psycopk Posted August 10, 2023 Report Posted August 10, 2023 Ambati Rambabu: రేణుదేశాయ్ వీడియోపై ఘాటుగా స్పందించిన అంబటి రాంబాబు 10-08-2023 Thu 18:10 | Andhra అమ్మా రేణూ... మా క్యారెక్టర్లు సినిమాల్లో పెట్టవద్దని మీ మాజీకి చెప్పాలన్న అంబటి శునకానందం పొందవద్దని పవన్ కల్యాణ్‌కు చెప్పండని సూచన మీ మాజీకి చెప్పాలంటూ వ్యాఖ్యానించిన ఏపీ మంత్రి రేణుదేశాయ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ట్వీట్ చేశారు. తమ క్యారెక్టర్లను వారి సినిమాలలో పెట్టి శునకానందం పొందవద్దని పవన్ కల్యాణ్‌కు చెప్పాలని సూచించారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని !' అని ట్వీట్ చేశారు. అంతకుముందు, పవన్ మూడు పెళ్లిళ్లపై వెబ్ సిరీస్ తీస్తామనడంపై రేణుదేశాయ్ ఓ వీడియో ద్వారా మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని, రాజకీయంగా తన మద్దతు ఆయనకేనని చెప్పారు. మూడు పెళ్లిళ్ల అంశం వదిలి వేయాలని కోరారు. ఆయన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలనీ రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.