MRI Posted October 7, 2022 Report Posted October 7, 2022 db lo ee ammayi meeda kannesaavu bro?? frienduu wifuu antunnavu.. hahahahah Quote
LadiesTailor Posted October 7, 2022 Report Posted October 7, 2022 55 minutes ago, Anta Assamey said: Venky rockssssss Quote
Shameless Posted October 7, 2022 Report Posted October 7, 2022 1 hour ago, Anta Assamey said: mana Venky Babu unnaru ante manchi comedy untadhi...loolks good though...TG youth ni attract cheyaniki BADCOW word pettaru ga.. Quote
Starblazer Posted October 7, 2022 Report Posted October 7, 2022 idedo 🐍☕ - samantha - sai pallavi story la undi... venky mama convince cheyyataniki chusinatlunnadu. movie kada ani happy ending ichinatlunnaru. Quote
summer27 Posted October 7, 2022 Report Posted October 7, 2022 old movie ra babu..ohh my kaduvale ani tamil movie Quote
Popular Post sarfaroshi Posted October 7, 2022 Popular Post Report Posted October 7, 2022 Mithila palkar...super cute pilla. ee video tho famous iyindi... 3 2 Quote
Swatkat Posted October 7, 2022 Report Posted October 7, 2022 1 hour ago, Shameless said: mana Venky Babu unnaru ante manchi comedy untadhi...loolks good though...TG youth ni attract cheyaniki BADCOW word pettaru ga.. davada edhi remake tamil movie chusa already. Tamil lo ah venky boxer kovie heroine eh act chesindhi. Denlo vedu senior tho love lo padthadu malla back to heroine daggarke vasthadu.. Quote
hunkyfunky2 Posted October 7, 2022 Report Posted October 7, 2022 2 hours ago, Anta Assamey said: I am not sure herione is right choice - no lipsync for dialogues Quote
Kakynada Posted October 7, 2022 Report Posted October 7, 2022 4 hours ago, sarfaroshi said: Mithila palkar...super cute pilla. ee video tho famous iyindi... 1 Quote
Pahelwan2 Posted October 7, 2022 Report Posted October 7, 2022 5 hours ago, sarfaroshi said: Mithila palkar...super cute pilla. ee video tho famous iyindi... Ad thu idi heroine endi ee angle la Quote
sarfaroshi Posted October 7, 2022 Report Posted October 7, 2022 1 minute ago, Pahelwan2 said: Ad thu idi heroine endi ee angle la Neeku ye herione nachutado cheppu 1 Quote
Telugumoviereviews Posted October 19, 2022 Report Posted October 19, 2022 గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 15న(శనివారం) విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ 'కాంతార' మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ వారం మరో నాలుగు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ శుక్రవారం(అక్టోబర్ 21న) నాలుగు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా, రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా విజయం చూడని మంచు విష్ణు తాను నటించిన తాజా చిత్రం 'జిన్నా'పనే ఆశలు పెట్టుకున్నాడు. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించడంతో పాటు రైటర్ గా కోన వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్, ఈ ఏడాది ఇప్పటికే 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు 'ఓరి దేవుడా' చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఓ మై కడవులే'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనువిందు చేయనుండటం విశేషం. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ విజయాలు అందుకుంటున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కి వెంకీ మామ తోడవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. 'డాక్టర్', 'డాన్' ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ్ హీరో శివకార్తికేయన్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు 'ప్రిన్స్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక 'సర్దార్' అనే చిత్రం మరో తమిళ్ హీరో కార్తి కూడా అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. 'అభిమన్యుడు' ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ట్రైలర్ ఆకట్టుకుంది. మరి ఈ వారం విడుదలవుతున్న ఈ నాలుగు చిత్రాలలో ఎన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి. For more information visit Teluguone.com official website Click here to get more details about this week releasing movies updates Quote
