Jump to content

Recommended Posts

Posted

గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్‌మాల్‌ గుజరాత్‌ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

KTR: పేదలకు ఇళ్లు ఇవ్వరు.. మోదీ రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ఫ్లోరైడ్‌ సమస్యను మిషన్‌ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్‌మాల్‌ గుజరాత్‌ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు. నైజీరియా కంటే  దారుణంగా భారత్‌ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయి. భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. భారత్‌ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ప్రతి ఒక్కరికీ తాగునీరు, విద్యుత్‌ ఉచితంగా అందిస్తాం. 

ఎస్సీలను వ్యాపారవేత్తలను చేస్తాం. సెప్టెంబర్‌ 17 లిబరేషన్‌ డే అయితే ఆగస్టు 15 ఎందుకు కాదు? 2024 పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తాం. మహారాష్ట్ర, కర్ణాటకలో మాకు సానుకూలంగా ఉంది. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కేసీఆర్‌ను అవహేళన చేసినవాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్‌ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు.. వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలను బయటపెడతాం. భాజపా విలువలు లేని రాజకీయాలు చేస్తోంది. మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క భాజపా నేతపైనైనా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? తెలంగాణలో జరుగుతున్న పనిని దేశానికి చెబుతాం. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Posted

Mundhu Mee farm house & Rakul Rao Shopping karchu cheppu ra fuka 😂😂

  • Haha 1
Posted

Intaki 435 crores to em kadutunnaru?

Ee chinna Dora abadhalu alavoka ga cheptadu. Need a source here.

Posted

Eede cheppali ilantivi … modi power loki dhigaka edho small house lo untadu. Eedi ayya laga farm house lo thagipadkodu 

  • Upvote 2
Posted
1 hour ago, Democraticcompulsion said:

Intaki 435 crores to em kadutunnaru?

Ee chinna Dora abadhalu alavoka ga cheptadu. Need a source here.

Parliament building anukunta

Posted

Ee bokka gaada madtladedi austerity goorinchi matladedi????Ktr Rama Rao GIF - KTR Rama Rao Rakul - Discover & Share GIFs

 

కేటీర్ ఫార్మ్హౌస్ పూర్తి వీడియో..KTR 25 Acres Farmhouse in Janwada Full  Drone Visuals | CMTV

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...