Telugumoviereviews Posted November 25, 2022 Report Posted November 25, 2022 భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రాన్ని అయినా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే మేకర్స్ తమ చిత్రాన్ని వివిధ భాషల్లో డబ్ చేసి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ చిత్రం 'భేదియా' కూడా అదే బాటలో పయనించి ట్రైలర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా ఇటీవల కన్నడ చిత్రం 'కాంతార'ను తెలుగులో విడుదల చేసి కలెక్షన్లు కొల్లగొట్టిన గీతా ఆర్ట్స్.. కొద్దిరోజులకే హిందీ చిత్రం 'భేదియా'ను 'తోడేలు' పేరుతో తెలుగులోకి తీసుకొస్తుండటం ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షించింది. మరి ఈ 'తోడేలు' చిత్రం ఆ అంచనాలను అందుకొని వసూళ్ళ వర్షం కురిపించేలా ఉందో లేదో తెలుసుకుందాం. కథ: భాస్కర్(వరుణ్ ధావన్) ఒక చిన్న కాంట్రాక్టర్. ఒకసారి ప్రాజెక్ట్ పని మీద అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి కలుపుతూ రోడ్డు వేయడం కోసం అక్కడికి వెళ్ళిన అతను.. తన స్వలాభం కోసం వ్యాపార కోణంలో ఆలోచించి పచ్చని చెట్లను నరికించి అడవి గుండా రోడ్డు వేయాలి అనుకుంటాడు. దానికోసం కొందరికి డబ్బాశ చూపుతాడు, అక్కడి ప్రజలకు మాయమాటలు చెప్తాడు. అయితే ప్రకృతికి హాని కలగకుండా అక్కడేదో శక్తి కాపాడుతుంటుంది. దానిని కొందరు వైరస్ అంటారు. ఇదిలా ఉంటే ఒకసారి భాస్కర్ పై తోడేలు దాడి చేసి గాయపరుస్తుంది. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పులొస్తాయి. క్రమక్రమంగా తోడేలులా మారిపోయి తనకే తెలియకుండా అడవిని నాశనం చేయాలనుకున్న వారి ప్రాణాలు తీస్తుంటాడు. భాస్కర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అతను తిరిగి మామూలు మనిషి అయ్యాడా? అడవిలో రోడ్డు వేయాలనుకున్న అతని ఆశ నెరవేరిందా? అడవిని రక్షిస్తున్న అదృశ్య శక్తి ఏంటి? అక్కడి వారిని భయపెడుతున్న ఆ వైరస్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి. ట్రైలర్ చూసి భారీ అంచనాలతో సినిమాకి వెళ్తే నిరాశ చెందక తప్పదు. ఆకట్టుకునే విజువల్స్, అక్కడక్కడా నవ్వులతో ఒకసారి చూడగలిగేలా ఉంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్లొచ్చు. For more information visit Teluguone.com official website Click here to get more details about Thodelu movie review and rating Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.