Telugumoviereviews Posted October 21, 2022 Report Posted October 21, 2022 రెండేళ్ల క్రితం తమిళంలో వచ్చిన 'ఓ మై కడవులే' మూవీని అక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించారు. అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ఆ మూవీని అశ్వథ్ మారిముత్తు డైరెక్ట్ చేశాడు. మోడరన్ గాడ్‌గా విజయ్ సేతుపతి చేశాడు. ఇప్పుడు అదే మూవీ 'ఓరి దేవుడా' పేరుతో తెలుగులో రీమేక్ అయ్యింది. ఒరిజినల్‌ను తీసిన మారిముత్తు ఈ మూవీని కూడా రూపొందించాడు. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దేవుడి క్యారెక్టర్‌ను వెంకటేశ్ చేయడం ప్రేక్షకుల్లో విడుదలకు ముందు ఆసక్తిని రెకెత్తించింది. పీవీపీ సినిమా ప్రొడ్యూస్ చేసిన 'ఓరి దేవుడా' ఎలా ఉందంటే... కథ:- కలిసి చదువుకున్న అర్జున్ (విష్వక్ సేన్), అను (మిథిలా పార్కర్), మణి (వెంకటేశ్ కాకుమాను) చిన్నప్పట్నుంచీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎలాంటి అరమరికలు లేకుండా వాళ్ల మధ్య స్నేహం వెల్లి విరుస్తుంది. మిగతా ఇద్దరితో పోలిస్తే అర్జున్ చదువులో వీక్. అందుకే ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యాక సప్లిమెంటరీ రాసి, ఇంజనీరింగ్ పాసయ్యాననిపించుకుంటాడు. తల్లి లేని అనుకు పెళ్లి చెయ్యాలని ఆమె తండ్రి (మురళీశర్మ) సంకల్పిస్తాడు. అర్జున్‌పై అనుకు లవ్ ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే "మనం పెళ్లి చేసుకుందామా?" అనడుగుతుంది. "మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మనకి పెళ్లేమిటి?" అని అర్జున్ తెగ నవ్వేస్తాడు. కానీ ఆమెకు నో చెప్పడానికి ఎలాంటి రీజన్ కనిపించక, చివరకు పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇద్దరికీ పెళ్లయిపోతుంది. కట్ చేస్తే.. ఏడాది గడిచాక ఇద్దరూ విడాకుల కోసం ఇద్దరూ ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కుతారు. వాళ్లిద్దరికీ విడాకులు మంజూరు కావని, ఆ కోర్టులో ఓ వ్యక్తి (రాహుల్ రామకృష్ణ) అర్జున్‌కు చెప్తాడు. తమ గురువు దగ్గరకు వస్తే పనవుతుందని ఓ విజిటింగ్ కార్డు కూడా ఇస్తాడు. అతను చెప్పినట్లే అక్కడ ఘటనలు జరిగి అను కళ్లుతిరిగి పడిపోతుంది. సాయంత్రం 4 గంటలకు ఆ కేసును మళ్లీ విచారిస్తామని జడ్జి చెప్తుంది. దాంతో అపరిచిత వ్యక్తి ఇచ్చిన అడ్రస్ ప్రకారం లవ్ కోర్ట్‌కు వెళ్తాడు అర్జున్. అక్కడ అతనికి మోడరన్ గాడ్ (వెంకటేశ్) కనిపిస్తాడు. జీవితంలో రెండో చాన్స్ ఇస్తానని, ఆ తర్వాత నీ ఇష్టం అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పినట్లే పెళ్లికి ముందు అను తనకు ప్రపోజ్ చేసిన సన్నివేశం దగ్గరకు కాలం వెనక్కి వెళ్తుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? తను కోరుకున్నట్లు వచ్చిన రెండో అవకాశాన్ని అతను ఎలా ఉపయోగించుకున్నాడు? అతనికి జీవితం ఏం నేర్పింది? తనకంటే రెండేళ్లు సీనియర్ అయిన మీరా పరిచయం అతనికి ఎలాంటి అనుభవాలు ఇచ్చింది? అనుతో అనుబంధం ఏ తీరానికి చేరింది?.. అనే విషయాలను మిగతా కథలో చూస్తాం. జీవితంలో రెండో అవకాశం వస్తే ఏం చేస్తారనే ఆసక్తికరమైన పాయింట్‌ను అంతే ఆసక్తికరంగా తెరకెక్కించిన 'ఓరి దేవుడా' చిత్రాన్ని హాయిగా తిలకించవచ్చు. చిన్నపాటి పొరపాట్లను వదిలేస్తే.. చక్కని క్యారెక్టరైజేషన్స్, ఆకట్టుకొనే సంభాషణలు, మెప్పించే అభినయాలతో ఓ మంచి సినిమాని చూశాం అనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. For more information visit Teluguone.com official website Click here to get more details about Ori Devuda movie review and rating Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.