southyx Posted November 9, 2022 Report Posted November 9, 2022 వేమన పోయి వైఎస్ వచ్చే.. ప్రజాకవి యోగి వేమన పేరు మీద ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆయన విగ్రహాన్నే తీసి పక్కన పెట్టేశారు అధికారులు. ఆ స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. Published : 10 Nov 2022 03:07 IST విశ్వవిద్యాలయంలో యోగి వేమన బదులు రాజశేఖరరెడ్డి విగ్రహం న్యూస్టుడే, యోవేవి (కడప): ప్రజాకవి యోగి వేమన పేరు మీద ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఆయన విగ్రహాన్నే తీసి పక్కన పెట్టేశారు అధికారులు. ఆ స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వేమన పేరుతో వైయస్ఆర్ జిల్లా కడపలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ఆటవెలది పద్యాలతో.. సమాజంలో నైతిక విలువలు, మూఢ నమ్మకాలు, కుల వివక్ష వంటివాటిపై జనంలో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి వేమన. ఆయన గొప్పతనాన్ని చాటేలా అప్పట్లో ప్రధాన పరిపాలన భవనం ముందు వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు విశ్వవిద్యాలయ అధికారులు అత్యుత్సాహంతో ఆ విగ్రహాన్ని తొలగించి గేటు పక్కన పెట్టారు. ఆ స్థానంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్వీఎస్) రాష్ట్ర కార్యదర్శి మల్లెల జగదీష్, అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి వి.గంగా సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.