Jump to content

Sukesh Jacky - Kaamist Devudu


Recommended Posts

Posted

రూ.215 కోట్ల సుకేష్ చంద్రశేఖర్ స్కాంలో  సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యవహారంలో కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్ కేసులో ఆయన ప్రియురాలు అయిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను కూడా పోలీసులు ప్రశ్నించారు.  ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఛార్జీ షీట్ దాఖలు కాగా.. నోరా ఫతేహిని విచారించిన అనంతరం ఈమె ప్రమేయం లేదని తేల్చి క్లీన్ చిట్ ఇచ్చారు.


ఈ కేసులో కోట్లాది రూపాయలను సుకేష్ తన ప్రియురాలు అయిన జాక్వెలిన్ కు ఇచ్చాడని ఈడీ విచారణలో తేల్చింది. తాజాగా జాక్వెలిన్ స్టైలిష్ట్ అయిన ‘లేపాక్షి ఎల్లవాడి’ని 8 గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా సుఖేష్ జాక్వెలిన్ లు సహజీవనం చేశారని లేపాక్షి తెలిపినట్టు సమాచారం. తనకు సుకేష్ పలు మార్లు ఫోన్ చేసి జాక్వెలిన్ ఎలాంటి వస్తువులు దుస్తులు అంటే ఇష్టమని తెలుసుకునేవాడని.. ఆమెను మచ్చిక చేసుకునేందుకు భారీగా బహుమతులు ఇచ్చేవాడని లేపాక్షి తెలిపారు. జాక్వెలిన్ కోసం 3 కోట్ల రూపాయిలు ఇచ్చి బ్రాండెడ్ దుస్తులు కొనమని చెప్పాడని.. తన బ్యాంక్ అకౌంట్ కు సుకేష్ డబ్బులు ట్రాన్స్ పర్ చేశాడని తెలిపాడు. ఆ డబ్బుతో జాక్వెలిన్  కోసం దుస్తులు బహుమతులు కొన్నానని.. సుఖేష్ అరెస్ట్ తర్వాత అతడితో జాక్వెలిన్ తెగదెంపులు చేసుకున్నదని లేపాక్షి చెప్పారు.

సుకేష్ కుంభకోణంలో జాక్వెలైన్ కు ఆర్థిక సంబంధాలున్నాయని ఈడీ తేల్చింది.  జాక్వెలైన్ కు భారీగా ధనం ఇచ్చి ముంబైలోని సముద్ర తీరానికి అభిముఖంగా ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను కానుకగా సుకేష్ ఇచ్చాడని తెలిసింది. సుకేష్ తో ముద్దులు మురిపాలు అన్నీ ఆ అపార్ట్ మెంట్ లోనే సాగాయని తేలింది. రూ.10 కోట్ల మేర లబ్ధి పొందినట్టు ఈడీ గుర్తించింది. 7 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. సుకేష్ ఏకంగా జాక్వెలిన్ కు ఖరీదైన బహుమతులు కానుకగా ఇచ్చినట్టు తేలింది. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు జిమ్ సూట్లు వజ్రాల చెవిపోగులు బ్రాస్ లెట్ మినీ కూపర్ ఇలా దాదాపు 10 కోట్ల విలువైన కానుకలను జాక్వెలిన్ కు సుకేష్ ఇచ్చినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది.  ఆధారాలు బలంగా ఉండడంతో జాక్వలైన్ పై ఈడీ  చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో జాక్వలైన్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.

జాక్వెలిన్ ను సుకేష్ చెన్నైలో దాదాపు 4 సార్లు కలిశాడని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అతడిని కలిసేందుకు జాక్వెలిన్ ప్రైవేట్ జెట్ ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు.

రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్ శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో  వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఆకేసులోనే అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యాడు.

Posted

Idhi ra sketch ante ee love da la IT cheskunta vachina paisal motham kaamanike vaadithe migilendhi yem ledu boche thappa. 

Sukesh bayataki ravali ilanti scam lo maaku inspiration ivvali. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...