Jump to content

Calling all NRI's - (madhilo medhile cheppukoleni matalu)


Recommended Posts

Posted

కన్నదేశం వదలి, ఉన్న దేశానికి వస్తే  ఉన్నవాళ్ళంతా కానివాళ్ళే !
కారు వున్నా, కాసు వున్నా, ఊరు గాని ఊరులోన సుఖం సున్న !
కారు ఏసి, ఇల్లు ఏసి, వళ్ళు మాత్రం వేడివేడి
ఊరు గొప్పది, పేరు గొప్పది, ఉనికి మాత్రం ఉత్తది !
సంవత్సరాలుగా సహచరులే సంబంధాలు మాత్రం అరకొరలే !
ముఖం చూడ సుపరిచతమే మనిషి మాత్రం అపరిచితుడే  !
ఎదురుపడితేనే హాయి, భాయి, ఎప్పుడు కలవాలి చేయి చేయి ! ఎప్పుడు కావాలి భాయి భాయి !
ఇక్కడి ఇళ్ళే బంధిఖానాలు,  మూసిన వాకిళ్ళు, మనసుకు సంకెళ్ళు !
భార్యాభర్తలు కూడా, దూరపు బంధువులే ! ఎవరి లెక్కవారికి, ఎవరి తిక్కవారిది !
నవ్వు కృత్రిమం, నడత కృత్రిమం ! అంతా అసహజత్వం, అంతా యాంత్రికం !
రోజంతా కంప్యూటర్‌తోనే కబుర్లు "నువ్వూ యంత్రానివే" అన్నట్లు దాని విసుర్లు!
ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళ కోసం ఆత్రంగా చూడటం,
తెరచిన వాకిళ్ళ కోసం అలుపెరగక వెదకడం అలవాటయిన ఈ కళ్ళు ఆలోచిస్తాయి రేయింబవళ్ళు !
ఎంతగా కలిసిపోదామన్నా,పరాయివాడినన్న భావన !
చుట్టూ వందలమంది వున్నా ఎవరూ లేని ఒంటరితనం !
నా దేశాన్ని నాకు దూరంచేసిన, నా రూపాయి అవిటితనం !
@3$%
Posted

నా దేశాన్ని నాకు దూరంచేసిన, నా రూపాయి అవిటితనం ! !q#

Posted

[img]http://i45.tinypic.com/k54u2x.gif[/img]

Last Line was 50-50 ... *=: *=:

Posted

రోజంతా కంప్యూటర్‌తోనే(AFDB) కబుర్లు "నువ్వూ యంత్రానివే" అన్నట్లు దాని విసుర్లు!

×
×
  • Create New...