psycopk Posted August 7, 2023 Report Posted August 7, 2023 Ambati Rambabu: చంద్రబాబు గారూ! ఇప్పటికైనా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇస్తారా?: అంబటి 07-08-2023 Mon 16:11 | Andhra జాతీయ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎలా నిర్మించారు? 2018 కి పూర్తి చేస్తానని చెప్పి, ఎందుకు విఫలమయ్యారు? అంటూ అంబటి ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పోలవరం పర్యటన నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు ఆయనకు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు గారూ! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని కేంద్రం నిర్మించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు? కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్‌ను ఎలా నిర్మించారు? 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు? అని మూడు ప్రశ్నలు సంధించారు. అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. prati stage lo center nundi commitee vachi ani review chesindi.. mari modi di tappu ani chepe dammu unda ambothu?? ivi ani teliya kunda ne 2020 ki complete chestam.. 2021 ki chestam.. 2022 ki chestam.: ipudu maa valla kadu.. 🤣🤣🤣🤣 mee bratuki development ane word ki sambandham ekkada untadi ra.. sannasi yedavalara Quote
psycopk Posted August 7, 2023 Author Report Posted August 7, 2023 Chandrababu: జగన్ క్షమించరాని నేరం చేశారు... పోలవరం వద్ద చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ 07-08-2023 Mon 17:55 | Andhra సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన విపక్ష నేత హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శలు వర్షాకాలం పూర్తయితే జగన్ పని అయిపోయినట్టేనన్న చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కొనసాగుతోంది. నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును కూడా సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ... జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని విమర్శించారు. ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని వివరించారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ గ్యాప్ లు పూర్తిచేయనందువల్లే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు నీరు వెళ్లిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రధాన డ్యామ్ దగ్గర పనులు చేయలేదని అన్నారు. అసలు, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న రెండేళ్లకు గానీ ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని స్పష్టం చేశారు. నిర్వాసితులకు రూ.19 లక్షలు ఇస్తానన్న జగన్... ఒక్కరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. పైగా, నిర్వాసితుల లబ్దిదారుల జాబితా మార్చి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పట్ల జగన్ క్షమించరాని నేరం చేశారని అన్నారు. పోలవరంపై చేసిన తప్పు ఒప్పుకుని ఇప్పటికైనా చెంపలేసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం ఆపేందుకు గతంలోనూ జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించకుండా ఢిల్లీలో జగన్ లాబీయింగ్ చేశారని వెల్లడించారు. అవాస్తవాలతో పోలవరంపై పుస్తకాలు ప్రచురించారని మండిపడ్డారు. జగన్ అధికారం చేపట్టాక కమీషన్ల కోసం కాంట్రాక్టరును కూడా మార్చారని తెలిపారు. కాంట్రాక్టరును మార్చడం కోసం జగన్ బంధువుతో విచారణ చేయించారని చంద్రబాబు వివరించారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి లేదని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. "ఈ వర్షాకాలం పూర్తయితే జగన్ పని కూడా అయిపోయినట్టే. రాష్ట్రానికి జీవనరేఖ వంటి ప్రాజెక్టును విషాదభరితం చేశారు. పోలవరం పట్ల పేకాటలో జోకర్ తరహాలో వైసీపీ పాలకుల వైఖరి ఉంది" అని వ్యాఖ్యానించారు. పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే తనను పోలవరానికి అనుమతించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబు విపక్ష నేత హోదాలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇదే ప్రథమం. Quote
psycopk Posted August 7, 2023 Author Report Posted August 7, 2023 Chandrababu: ఇప్పుడైతే పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు: చంద్రబాబు 07-08-2023 Mon 16:07 | Andhra చింతలపూడి ప్రాజెక్టు వద్ద చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చింతలపూడి ఎందుకు పూర్తిచేయలేకపోయారని నిలదీసిన టీడీపీ అధినేత వైఎస్ నిర్వాకం వల్లే పోలవరం పదేళ్లు ఆలస్యమైందని వెల్లడి ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. చింతలపూడి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలంటూ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో చింతలపూడి ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు. 4.8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు వివరించారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం రూ.2,289 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టుల స్థితిపై చంద్రబాబు పట్టిసీమ, పోలవరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. 2004 నుంచి పాలకుల వైఖరి కారణంగా ప్రాజెక్టు రెండుసార్లు బలైందని విచారం వ్యక్తం చేశారు. 2004లో మధుకాన్, శీనయ్య సంస్థలకు టెండర్లు దక్కాయని, కానీ కక్ష సాధింపు చర్యలతో అప్పటి పనులు రద్దు చేశారని చంద్రబాబు వెల్లడించారు. కమీషన్ల కోసం కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. పోలవరంలో 2004 నుంచి 2014 వరకు జరిగింది ఐదు శాతం పనులేనని స్పష్టం చేశారు. అసలు , పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థాయికి ఈ ప్రభుత్వం చేరుకుందని వివరించారు. 2021 నుంచి అనేక తేదీలు ప్రకటిస్తూ వచ్చారని, కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పోలవరం పనులు ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడైతే... పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. Quote
