్ 28న ఈ మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about SSMB28 movie latest updates

Posted
On 9/21/2022 at 11:17 PM, JollyReddy said:

FdGNEQIacAUUiAZ?format=jpg&name=medium

sora chepala undetodu endu chepala aipoyaadu 😭

Posted
9 minutes ago, Rushabhi said:

Eeyana chesidhi takkuva tirigedhi ekkuva. 

ok

Posted
18 hours ago, Rushabhi said:

Eeyana chesidhi takkuva tirigedhi ekkuva. 

enti adi 

Posted
18 hours ago, Rushabhi said:

Eeyana chesidhi takkuva tirigedhi ekkuva. 

Em chesthadu thakkuvaa

  • Haha 1
  • 1 month later...
Posted

sreeleela-in-ssmb28.webp

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'SSMB 28'పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మహేష్ కోసం త్రివిక్రమ్ ఫుల్ ప్యాకెడ్ ఎంటర్టైన్మెంట్ ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

'SSMB 28'లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల సందడి చేయనుందని సమాచారం. 'పెళ్లి సందడి'(2021)తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి వరుస అవకాశాలు పట్టేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్ సినిమాలో అవకాశం రావడం బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. For more information visit Teluguone.com official website

Click here to get more details about SSMB 28 Movie latest updates

Posted

rashmika-special-song-in-ssmb28.webp

స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సమంత వంటి హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో చిందేసి మెప్పించగా ఇప్పుడు ఆ లిస్టులో రష్మిక మందన్న కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది.

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ లో చిందేసి హీరోయిన్ ఎవరు కాదు రష్మిక అంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

గతంలో మహేష్ సినిమాలలో ఐటెం సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఈ సాంగ్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about SSMB 28 movie latest updates

  • Confused 1
Posted
2 hours ago, Telugumoviereviews said:

arey guruji gaa nee g meeda tannali...kasak ni movie lo unchukuni flatron tho item song entra

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...