Peruthopaniemundhi Posted January 1, 2023 Report Posted January 1, 2023 ఏపీ నుంచి భారాసలోకి చేరికలు మొదలయ్యాయి. సీనియర్ నేతలు తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌బాబు, పార్థసారధి తదితరులు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పొరుగు రాష్ట్రాలకు విస్తరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో భారాస కార్యకలాపాలకు వీలుగా అక్కడి నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. గతంలో జనసేనలో క్రియాశీలకంగా ఉన్న తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో భారాసలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి కూడా భారాస తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. తెరాస.. భారాసగా మారిన తర్వాత పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకం అయ్యేందుకు కేసీఆర్ కార్యాచరణ మొదలుపెట్టారు. ఒకప్పుడు అఖిల భారత సర్వీసుల్లో పనిచేసి.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న వారిని భారాసలో చేర్చుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. జనసేన నేత తోట చంద్రశేఖర్ భారాసలో చేరటానికి రంగం సిద్ధమైంది. ఈయన ఐఏఎస్ అధికారిగా ఉండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైకాపా తరఫున ఏలూరు నుంచి ఎంపీగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసినా విజయం వరించలేదు. మూడు పార్టీల తరఫున మూడు ప్రాంతాల్లో పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 2020 నుంచి జనసేన పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఇప్పుడు కేసీఆర్ తన పార్టీని ఏపీకి విస్తరిస్తుండటంతో అందులో చేరి అదృష్టం పరీక్షించుకోనున్నారు. చంద్రశేఖర్‌తో పాటు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు భారాసలో చేరనున్నట్టు సమాచారం. ఐఆర్ఎస్ అధికారిగా రాజీనామా చేసి 2014లో తెదేపాలో చేరి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రావెల ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు. ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉండి.. 2018లో జనసేనలో చేరారు. ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఓటమి తర్వాత రావెల భాజపాలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక పోయారు. దాదాపు ఏడాది క్రితం భాజపాను వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇప్పడు భారాస ఏపీలోకి రావటంతో ఆయన కూడా ఆ పార్టీవైపు మొగ్గు చూపారు. విజయవాడలో త్వరలో రాష్ట్ర కార్యాలయం 2019లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన చింతల పార్థసారధి కూడా భారాసలో చేరనున్నారు. ఓటమి తర్వాత ఆయన కూడా భాజపాలో చేరారు. అక్కడ కూడా ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు భాజపాకు రాజీనామా చేసి భారాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్థసారధి కూడా గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి ముందస్తు పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీలో అడుగు పెట్టేందుకు కేసీఆర్‌కు ఇక్కడి నాయకుల అవసరం ఉంది. ఆ మేరకు వివిధ పార్టీల్లో పనిచేసి.. స్థానికంగా పరిచయాలున్న వారిని భారాసలో చేర్చుకుంటున్నారు. ఈ ముగ్గురు నేతలు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. విజయవాడలో భారాస కార్యాలయం ఏర్పాటు కోసం ఇక్కడ ఉంటున్న కొందరు తెలంగాణ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే కార్యాలయం ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ లోగా కొందరు ఏపీ నేతల్ని భారాసలో చేర్చుకోవటం ద్వారా పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లటం సులువవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కూడా భారాస తరఫున కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇక్కడ భారాస విద్యార్థి, యువజన విభాగాలను ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. ఏపీ స్టూడెంట్స్, యూత్ జేఏసీకి చెందిన రాయపాటి జగదీష్ ఈ మేరకు ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేశారు. కేంద్రంలోని భాజపాతో పోటీ పడటంతో పాటు, నరేంద్రమోదీని దీటుగా ఎదుర్కోవటంలో కేసీఆర్ ముందున్నారని తెలిపారు. అందుకే తాము భారాస కార్యకలాపాల్లో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. Quote
Mr Mirchi Posted January 1, 2023 Report Posted January 1, 2023 idhantha left over batch from JSP Quote
manadonga Posted January 1, 2023 Report Posted January 1, 2023 Vellaki velladaniki ee party ledu anni parties maresaru vellu Quote
manadonga Posted January 1, 2023 Report Posted January 1, 2023 Thota chandra shekar prp congress ycp janasena tdp cherchukosu ravella kishore babu tdp ycp bjp janasena ayipoyayi inka evaru chesrchukoru. Commin point ent ante all are ias officers Quote
Ryzen_renoir Posted January 1, 2023 Report Posted January 1, 2023 Antha scrap trying to eat kcr funds , oka rupayi ichina waste Quote
matta_prabhu Posted January 1, 2023 Report Posted January 1, 2023 Ravella Kishore is worst among all asalu vindiki ticket ichi gelpinchinanduku tdp valani titali minister ichinanduku cbn ni Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.