Netflixmovieguz Posted August 7, 2023 Report Posted August 7, 2023 Sellfie piichenndhee thathaaa Quote
psycopk Posted August 7, 2023 Author Report Posted August 7, 2023 https://www.instagram.com/reel/CvpLR8us4Bj/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted August 7, 2023 Author Report Posted August 7, 2023 4 minutes ago, Netflixmovieguz said: Sellfie piichenndhee thathaaa Tadepalli lo tongune vadiki dani value teliyadu le aunty.. adi teyali ante dammu undali Quote
MiryalgudaMaruthiRao Posted August 7, 2023 Report Posted August 7, 2023 calling @anilyadavc Dec 2021 in. truth yugam project will be completed Quote
psycopk Posted August 8, 2023 Author Report Posted August 8, 2023 Chandrababu: పోలవరం పూర్తి కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి: చంద్రబాబు 07-08-2023 Mon 21:27 | Andhra పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ పోలవరం పూర్తి చేయడమే తన లక్ష్యమన్న చంద్రబాబు నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళతానని ఉద్ఘాటన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ సెల్ఫీ దిగి సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. పోలవరం సహా, యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు ఎలా నిర్మించాలో ఆచరణలో చేసి చూపించామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం ఎంతగా కష్టపడ్డామో, ఇప్పుడున్న చేతగాని ప్రభుత్వం వల్ల జాతీయ ప్రాజెక్ట్ కు ఎంత నష్టం జరిగిందో చూస్తున్నామని తెలిపారు. "పోలవరం పూర్తి కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. తెలంగాణలో సాగు ఆయకట్టు పెరిగితే, ఏపీలో తగ్గిపోయింది. నా సంకల్పానికి ఎవరూ అడ్డు రాలేరు. పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానంతో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే వరకు ఆగేది లేదు. గోదావరిలో వృథాగా పోయే నీటిని రాష్ట్రావసరాలకు వినియోగించుకోవడంపై ఎవరూ అభ్యంతర పెట్టలేరు. పెట్టినా ఉపయోగం ఉండదు" అని స్పష్టం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ముఖ్యాంశాలు • ఈ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం సమస్యాత్మకంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించాడని బ్రిటీష్ వాడు అయినప్పటికీ ఇక్కడి ప్రజలు కాటన్ దొరను తమ హృదయాల్లో నిలుపుకున్నారు. • ప్రజల కోసం, కరవు కాటకాలు లేకుండా చేయడం కోసం అతను మానవత్వంతో పనిచేశాడు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో ఈ ప్రాంతం సస్యశ్యామలైంది. అభివృద్ధికి నమూనాగా నిలిచింది. • రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులతోపాటు 69 ఉపనదులున్నాయి. గోదావరి నది అటు శ్రీకాకుళం, ఇటు రాయలసీమలోని నదులకు మధ్యలో ఉంటుంది. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగిస్తే, రాష్ట్రానికి నీటి సమస్యే ఉండదు. • రాష్ట్రానికి వరం పోలవరం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నాగావళికి, వంశధారకు కనెక్ట్ అవుతుంది. కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలించి, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు అందించాం. కృష్ణాడెల్టాకు అందించాల్సిన 120 టీఎంసీల నీటిని శ్రీ శైలంనుంచి రాయలసీమకు తరలించాం. • పోలవరం సహా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. స్వర్గీయ ఎన్టీఆర్ చొరవతో తెలుగుగంగ, హంద్రీనీవా పూర్తయ్యాయి. • నేను వచ్చాక ముచ్చుమర్రి పూర్తి చేశాను. ఈ మూడు కే.సీ. కెనాల్ ద్వారా బనకచర్ల వద్ద కలుస్తాయి. • పోలవరంతో పాటు చింతలపూడి లిఫ్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రం సుభిక్షమయ్యేది. ఈ ప్రభుత్వం రావడంతో చెప్పలేనంత నష్టం జరిగింది. పోలవరం ఒక చరిత్ర, ఒక కల. పోలవరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపం... • తొలిసారి బ్రిటీష్ ప్రభుత్వంలో 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పోలవరం నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. 1942 అక్టోటర్ 10న బ్రిటీష్ ప్రభుత్వం ప్రాథమిక పరిశీలన కోసం జీవోనెం-3704 PW విడుదల చేసింది. • రకరకాల ప్రతిపాదనలు, పరిశీలనల అనంతరం 340 టీఎంసీల నుంచి 836 టీఎంసీలకు పెంచారు. ఆ స్థాయిలో నీటిని సేకరించాలని ఆలోచించారు. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలు పరిశీలించి, చివరకు ఇప్పుడు నిర్మించిన ప్రాంతాన్ని ఎంపిక చేశారు. 1947-48లో పోలవరం ప్రాజెక్ట్ విలువ రూ.129 కోట్లుగా అంచనావేసి, రామపాద సాగర్ గా ప్రాజెక్టుకి నామకరణం చేశారు. • ఇప్పుడున్న పోలవరం ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం 194 టీంసీలు. మరో 200 టీఎంసీలు అదనంగా వినియోగించుకునే అవకాశముంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. 28.50 లక్షల జనాభాకు తాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి. వాటర్ టూరిజం అభివృద్ధితో పాటు పరిశ్రమలకు నీరు అందించవచ్చు. Quote
MiryalgudaMaruthiRao Posted August 8, 2023 Report Posted August 8, 2023 @RicePlateReddy who is this ra ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.