RedThupaki Posted October 27, 2022 Report Posted October 27, 2022 16 hours ago, DesiPokiri said: Vacchindi movie ki uncle, credit goes to rajamouli antey anniyaa directedd chesindu kadhaa uncleee....he will eventually get the URanusss awardd ofcourse....just wait and watch.....bossss will be backk back baaakc bacckkk Quote
Telugumoviereviews Posted November 14, 2022 Report Posted November 14, 2022 జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలయ్యాక హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉందంటూ ఎందరో ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవల జపాన్ లో విడుదలై అక్కడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇలా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారంతా. తాజాగా రాజమౌళి సైతం 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి సర్ ప్రైజ్ చేశాడు. రాజమౌళి వ్యాఖ్యలతో ఒక్కసారిగా 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పట్లో ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబుతో ఒక మూవీ ప్రకటించాడు. అది పూర్తి కావడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. అలాగే ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అంటే ఎన్టీఆర్ డేట్స్ కూడా మరో రెండు-మూడేళ్లు ఖాళీ లేనట్టే. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ప్రస్తుతం శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నాడు. 16వ సినిమాకి దర్శకుడిని వెతికే పనిలో ఉన్నాడు. మహేష్ తో రాజమౌళి సినిమా పూర్తయ్యి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి డేట్స్ అందుబాటులో ఉంటేనే గానీ 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ సాధ్యమయ్యే అవకాశం లేదు. For more information visit Teluguone.com official website Click here to get more details about RRR movie sequel updates Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.