Telugumoviereviews Posted September 19, 2022 Report Posted September 19, 2022 ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'సార్' (తమిళంలో 'వాతి') ద్విభాషా చిత్రం విడుదల తేదీ ఖరారయ్యింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ సోమవారం తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేసి, Mark the Date. Our #Vaathi / #SIR is getting ready to take classes from 2nd Dec 2022! అంటూ రాసుకొచ్చింది. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీత దర్శకుడు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య (త్రివిక్రమ్ భార్య) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులోనూ ధనుష్‌కు చెప్పుకోదగ్గ మార్కెట్ ఉండటంతో ఇప్పుడు తెలుగు నిర్మాతలు అతనితో నేరుగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో 'సార్' (వాతి) మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అతను బాలగంగాధర్ తిలక్ అనే జూనియర్ లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. For more information visit Teluguone.com official website Click here to get more details about Dhanush's SIR movie latest updates Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.