psycopk Posted July 24, 2023 Report Posted July 24, 2023 Andhra Pradesh: జల్ జీవన్ అమలులో పనితీరు సరిగా లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి: కేంద్రం వెల్లడి 24-07-2023 Mon 20:02 | Andhra కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రాజ్యసభలో ప్రశ్నించిన బీజేపీ సభ్యుడు జీవీఎల్ బదులిచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఏపీ జల్ జీవన్ నిధులు సరిగా వినియోగించుకోలేదని వెల్లడి జల్ జీవన్ మిషన్ లో ఏపీ పనితీరు తీసికట్టు అని వివరణ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు. జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ ప్రభుత్వం పనితీరు బాగాలేదని విమర్శనాత్మకంగా వెల్లడించారు. కేంద్ర నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంలేదని షెకావత్ రాజ్యసభలో వివరించారు. 2021 నుంచి ఈ పథకం నిధులను ఏపీ వినియోగించుకోలేదని వెల్లడించారు. జల్ జీవన్ అమలులో పనితీరు సరిగా లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటని స్పష్టం చేశారు. జల్ జీవన్ పథకానికి చెల్లింపుల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని షెకావత్ రాజ్యసభకు తెలియజేశారు Quote
psycopk Posted July 25, 2023 Author Report Posted July 25, 2023 Andhra Pradesh: కేంద్ర ప్రభుత్వ పథకం అమలులో ఏపీ పనితీరు సరిగా లేదు: కేంద్ర మంత్రి 25-07-2023 Tue 08:15 | Both States జల్‌జీవన్ మిషన్ పథకం నిధులను 2021 తరువాత ఏపీ వినియోగించుకోలేదని ప్రకటన ఈ నిధులను వినియోగించని ఏకైక రాష్ట్రం ఏపీ అని వెల్లడి జల్‌జీవన్ మిషన్ అమలులో ముందువరుసలో తెలంగాణ కేంద్ర ప్రభుత్వ పథకం జల్‌జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నీరు అందించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కాగా, 2021 తరువాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకూ పైసా కూడా వినియోగించని ఏకైక రాష్ట్రం ఏపీ అని తాను బాధాతప్త హృదయంతో చెబుతున్నట్టు పేర్కొన్నారు. 2021-22కి సంబంధించి రాష్ట్ర వాటాను సమకూర్చలేదని వెల్లడించారు. ఇది ఆందోళనకర పరిస్థితి అని వ్యాఖ్యానించిన మంత్రి.. రాష్ట్రంతో నిరంతరం సంప్రదిపులు జరుపుతూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకూ తెలంగాణ, దాద్రానగర్ హవేలీ, దామన్‌దయ్యూ, అండమాన్ నికోబార్, గోవా గుజరాత్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు ఈ పథకంతో కుళాయిలు అందుబాటులోకి తెచ్చాయి. Quote
Android_Halwa Posted July 25, 2023 Report Posted July 25, 2023 lol… jaggadiki paisal ichi vadukovayyya ante etla vadalo telvadu.. ade visionary ni adigithe septadu…wealth creation ela cheyalo ani… Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.