Jump to content

India Rocks...


Recommended Posts

Posted

రెండేళ్ల క్రితం జరిగిన ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్ కోతి చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కసాయి కసబ్ చేస్తున్న ఆగడాలకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కసబ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాంబే హైకోర్టు విచారణ జరుపుతోంది. విచారణ సమయంలో కసబ్ వెబ్ కెమెరాపై ఉమ్మి వేశాడు.

దీంతో ఆర్థర్ రోడ్ జైలులోని పోలీసులు వెబ్ కెమెరాను ఆపివేసి విచారణను ఓ అరగంట పాటు నిలిపి వేశారు. ఈ సంఘటనపై పోలీసులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన కోర్టు విచారణలో కూడా కసబ్ వెకిలిగా నవ్వాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం కసబ్‌కు ఇష్టం లేదని అందుకే ఇలాంటి అసభ్యకర చర్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ముంబై 26/11 దాడుల కేసులో 28 ఏళ్ల అజ్మల్ కసబ్‌కు విధించిన మరణ శిక్షపై బాంబే హై కోర్టు తొలి సెషన్ విచారణ చేపట్టిన అనంతరం రెండవ సెషన్‌ ప్రారంభించింది. ఆ సమయంలో కసబ్ అకస్మాత్తుగా వెబ్ కెమెరాపై ఉమ్మి "మై ఆనా చాహతా హూ" (నేను కోర్టుకు రావాలనుకుంటున్నాను) అంటూ దురహంకార స్వరంతో గట్టిగా అరిచాడు. కసబ్‌కు గత మే 6న ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Posted

sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2 sAng_banghead2

×
×
  • Create New...